నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...Telugu Satire for Telugu People......!
Welcome
ap elections results లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ap elections results లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శుక్రవారం, మార్చి 22, 2019
శుక్రవారం, మే 03, 2013
పవర్ యాత్ర
ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.
అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట
తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు
ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..
నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?
వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!
అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..
కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
లేబుళ్లు:
andhra politics,
andhra pradesh politics,
ap elections results,
ap politics,
chandrababu,
indian politics,
kcr,
rosaiah,
rosayya,
sonia gandhi,
ys jagan,
ysr
మంగళవారం, డిసెంబర్ 22, 2009
నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్
నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్
ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra politics,
andhra pradesh,
andhra pradesh politics,
ap elections results,
chandrababu,
kcr,
kosta,
lagadapati,
rosaiah,
soniya,
telangana,
ysr
ఆదివారం, నవంబర్ 15, 2009
పేరంటం
ఆదివారం కదా అని హాయిగా లేటుగా నిద్ర లేచి...వాకిట్లో కూచుని పేపర్ తిరగేస్తున్నా.ఈలోగా..పట్టుచీరలు కట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు పొలో మంటూ పది మంది వచ్చారు. మా ఆవిడ స్నేహితులేమో అనుకుని..లోపలకొచ్చి మా ఆవిణ్ణి పిలిచా. ఆ వచ్చిన వాళ్ళు, మా ఆవిడకి బొట్టుపెట్టి, రవికల గుడ్డ పెట్టి ఇంకేదో చెబుతున్నారు. మా ఆవిడ నన్ను పిలిచింది. ఏంటో అనుకుని నేను బయటకెళ్ళా. వాళ్ళలో ఒకరు..అన్నయ్య గారూ..మీరూ తప్పకుండా రావాలి. వొదిన్ని..బాబాఇగారిని తీసుకురావాలి. మర్చిపోవద్దు. అంటూ పొలోమని వెళ్ళి పోయారు...ఏదో గాలి దుమారం లా. నాకేమీ అర్ధం కాలేదు. ఆడవాళ్ళ ఫంక్షన్ కి నేనేమిటీ అని అడిగా మా ఆవిణ్ణి.కిసుక్కున నవ్వింది మా ఆవిడ.
ఆ వచ్చింది పేరంటానికి పిలవడానికి కాదండీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఓటెయ్యడానికి అని అసలు రహస్యం చెప్పింది. ఔరా అనుకున్నా. ఇంతలో దూరంగా మరో బాచ్ వస్తుంటే .. భయపడి బాత్రూం లో చేరా...
బయటకొచ్చాక మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ..ఆవిడిచ్చిన (అదే పిలుపులకొచ్చిన ఆవిడ) ఫాంప్లేట్ చూశా. ఒక పక్క వాళ్ళాయన ఫొటో ..మరో పక్క ఆవిడ ఫొటో ఉన్నాయి. ఆయన మా కాలనీ చుట్టుపక్కల ఓమాదిరి పేరున్న లీడరే..ఏమైనా గొడవలూ గట్రా ఐతే ఆయన తప్పకుండా అక్కడుంటాడు..ఐతే గోడవ తీర్చడానికి లేకపోతే గొడవపడుతూనో ఉంటాడు..ఈ మధ్యే ఒక ఆటో డ్రైవర్ ని ఐదు రూపాయలు ఎక్కువడిగినందుకు పళ్ళూడగొట్టి.అవినీతి పై తన ప్రతాపం చూపించిన మహా లీడర్ ఆయన. ఆయనకి మా కాలనీలో ఒకటి బయటింకెక్కడో మూణ్నాలుగు వైన్ షాపులున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. మరి ఏకంగా ఆయనే నుంచోకుండా..వాళ్ళావిణ్ణి ఎందుకు నుంచో పెట్టాడా అనుకున్నా. ఈ నియోజకవర్గం లో స్త్రీల రిజర్వేషన్ ట .. గెలిచేది ఆవిడే అయినా పాలన వారిదేనట..ఇంకొన్ని కాంట్రాక్టులు ఈజీ గా రావడానికి వీలుగా మనమె మెంబరైపోతే ఇంకా హాయి గదా అని.ఇలా.....
సరే ఆ విషయం వదిలేస్తే ఓటెవరికి వెయ్యాలో అర్ధం కావట్లేదు. మొన్నటిదాకా కలిసున్న తెలుగు దేశం. టీ ఆర్ ఎస్ విడిపోయారో కలిసే ఉన్న్నారో అర్ధం కావట్లేదు. చిరంజీవి తప్ప మరెవరు ఆ పార్టీయో అర్ధం కాని ప్రజా రాజ్యం...లోక్ సత్త జయ ప్రకాష్ దీ అదే పరిస్థితి...ఇక వై ఎస్ లేని కాంగ్రెస్. ఎవరు ఎవరితో కలిసున్నారో..కలిసి లేరో..ఏది మిత్ర పక్షమో..ఏది ప్రతిపక్షమో..అసలు తెలీట్లేదు.
