శ్రీ రాముని దయ చేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ !
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ !
అప్పిచ్చు వాడు వైద్యుడు
ఎప్పుడు నెడ తెగక పారు ఏరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడ కున్నట్టి యూరు చొరకుము సుమతీ !
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ !
కూరిమి గల దినములలో
నేరములెన్నడును కలుగ నేరవు మరియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి శుభ లగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జనియించినపుడు కలుగదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధు జనుల దోసము సుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ !
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ !
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడి గల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ !
వినదగు నెవ్వరు జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ !
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయు వాడె నేర్పరి సుమతీ !
అల్లుని మంచి తనంబును
గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ !
ఒల్లని సతి నొల్లని పతి
ఒల్లని చెలికాని విడువనొల్లని వాడే
గొల్లండు కాని ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ !
ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చు వాడె దాత ధరిత్రిన్
సొకోర్చు వాడె మనుజుడు
తేకువ కల వాడె వంశ తిలకుడు సుమతీ !
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలచి యన్న మడుగని నోరున్
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను దవ్వినట్టి గుంటర సుమతీ !
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడ నున్న వృషభము
జదువని యా నీచు కడకు జనకుర సుమతీ !
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వ గూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ !
ఇచ్చునదె విద్య రణమున
జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !
ఓడల బండ్లును వచ్చును
ఓడలునా బండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమి లేమి వసుధను సుమతీ !
కాదు సుమీ దుస్సంగతి
పోదు సుమీ కీర్తి కాంత పొందిన పిదపన్
వాదు సుమీ అప్పిచ్చుట
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ !
కులకాంత తోడ నెప్పుడు
కలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !
కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు తండ్రి గుణముల చెరుచున్
జెరకు తుద వెన్ను పుట్టిన
జెరకున దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ !
కోమలి విశ్వాసంబును
బాములతో చెలిమి యన్య భామల వలపున్
వేముల తియ్యదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !
కొంచెపు నరు సంగతి చే
నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి గరచిన
మంచమునకు బెట్లు వచ్చు మహిలో సుమతీ !
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు తగన్
హేమంబు కూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ !
చుట్టములు గాని వారలు
చుట్టములము నీ కటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ !
చేతులకు దొడవు దానము
భూతల నాథులకు దొడవు బొంకమి ధరలో
నీతియ తొడవెవ్వారికి
నాతికి మానంబె తొడవు నయముగ సుమతీ !
తన యూరి తపసితనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
దన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ !
తన కలిమి యింద్ర భోగము
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్
దన చావు జల ప్రళయము
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ !
తన వారు లేని చోటన్
జనువించుక లేని చోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ !
తాననుభవింప నర్థము
మానవ పతి జేరు గొంత మరి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ !
ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ !
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మరి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ !
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాల వాని నటు వెలయాలిన్
నమ్మకు మంగడి వానిని
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ !
నయమున బాలున్ ద్రావరు
భయమునను విషంబునైన భక్షింతురుగా
నయమెంత దోషకారియొ
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ !
నవరస భావాలంకృతి
కవితా గోష్టియును మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ !
నవ్వకుమీ సభ లోపల
నవ్వకుమీ తల్లి తండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమగు సుమతీ !
పగవల దెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ !
పాలను కలసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
పాల చవి జెరచు గావున
పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ !
పాలసునకైన యాపద
జాలింబడి దీర్ప వలదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటు గాక మేదిని సుమతీ !
పురికిని ప్రాణము గోమటి
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్
గరికిని ప్రాణము తొండము
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ !
పులి పాలు తెచ్చి యిచ్చిన
నలవడగా గుండె గోసి యరచే నిడినన్
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ !
పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ !
ఉత్తమ గుణములు నీచున
కెత్తెరగున గలుగ నేర్చు నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ !
శుభముల పొందని చదువును
నభినయముగ రాగరసము నందలి పాటల్
గుభ గుభలు లేని కూటమి
సభ మెచ్చని మాటలెల్ల చప్పన సుమతీ !
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ !
సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ !
వేసరపు జాతి గానీ
వీసము దా జేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గానీ
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ !
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ !
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ !
అప్పిచ్చు వాడు వైద్యుడు
ఎప్పుడు నెడ తెగక పారు ఏరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడ కున్నట్టి యూరు చొరకుము సుమతీ !
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ !
కూరిమి గల దినములలో
నేరములెన్నడును కలుగ నేరవు మరియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి శుభ లగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జనియించినపుడు కలుగదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధు జనుల దోసము సుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ !
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ !
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడి గల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ !
వినదగు నెవ్వరు జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ !
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయు వాడె నేర్పరి సుమతీ !
అల్లుని మంచి తనంబును
గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ !
ఒల్లని సతి నొల్లని పతి
ఒల్లని చెలికాని విడువనొల్లని వాడే
గొల్లండు కాని ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ !
ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చు వాడె దాత ధరిత్రిన్
సొకోర్చు వాడె మనుజుడు
తేకువ కల వాడె వంశ తిలకుడు సుమతీ !
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలచి యన్న మడుగని నోరున్
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను దవ్వినట్టి గుంటర సుమతీ !
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడ నున్న వృషభము
జదువని యా నీచు కడకు జనకుర సుమతీ !
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వ గూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ !
ఇచ్చునదె విద్య రణమున
జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !
ఓడల బండ్లును వచ్చును
ఓడలునా బండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమి లేమి వసుధను సుమతీ !
కాదు సుమీ దుస్సంగతి
పోదు సుమీ కీర్తి కాంత పొందిన పిదపన్
వాదు సుమీ అప్పిచ్చుట
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ !
కులకాంత తోడ నెప్పుడు
కలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !
కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు తండ్రి గుణముల చెరుచున్
జెరకు తుద వెన్ను పుట్టిన
జెరకున దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ !
కోమలి విశ్వాసంబును
బాములతో చెలిమి యన్య భామల వలపున్
వేముల తియ్యదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !
కొంచెపు నరు సంగతి చే
నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి గరచిన
మంచమునకు బెట్లు వచ్చు మహిలో సుమతీ !
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు తగన్
హేమంబు కూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ !
చుట్టములు గాని వారలు
చుట్టములము నీ కటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ !
చేతులకు దొడవు దానము
భూతల నాథులకు దొడవు బొంకమి ధరలో
నీతియ తొడవెవ్వారికి
నాతికి మానంబె తొడవు నయముగ సుమతీ !
తన యూరి తపసితనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
దన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ !
తన కలిమి యింద్ర భోగము
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్
దన చావు జల ప్రళయము
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ !
తన వారు లేని చోటన్
జనువించుక లేని చోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ !
తాననుభవింప నర్థము
మానవ పతి జేరు గొంత మరి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ !
ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ !
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మరి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ !
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాల వాని నటు వెలయాలిన్
నమ్మకు మంగడి వానిని
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ !
నయమున బాలున్ ద్రావరు
భయమునను విషంబునైన భక్షింతురుగా
నయమెంత దోషకారియొ
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ !
నవరస భావాలంకృతి
కవితా గోష్టియును మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ !
నవ్వకుమీ సభ లోపల
నవ్వకుమీ తల్లి తండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమగు సుమతీ !
పగవల దెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ !
పాలను కలసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
పాల చవి జెరచు గావున
పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ !
పాలసునకైన యాపద
జాలింబడి దీర్ప వలదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటు గాక మేదిని సుమతీ !
పురికిని ప్రాణము గోమటి
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్
గరికిని ప్రాణము తొండము
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ !
పులి పాలు తెచ్చి యిచ్చిన
నలవడగా గుండె గోసి యరచే నిడినన్
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ !
పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ !
ఉత్తమ గుణములు నీచున
కెత్తెరగున గలుగ నేర్చు నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ !
శుభముల పొందని చదువును
నభినయముగ రాగరసము నందలి పాటల్
గుభ గుభలు లేని కూటమి
సభ మెచ్చని మాటలెల్ల చప్పన సుమతీ !
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ !
సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ !
వేసరపు జాతి గానీ
వీసము దా జేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గానీ
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి