Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
india లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
india లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మార్చి 22, 2019

శుక్రవారం, జూన్ 30, 2017

GST - God Save from Taxes

#GST నెలంతా కష్టపడి పనిచేసి సంపాదించిన జీతానికి ఇన్‌కం టాక్స్

బాంక్ వాడిచ్చే డెబిట్ కార్డ్ వాడినందుకు 1% సర్వీస్ టాక్స్

క్రెడిట్ కార్డ్ ఐతే 2% టాక్స్

పెట్రోలు దగ్గరనుంచి బియ్యం, పప్పు దాకా ఏదికొన్నా ఏదో టాక్స్

వ్యాట్, సర్వీస్ టాక్స్... స్వచ్చ భారత్ సెస్సు.. ఇంకోటి మరోటి..

ఇప్పుడు కొత్తగా మరోటి మొదలు.. అవన్నిటి బదులు అంటున్నారు కానీ...

రేప్పొద్దున్న ఏ షాప్ కెళితే ఎవడు ఏమి రేటు చెప్తాడో.. తెలీదు.

అడిగింది కట్టడమే కానీ అర్ధం తెలీదు కాబట్టి... కట్టెయ్యడమే..

ఒకటే చేయగలం,,,,ప్రార్ధించడం..

GST :
God
Save from
Taxes







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, మార్చి 17, 2011

మగానుభావులు

జపాను దేశం లో భూకంపం
భారత దేశం లో భూ పంపకం





పంచ భూతాలనూ కబ్జా చేయగల నాయకులు 
లంచాలతో మాయ చేయ గల మగానుభావులు 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మంగళవారం, అక్టోబర్ 05, 2010

కామన్ v/s వెల్త్




 కామన్ వెల్త్ గేములు ఆరంభం అదిరింది . ఆటలకన్నా ముందు పాటల కార్యక్రమం చాలా బాగుందిట..
మన ఆంధ్రుడు పతకం గెలిచేసి..పతాకం పాతేశాదు కూడా..మరి ఆకాశంలో మెరిసే స్టార్లు ఏం తెస్తారో చూడాలి..
కాస్ట్లీ ఆటలు   ఆడేవాళ్లు, కోట్లు సంపాదించే వాళ్ళు, యాడ్లలో కనిపించేవాళ్ళకి ఉండే ఆదాయం..గుర్తింపు ఈ " కామన్ " ఆటగాళ్ళకు ఉంటుందా...
వీళ్ళు ఏకలవ్యులుగా ఉండిపోతారా...అర్జునులుగా గుర్తింపబడాతారా ఎప్పటికైనా ? వైట్ అండ్  సీ ..






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మంగళవారం, ఏప్రిల్ 06, 2010

"నిఖా"ర్స్


సా"నిఖా"...సానియా నిఖా మళ్ళీ డౌట్ లో పడింది..పాపం ఆమెకింకా మంచి రోజులు వచ్చినట్ట్లు లేదు. అసలు 100 కోట్ల భారతీయుల్లో ఎవరూ దొరక్క పాకీ వీరుణ్ణి వరించింది..అది నిజమైన ప్రేమేనా..ఎందుకంటే పాపం షోయబ్ క్రికెట్ కన్నా మిగతా విషయాల వల్లే ఎక్కువ ఫేమస్..మరి ఈమెని కూడా అలానె వర్రించాడా....అదే వరించేడా...అని ఓ డౌట్.ఇంత సడెన్ గా షోయెబే నా మొగుడు అని ప్రకటించాల్సిన 'అవసరం ' ఎందుకొచ్చింది..? గొడవ సద్దుమణిగాక చేసుకోవచ్చు కదా...ఆగేంత "టైము లేదేమో???........కళ్యాణ మొచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు..కానీ కక్కొచ్చినాక కళ్యాణం ఆపలేము కదా.....!!!!!