పాత బట్టలకి స్టీల్ సామానిస్తాం, సత్తుబిందెలకి మాట్లేస్తాం.,అంటూ అరుస్తూ తిరిగే వాళ్ళలా ఎలక్షనప్పుడు మీ రోడ్లు బాగుచేస్తాం..మంచినీళ్ళిప్పిస్తాం, ప్రాబ్లెంస్ తీరుస్తాం, అంటూ వీధి వీధి..ఇల్లు ఇల్లు తిరిగి చాటింపు వేసే వీళ్ళు గెలిచాక ఎక్కడుంటారో..ఏం చేస్తారో తెలీదు. పెద్ద వాళ్లంతా ఎసెంబ్లీలో కొట్టుకుంటుంటే..వీళ్లంతా ఇక్కడేమో..ఏంటో ఈ ఎలక్షన్ లేమిటో.ఈ గొడవలేమిటో.
ఫ్లై ఓవర్ లు కూలితే తప్పు అవతల వాళ్లది.బాగుంటే ఘనత మనది..మినిస్టర్లు..సినిమా వాళ్ళు తిరిగే రోడ్లు అద్దాల్లా ఉంటాయి..,,మిగతావి అధ్వాన్నం గా ఉంటాఇ.. మళ్లీ విదేశాల్లో సర్వేలు.నివేదికలు..బడ్జెట్లు...గొడవలు..ఓకే అయ్యే నాటికి మళ్ళీ ఎలక్షన్ లు..షరా మామూలే..ఓకే మీరెళ్ళే సరికి మీ ఓటుంటే వేసి రండి...
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
గురువారం, నవంబర్ 05, 2009
మాయాజాలం
మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు. సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.
ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.
ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.
మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra politics,
andhra pradesh politics,
ap elections results,
current affairs,
flood in ap,
rosaiah,
sonia,
soniya,
y s rajasekhar reddy,
ys jagan,
ysr
శనివారం, అక్టోబర్ 31, 2009
శుక్రవారం, అక్టోబర్ 23, 2009
గెలిచిన వేళనే చూడాలీ
గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.
నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.
ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.
ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు. రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '
జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..
నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..

bharat,
congress,
current affairs,
indian politicis,
latest issue,
manmohan singh
శనివారం, అక్టోబర్ 10, 2009
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.....
అదే సామెత గుర్తొస్తోంది...ప్రస్తుతం ఆంధ్ర పరిస్థితి చూస్తుంటే..ఒక పక్క ఇళ్ళు మునిగిపోయి జీవనం అస్తవ్యస్తమై పోయి జనం బాధ పడుతుంటే...
టీ వీ చానెళ్ళ వాళ్ళు ---అధికారులు స్పందించలేదు..జనం కష్టాలు పడుతున్నారు..దొంగల భయం..అదీ ఇదీ అంటూ కధనాలు...ఇప్పుడు ఏ ప్రాంతం మునుగుతుంది..ఏది తేలుతుంది..కాంగ్రెస్ వాళ్ల వల్లేనా ఇది అంతా అంటూ చర్చా కార్యక్రమాలు. ఒక్కళ్ళైనా...ఎమెర్జెన్సీ నంబర్లు స్క్రోఅలింగు వెయ్యడం కానీ..ఖాళీ చెయ్యాల్సిన ప్రాంతాల వివరాలు చెప్పడం కానీ జరిగిందా? ఎంతసేపూ జరిగే విషయాన్ని భూతద్దం లో చూపించి..అందరికన్నా ముందు మేము అనిపించుకోవడం తప్ప ..ప్రభుత్వాన్నో ఇంకోళ్ళనో విమర్శించడం తప్ప నిజంగా సామాజిక బాధ్యత తో ప్రవర్తించడం వీళ్లకి ఎప్పుడు వస్తుందో..ఎంతసేపూ మాకు డబ్బులు పంపండి..బట్టలు పంపండి అంటూ విడి విడి గా స్క్రోలింగులు ఇచ్చుకోవడం తప్ప..సరిగ్గా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నేమన్నాయి..దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది..ఇదే చర్చ..చ చ.
టెక్నాలజీ పెరిగినా ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోతున్నామో తెలీదు. ఏమీ లేని ఆ రోజుల్లోనే వరదలో ఇంకో విపత్తో వస్తే, ఆకాశ వాణి ద్వారా...ఎమెర్జెన్సీ సర్వీసుల వివరాలు..సహాయ శిబిరాల వివరాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఎంతో మందికి సాయ పడ్డారు.
మరి ఈ నాటి మీడియా..?????
