Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, నవంబర్ 22, 2017

ఆధార్

ఆధార్ - లింకింగే అనుకున్నా, అన్‌లింక్ కూడా చేస్తుందన్నమాట ;)


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, నవంబర్ 17, 2017

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది

ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది

ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ

బాబు ఆన అయ్యిందేమో బావ దరికి నందియే... కదిలొస్తానంది! నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, అక్టోబర్ 26, 2017

Whatsapp


గ్రూపులు కట్టడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి - వాట్సాప్, ఫేసు బుక్కులు (ఫణిమాధవ్ కస్తూరి)
నా పేరు తీసేసి పోస్ట్/షేర్ చేసిన వారికి 81% జీ ఎస్ టీ తగులుగాక ..


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

వాట్సాప్


గ్రూపులు కట్టడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి - వాట్సాప్, ఫేసు బుక్కులు (ఫణిమాధవ్ కస్తూరి)
నా పేరు తీసేసి పోస్ట్/షేర్ చేసిన వారికి 81% జీ ఎస్ టీ తగులుగాక ..


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, జులై 24, 2017

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, జూన్ 30, 2017

GST - God Save from Taxes

#GST నెలంతా కష్టపడి పనిచేసి సంపాదించిన జీతానికి ఇన్‌కం టాక్స్

బాంక్ వాడిచ్చే డెబిట్ కార్డ్ వాడినందుకు 1% సర్వీస్ టాక్స్

క్రెడిట్ కార్డ్ ఐతే 2% టాక్స్

పెట్రోలు దగ్గరనుంచి బియ్యం, పప్పు దాకా ఏదికొన్నా ఏదో టాక్స్

వ్యాట్, సర్వీస్ టాక్స్... స్వచ్చ భారత్ సెస్సు.. ఇంకోటి మరోటి..

ఇప్పుడు కొత్తగా మరోటి మొదలు.. అవన్నిటి బదులు అంటున్నారు కానీ...

రేప్పొద్దున్న ఏ షాప్ కెళితే ఎవడు ఏమి రేటు చెప్తాడో.. తెలీదు.

అడిగింది కట్టడమే కానీ అర్ధం తెలీదు కాబట్టి... కట్టెయ్యడమే..

ఒకటే చేయగలం,,,,ప్రార్ధించడం..

GST :
God
Save from
Taxesనచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

బుధవారం, మార్చి 29, 2017

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

                నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  

ఫేస్ బుక్ రాశి :

ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం
రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు

ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.

వాట్సాప్ రాశి :

ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు
రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం

ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకులు, కాపీ పేస్టు కధలు.. రాజకీయ చర్చలు. పనికొచ్చేవి లేకపోయినా. పని చెడగొట్టడానికి చాలా శీర్షికలు. బ్లూటిక్కుల వల్ల చిక్కులు. అడ్డమైన ఫొటోలు, వీడియోల వల్ల మీకు, మీ ఫోనుకు మెమరీ లాసు.

మొబైల్ ఫోన్ రాశి :

ఆదాయం :  ఇన్ కమింగు                       వ్యయం  : అవుట్ గోయింగ్
రాజ పూజ్యం :  కస్టమర్ కేర్ కాల్స్ లో        అవమానం : ఆఫీసు, హౌస్ బాస్ ల కాల్స్ తో

ఈ రాశి వారికి ఫోన్ మోడల్స్ తోనే అవమానం ప్రారంభం. ఇవాళ కొన్నదాని కన్నా కొంచెం ఎక్కువ ఫీచర్లతో మరో మోడల్ రేపే విడుదలయ్యే అవకాశం. కెమెరా, ఫోన్ స్పీడు, ఇతర ఫీచర్లన్ని బాగుంటే సిగ్నల్ ప్రాబ్లెం అదీ బాగుంటే బాటరీ డవున్ అయ్యే సూచనలు ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడే వాళ్లకి ప్రాణాపాయం లేదా భారీ ప్రమాదాలు సూచిస్తున్నాయి. వాట్సాపులున్నవారు ఫోన్ ఇంట్లో వాళ్ళకు కనిపించినచో విపత్కర పరిస్థితుల్లో ఇరుక్కోవచ్చు. గరల్ ఫ్రెండ్స్ కోసం మీదగ్గరకన్న మంచి మోడల్ కొనిపెట్టడం వల్ల ఆర్ధికంగా నష్టం.

జియో కస్టమర్స్ :

ఆదాయం : మార్చి 31 వరకు ఉచితం           వ్యయం  : నెల నెలా బాదుడు
రాజ పూజ్యం : అంబానీకి                    అవమానం : సిగ్నల్ దొరకని నీకు

ఈ మధ్యే కనుగొన్న ఈగ్రహం వల్ల, ఇతర మొబైల్ కంపెనీలకు గ్రహణం పట్టుకున్న సూచనలున్నా.. అది కస్టమర్లకు లాభమే తెచ్చింది. వోల్ట్ మీద ఆధారపడ్డం వల్ల ప్రారంభంలో ఇబ్బందులు తప్పవు. మార్చి 31 వరకు గ్రహ స్థితి బాగానే ఉన్నా.. ఏప్రిల్ 1 నుండి ఉచిత మిత్రులను కోల్పోయే అవకాశం.
ఈ ఫన్‌చాంగం కేవలం సరదాగా నవ్వుకోడానికి రాసిన వ్యంగ్య గల్పిక మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు. 
అందరికీ శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

ఆధార్

ఆధార్ - లింకింగే అనుకున్నా, అన్‌లింక్ కూడా చేస్తుందన్నమాట ;) నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

LinkWithin

Related Posts with Thumbnails

Alexa