సావిత్రి నుంచీ సానియా దాకా ...అసలు ఈ సెలెబ్రిటీలే ఇంత..పూర్వం రోజులనుంచీ అంతే...సావిత్రి గారు...ఎందరు వద్దన్నా పెళ్ళై పోయిన  జెమినీ గణేశన్ ని చేసుకుని..తరువాత జీవితాంతం బాధలు అనుభవించి...ఆ దిగులు తోనే మరణించిందంటారు..మధుబాల, దివ్య భారతి, పర్వీన్ బాబీ ఇలా ఎందరో..నిన్నటి తరం కలల రాణి శ్రీదేవి కూడా ఎందరో ప్రపోస్ చేసినా వద్దని పెళ్లై పోయిన బోనీ కపూర్ నే చేసుకుంది..ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పుకుంటున్నా రెండో నంబరు గానే మిగిలిపోయింది..ఈ ఆల్ ఇండియా మాజీ నంబర్ వన్. సానియా వయసు కూడా ఎక్కువ కాదు..ఇంకా ఓ రెండు మూడేళ్ళు టెన్నిస్ ఆడుకోవచ్చు..ఇంత హటాత్తుగా పెళ్ళి...దుబాయి లో కాపురం..ఇండియా-పాకిస్తాన్ మధ్య తిరగడం ఇవన్నీ ఇంత సడెన్ గా ఎందుకో..  ????

ఇది "నిఖా"ర్సైన ప్రేమా? లేక ?.............. ఏమో టెన్నిస్ కోర్టులో లా చమటలు కక్కుతూ ఇలా కోర్ట్ వ్యవహారాల దాకా తెచ్చుకునే లా ఇప్పుడు ఈ హడా"విడి" పెళ్లి బదులు...మొత్తం తెలుసుకున్నాక
గ్రాండ్ స్లాం లాగా గ్రాండ్ సలాం ల మధ్య ...చేసుకుంటేనే ఇన్నాళ్ళ తన కెరీర్ కి మచ్చ లేకుండా ఉంటుంది...లేకపోతే..??అనవసరమంగా జీవితమంతా బాధ పడాల్సి వస్తుంది..


టెన్నిస్ ద్వారా భారత దేశానికి పేరు తెచ్చిన సానియా పై అభిమానం తో..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తుమ్మెద


'తుమ్మెద' అంటే .....అదేదో పూల మీద వాలే 'తుమ్మెద' అనుకునేరు. ఇది జలుబు వల్ల వచ్చిన వైరస్ తో కూడిన తుమ్ము...'తుమ్మెద' అంటే...నాలుగు మైళ్లు పరిగెడుతున్నారు..ప్రజలు.

భారత దేశం లో అస్సలు పారిసుద్ధత ఉండదు...అంతా చెత్త...ఇక్కడ జనాలకు ఆరోగ్య సూత్రాలు తెలీదు అనే విదేసీయుల్ని...కొందరు స్వదేశీయులనీ చూస్తుంటే ఆస్చర్యమేస్తుంది. ఎందుకంటే...ఈ మధ్య వచ్చిన జబ్బులు ఐడ్స్, బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ ఇంకా కొన్ని రకాల జబ్బులు..అన్నీ విదేశియులు మనకిచ్చిన కానుకలే..అవి అక్కడ నుంచీ దిగుమతి ఐన మహమ్మారులే.......మనవి కావు అని మనవి చేస్తున్నా.

సుబ్బరంగా వయసు వాచ్చాక పెళ్ళి...ఒకరే పెళ్ళాం,,,,హాయిగా సంసారం...పిల్లలు..ఇదీ మన సంప్రదాయం...కొన్ని రోజులు కలిసుండీ...ఒక్కోసారి ఏళ్ళతరబడి కూడా..నచ్చితే పెళ్ళి...నచ్చకపోతే...చెల్లు..అంటూ వదిలేసే డేటింగు వాళ్ళ విధానం..దేనివల్ల నష్టం....ఐడ్స్ కష్టం..అన్నది జనాలే నిర్ణయించుకోవాలి.

చిన్నప్పటినుంచీ తుమ్మొస్తే..చెయ్యి అడ్డం పెట్టుకోమని మనం పిల్లలకి నేర్పుతాం,..ఇప్పుడూ అదే చెబుతున్నారు...కాకపోతే..చెయ్యి స్థాయి నుంచీ...మాస్కు స్థాయి వరకు వచ్చింది..ఇంకా ఇప్పుడు అవతల వాడు తుమ్ముతుంటే..మనం అడ్డు పెట్టుకోవాల్సి వస్తోంది..దీనికి మందు...మన హోమియోలోనే ఉందిట..ఎప్పుడూ పాస్చాత్యుల్ని చూసి ఇన్ ఫ్లు యెన్స్ అవుతామనఒ ఏంటో దాని పేరు కూడా ఇంఫ్లుయెంజా...ట..అంతే కాదు..తులాసాకు, వేపాకు వేడి నీళ్లలో వేసి వాసన చూసినా తగ్గుతుందట...మరి.

ఈ మధ్య వస్తున్న చాలా జబ్బులు..పేర్లు కూడా కొన్ని తెలీవు..కిడ్నీ లో రాళ్ళు, గాలిబ్లాడర్ లో రాళ్ళు,,.ఊబకాయం వొళ్ళు....ఇంకా చాలా..... కేవలం ఆహార పద్ధతుల వల్లే పెరుగుతున్నాయట. క్యాబేజీ...టమాటా....లాంటివి ఎక్కువేసి చేసిన...సాండు విచ్(ఇసుక దెయ్యం అనొచ్చేమో), చీజ్ వేసిన బర్గర్లు..పిజ్జాలు...లాంటి ఫుడ్డు ఎక్కువయ్యాకనే ...ఇలాంటి జబ్బులూ పెరిగాయి అని చెప్పడానికి సర్వేలు అక్కర్లేదేమో..
లావు తగ్గడానికి ఏమి చెయ్యాలి డాక్టర్ అని పేరొందిన..కార్పొరేట్ హాస్పిటల్ లో ఫారిన్ లో ట్రైన్ అయి ఫ్లైట్ లో వచ్చిన డైటీషన్ ని అడిగితే...ఎల్ డీ ఎల్...వీ డీ ఎల్,,హెచ్ డీ ఎల్...లిపిడ్ ప్రొఫైల్ లాంటి వంద టెస్టులు చేసి..
ఫాట్ ఫూడ్డు తగ్గించండి..ఆయిల్స్ తినకండి...పచ్చి కూర ముక్కలు..కీరా..కారట్ తినండి...మొలకెత్తిన ధాన్యాలు తినండి..రాగి/ఓట్స్, లేక పోతే ఆకుకూరల గంజి తాగండి (ఇంగ్లీసులో సూప్ అంటారు)...రోజూ నడవండి...అంటూ కారులో వచ్చిన వాణ్ణి ఫీజు గుంజి...స్వంత కాళ్ళ మీద నడిపిస్తారు...

సో నే చెప్పొచ్చేదేంటంటే..మన పద్ధతుల్లో మనం ఉంటే.....ఏ ప్రాబ్లెంసూ రావు.
కష్టం లో ఉన్న భూమిని (పంది) వరాహ రూపం లో ఆదుకున్న వేద భూమి మనది...పందుల వల్ల స్వయన్ ఫ్లూ...వ్యాపింపచేసే..విదేశీ అనుకరణలొద్దు మనకి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

బుధవారం, ఆగస్టు 19, 2009

ఇన్ ఫ్లూ ఎన్సా


ఇన్ ఫ్లూ ఎన్సా

అ ప్పుడెప్పుడో చాలా యుగాల క్రితం హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రం లో పడేస్తుంటే విష్ణు మూర్తుల వారు వరాహావతారం ఎత్తి భూమిని కోరల మీద నిలబెట్టి కాపాడి,, ఆ రాక్షసుణ్ణి చంపేసాట్ట. ఇది కధగా చిన్నప్పుడు వినా. ఐతే ఇప్పుడు ఆ వరాహాల వల్ల స్వైన్ ఫ్లూ అనే జబ్బు భూమిని గడ గడ లాడిస్తోంది. ఆ జబ్బు చాపలా చుట్టేసి అప్పుడే అంతటా వ్యాపిస్తోందట.

మూతులకి చిక్కాల లాంటి తొడుగులు..మాస్కులతో అందరూ ఆ వరాహ మూర్తుల లానే కనిపిస్తున్నారు. అప్పుల అప్పారావులకి...మాటిచ్చి నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా ఉపయోగ పడుతోందనే చెప్పాలి. ఎందుకంటే ఏ కర్చీఫో..మాస్కో కప్పుకుంటే జనం బారిన పడకుండా పార్పోవచ్చు.

అసలు ఇదివరకూ ఇన్ని మందులు జబ్బులు ఉన్నాయా ఐనా అందరూ హాయిగా వందకి దగ్గరదాకా బతికేసే వాళ్ళు. ఏమిటో సైన్ సు..టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రాబ్లెం స్ ఎక్కువౌవుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో జబ్బులు మందులు...విచ్చలవిడి తనం వల్ల పెరిగిపోతున్న ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పటికైనా మన సంప్రదాయం మన పద్ధతులే కరెక్ట్ అనిపించక మానదు.