అటు రాజకీయాలు చూస్తే..ఇంతటి విపత్తు వచ్చినప్పుడు కూడా..కాంగ్రెస్ గవర్నమెంటు అవినీతి జల యజ్ఞ్మ్ వల్లనే ఈ విపత్తుకు కారణం అంటూ ప్రతిపక్షాలు..ఇది వరకు పాలించిన చంద్రబాబు విధానాల వల్ల నే అంటూ పాలక వర్గం ...కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇలాంటి స్మయం లో నైనా కలిసి ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది..కదా. ఇక మన కే సీ ఆర్ గారైతే ఇంకో అడుగు ముందుకేసి..జలయజ్ఞ్మ్ అవినీతి వారం రోజుల్లో బయటపెడతా..లేక పోతే ఉరేసుకు చస్తా అని ప్రకటించారు. సారూ కే సీ ఆరు..జనానికి ఇప్పుడు నిజాలు...అవినీతి గురించిన వివరాలు కాదు కావాల్సింది...తిండి, గుడ్డ ..గూడు...ఆరోగ్యం ...కుదిరితే ఆ విషయం ఆలోచించండి..ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రబ్లెం ఒకటే...'వరద '. ముక్కు నేల కి రాస్తావా ? నేనైతే ఉరేసుకుంటా ...అంటూ చాలెంజ్ ఇప్పటికి ఎన్ని విషయాల్లో ఎన్ని సార్లు చేసారో గుర్తు తెచ్చుకోండి..ఎంత మంది తో ముక్కు రాయించారో..ఎన్ని సార్లు ఉరేసుకున్నారో ?
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
andhra pradesh,
andhra pradesh politics,
ap elections results,
ap politics,
chandrabaabu,
current affairs,
flood in ap,
floods,
kcr,
manmohan singh,
rosaiah,
sonia,
soniya
గురువారం, మే 21, 2009
ఫీల్డు మారిందా..షీల్డు గోవిందా...
ఫీల్డు మారిందా..షీల్డు గోవిందా...
పుడుతూనే తల్లిని పోగుట్టుకుంటాడు, తండ్రి చీ కొడతాడు,,ఐనా బోరింగు పంపు లో నిళ్ళు తాగి పీదవాడవుతాడు మన హీరో..కోటీస్వరుడి కూతురు ఈ హీరోని చూసి మనసు పారేసుకుంటుంది. ఇంక వెంటనే పాట ఫారిన్ లొకేషన్ లో....ఐన వెంటనే ఒక చేసింగు సీను..ఫైటింగూనూ...కట్ చేస్తే..హీరఓయిన్ ని ఎక్కడికో పంపేస్తారు వాళ్ళ కసాయి తండ్రి.
హీరో అడుక్కుతింటూనే ఐ ఏ ఎస్ పాసయి వాళ్ళ వూరికే కలెక్టర్ గా వస్తాడు..తను అడుక్కుతినే వాడిగా అవడానికి కారణమైన వాళ్ళమీద రివెంజి తీర్చుకుంటాడు..
పోలీసు ఆఫీసరైన మన హీరోగారు..చండ ప్రచండమైన విలన్ గాంగుని నామ రూపాల్లేకుండా కాల్చి అవతల పారేస్తాడు..మిగిలిన వాళ్ళు ఆయన కంట్లోని 'అగ్ని ' కి ఆహుతైపోతారు..
మూటలు మోసే ఒక మేస్త్రీ తన స్వయంకౄషితో ఎంచక్కా లేబర్ మినిస్టరైపోయి చాలా మంది బాక్స్ ఆఫీసులు బద్దలుకొట్టేస్తారు..ఒక ఖాను గారు లగాను రద్దు కోసం ఇంగిలీషు వాళ్ళతో యాభై ఓవర్ల మాచులు పాపం అప్పట్లో అరవై ఓవర్లుండేవని మర్చిపోయి మాచు గెలిపిస్తాడు
మరో ఖాను గారేమో ఏకంగా చెక్క బాటులు పట్టుకున్న అమ్మాయిలకి హాకీ నేర్పించి చక్ దే ఇండియా అని స్ఫూర్తి నింపుతాడు..
పెద్దన్నయ్యలని అదే నండీ బిగ్గు బ్రదర్లని చూసి పొడుగుకాళ్ల సుందరి శిల్పా సెట్టి కూడా ఆ జాబితాలోకి చేరింది...
ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే సినిమాల్లో ఏదైనా చెయ్యగల సమర్ధులైన మన హీరోలు ఇతర రంగాల్లో నెగ్గుకు రావడం కొంచెం కష్టమైన పనే అని అర్ధం అవుతోంది.రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లు..క్రికెట్టు లో డబ్బు పెట్టిన స్టార్లూ పాపం కాలం కలిసి రాక ఇమేజి డామేజి అయి ..........తీసుకున్న నిర్ణయం ...ఫ్లాపు సినిమా అయి ప్రస్తుతం డౌట్ ఆఫ్ ఇండియా తో ఉన్నారు...మన ఫీల్డు ఏల్దాం బాసు మనకెందుకు పక్కోడి గోల..అవన్నీ చూసి ఆనందించాల్సిందే కానీ చేసి కాదు..డబ్బలు తిరిగొచ్చాక క్లైమాక్సు మారిస్తే ఏం లాభం..

chiranjeevi,
congress,
kcr,
nbk,
ntr,
prp tdp,
sharukh khaan,
soniya,
ysr
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)