సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ :
రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ఆపండి అని గొడవ. కారణం ఏంటి అంటే అతని రెండో భార్య (ఇషిత - ఈమే హీరోయిన్) కనపడకుండా పోయింది.. అది ఈ మూడో భార్య (ఇంకా పెళ్ళి జరగలేదు.. బహుశా ఒక నెలలో జరగొచ్చు), ఆమె కుటుంబ సభ్యులే కారణం అని అభియోగం. విచిత్రం ఏమిటంటే.. ఆ కనపడకుండా పోయిన అసలు భార్య తల్లి తండ్రులు ఆ వివాహ వేడుకలో అతిధులుగా ఉండడం. ఇప్పటికే కిడ్నాపు, మర్డరు, పిచ్చిపట్టడం, మతిమరుపు వల్ల భార్యని మర్చిపోవడం, లాంటి వివిధ పైత్యాలు చూపడం ఐపోగా.. ఈ పెళ్ళి ముందు దాకా, సదరు హీరోయిన్ గారు మారు వేషం లో పనిమనిషిగా అదే ఇంట్లో భర్త దగ్గర పనిచేస్తూ, ఆఫీసుకెళ్ళి పనిచేసుకోవడం.. లాంటి త్యాగభరితమైన ట్విస్టులు కూడా చాలా జరిగాయి.. ఇదంతా నాకెలా తెలుసు నేను ఫాలో అవుతున్నానా అనుకోకండి.. గత 5-6 నెలలలో అప్పుడప్పుడు ఆ సీరియల్ సమయంలో టీ వీ ముందుకు రావడం వల్లనున్నూ, కధ ఎలాగు 'కొనాసాగుతూ ఉండడంవల్లనున్నూ నాకు కలిగిన కనువిప్పు.. (ఇక్కడ నానోదయం అని రాసా కానీ ఫేసుబుక్కోడు ఇంకా ఒప్పుకోవట్లేదు_ యాపిల్ జనాలను కాపాడ్డానికి - ఈ సీరియల్స్ నుండి మనల్ని ఎవరు కాపాడతారో )
ఇషిత..రమణ్ భల్ల..మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే ????
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి