నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...Telugu Satire for Telugu People......!
Welcome
మంగళవారం, ఏప్రిల్ 06, 2010
"నిఖా"ర్స్
సా"నిఖా"...సానియా నిఖా మళ్ళీ డౌట్ లో పడింది..పాపం ఆమెకింకా మంచి రోజులు వచ్చినట్ట్లు లేదు. అసలు 100 కోట్ల భారతీయుల్లో ఎవరూ దొరక్క పాకీ వీరుణ్ణి వరించింది..అది నిజమైన ప్రేమేనా..ఎందుకంటే పాపం షోయబ్ క్రికెట్ కన్నా మిగతా విషయాల వల్లే ఎక్కువ ఫేమస్..మరి ఈమెని కూడా అలానె వర్రించాడా....అదే వరించేడా...అని ఓ డౌట్.ఇంత సడెన్ గా షోయెబే నా మొగుడు అని ప్రకటించాల్సిన 'అవసరం ' ఎందుకొచ్చింది..? గొడవ సద్దుమణిగాక చేసుకోవచ్చు కదా...ఆగేంత "టైము లేదేమో???........కళ్యాణ మొచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు..కానీ కక్కొచ్చినాక కళ్యాణం ఆపలేము కదా.....!!!!!
సావిత్రి నుంచీ సానియా దాకా ...అసలు ఈ సెలెబ్రిటీలే ఇంత..పూర్వం రోజులనుంచీ అంతే...సావిత్రి గారు...ఎందరు వద్దన్నా పెళ్ళై పోయిన జెమినీ గణేశన్ ని చేసుకుని..తరువాత జీవితాంతం బాధలు అనుభవించి...ఆ దిగులు తోనే మరణించిందంటారు..మధుబాల, దివ్య భారతి, పర్వీన్ బాబీ ఇలా ఎందరో..నిన్నటి తరం కలల రాణి శ్రీదేవి కూడా ఎందరో ప్రపోస్ చేసినా వద్దని పెళ్లై పోయిన బోనీ కపూర్ నే చేసుకుంది..ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పుకుంటున్నా రెండో నంబరు గానే మిగిలిపోయింది..ఈ ఆల్ ఇండియా మాజీ నంబర్ వన్. సానియా వయసు కూడా ఎక్కువ కాదు..ఇంకా ఓ రెండు మూడేళ్ళు టెన్నిస్ ఆడుకోవచ్చు..ఇంత హటాత్తుగా పెళ్ళి...దుబాయి లో కాపురం..ఇండియా-పాకిస్తాన్ మధ్య తిరగడం ఇవన్నీ ఇంత సడెన్ గా ఎందుకో.. ????
ఇది "నిఖా"ర్సైన ప్రేమా? లేక ?.............. ఏమో టెన్నిస్ కోర్టులో లా చమటలు కక్కుతూ ఇలా కోర్ట్ వ్యవహారాల దాకా తెచ్చుకునే లా ఇప్పుడు ఈ హడా"విడి" పెళ్లి బదులు...మొత్తం తెలుసుకున్నాక గ్రాండ్ స్లాం లాగా గ్రాండ్ సలాం ల మధ్య ...చేసుకుంటేనే ఇన్నాళ్ళ తన కెరీర్ కి మచ్చ లేకుండా ఉంటుంది...లేకపోతే..??అనవసరమంగా జీవితమంతా బాధ పడాల్సి వస్తుంది..
టెన్నిస్ ద్వారా భారత దేశానికి పేరు తెచ్చిన సానియా పై అభిమానం తో..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
లేబుళ్లు:
aleesha,
chile marriage,
cricketer,
india,
maha apa,
pak,
sania,
sania shoyab,
saniya,
saniya mirza,
shoib,
shoib akthar,
tennis star
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
"కళ్యాణ మొచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు..కానీ కక్కొచ్చినాక కళ్యాణం ఆపలేము కదా" ...wow..superb line.. ROFL :-).
The way you narrated was awesome.. chaala chaala bagundi.
ప్రసంసా పత్రం బావుంది ...!
"నిఖ"ర్సైన...పత్రం
కామెంట్‌ను పోస్ట్ చేయండి