ఐడ్స్, బర్డ్ ఫ్లూ..ఆంత్రాక్స్....చికెన్ గున్యా..ఇప్పుడు స్వైన్ ఫ్లూ...ఇలా కొత్త కొత్త జబ్బులు..వాటికి మందులేంతి అంటే వేపలో ఐడ్స్ నిరోధక లక్షణాలున్నాయి అని ప్రకటనలు..తులసి ఆకులు..లవంగాలు తింటే స్వైన్ ఫ్లూ నివారించొచ్చు అని స్టేత్ మెంట్సూ వింటుంటే మనమీద మనకి గౌరవం పెరుగుతుంది.

పక్క దేశాలను చూసి ఇన్ ఫ్లూ ఎన్స్ అవడం మన బలహీనత..వాళ్ళని అనుకరించి తెచ్చుకున్న ప్రేమికుల దినాలు..ఇతర దినాల లాగనే ఈ జబ్బులూ రోగాలూను.
వాళ్ళ జీవన శైలికి వాళ్ళు చేసే పనులు సూటౌతాయేమో కాని మనకి కాదు. అక్కడి పిల్లలు ఎంత షార్పో పుట్టిన దగ్గరనుంచీ ఇంగ్లీషులో మాట్లాడతారు...ఎంతగొప్పో అనుకుంటాం కానీ అది వాళ్ళ మదర్ టంగ్ అని కూడా ఆలోచన రాదు...ఎందుకంటే మనమూ సాధారణ పౌరులమే కదా..మాస్కు కట్టుకోండి ముసుగు అన్నమాట అది మనసు మీద నుంచీ తీసేయండి భారతీయులెంతో గొప్పవారని చాటండి..మేరా భారత్ మహాన్..











నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, జులై 21, 2009

కల కలాం

కల కలాం

ప్రపంచమంతా చంద్రుడిమీద కాలు పెట్టి నలభై ఏళ్ళు గడిచిన సంబరాలు జరుపుకుంటూ ఉంటే మన దేశంలో మాత్రం క్షిపణి మాంత్రికుడు.......స్ఫూర్తిప్రదాత....మాజీ రాష్ట్రపతి కి అవమానం జరిగింది.

ముంబాయి పేలుళ్ళలో దొరికిన..కసబ్ మావోడే అంటూ ఒక సారి...కాదు ఎవరో తెలీదు అని ఒకసారి మాట మారుస్తున్న తుపాకిస్తాను....అవును నేనే చేసాను అని ఒప్పుకున్న కసాయి కసబును విచారించడానికి ఎన్నేళ్లు పడుతుందో ఏమిటో.


పొట్ట పోసుకోవడానికి వెళ్ళి ....అతి తెలివికి పోయో...మోస పోయో పరాయి దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న ఎందరు భారతీయులు ఏమేమి కష్టాలు పడుతున్నారో..ఎలాంటి విచారణ ఎదుర్కుంటున్నారో తెలీదు.
మాజీ అధ్యక్షులు....క్లింటనో...బుస్షో వస్తే వాళ్ళని కూడా ఇలానే అవమానిస్తారా? లేక ఆ "సౌకర్యం " మన వాళ్ళకేనా..

ఆ మధ్య మన జార్జి ఫెర్నాండెజ్ గారికి కూడా ఈ రకంగా జరిగిందిట. రక్షణ మంత్రులు.రాష్ట్రపతులకే లేనిది ...ఇక సామాన్య మానవుణ్ణి ఏమి సరిగ్గా చూస్తారు.

బాంబేలో బాంబులేసినది ఎవరో తెలుసు..ఎంత నష్టం.జరిగింది...ఎన్ని ప్రాణాలుపోయాయి తెలుసు..ఎవరికోసం .........ఎవరి మెప్పు కోసం...ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందని...భయపడతారో తెలీదు..కార్గిల్ ఆక్రమించినప్పుడు మనం పోరాడి ....ఎన్నో ప్రాణాలు బలిచ్చి కాపాడుకున్నాం కానీ...ఎవరూ వచ్చి పాకిస్తాను వాడికి ఇది తప్పు నాయనా. అని ఎవరూ రాలేదు...తరువాతైనా మంచి చెడు చెప్పిందీ లేదు....మరి ఈ విధానమేంటో అర్ధం కాదు నా మట్టి బుర్రకి.
మీకెవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.
బాబ్బాబు..........










నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails