ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత - అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.

ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత ? ----------అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.


ayesha_pratusha_copyలీడర్ సినిమాలో ఆఖరు పావుగంటలో వచ్చే ఒక డైలాగ్ ప్రజలని ఆలోచనలోకి నెట్టింది. హీరో తన పదవికి రాజీనామా చేసినప్పుడు చెప్పే డైలాగ్ " ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే ఎంత ఊడితే ఎంత " . నిజంగా తన పదవివి కాపాడుకోడానికి ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి , చంపేసిన నరరూప రాక్షసుడిని తన పదవికోసం కాపాడిన సిఎం ..... మరుక్షణం మనసు మార్చుకుని తన పదవికి రాజీనామా చేయడం కేవలం   సినిమాకే పరిమితం అయినప్పటికీ సిగ్గు లేని మన నాయకులకు చెప్పుదెబ్బ లాంటిది. గతంలో కొందరు అమాయకమైన ఆడపిల్లలు అత్యాచారాలకు బలైనప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వారిని కాపాడాడు అని ఆరోపణలు వచ్చాయి. వాటిలో ప్రధానమైనవి హీరోయిన్ ప్రత్యూష కేసు , ఇంకా ఆయేషా మీరా కేసు.

cbn-pratyshaఅందాల నటి ప్రత్యూష అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ... ఆమె మరణం వెనుక పెద్దమనుషుల హస్తం ఉందని  అనేక ఆరోపణలు చేశారు ఆమె తల్లి . అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 పోసిషన్ లో ఉండే ఒక నాయకుడి కుమారుడి మీద ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు వారికి కొమ్ము కాశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.  తన పార్టీ లోని అనుచరుడి కుమారుడిని కాపాడుకోవడానికి  తన కుర్చీ కోసం  ప్రతూషకి చంద్రబాబు  అన్యాయం చేశారని  ఆరోపణలు వచ్చినా నాయుడు గారు చలించలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో ప్రత్యూష తల్లి తెలుగుదేశం లో చేరారు. కానీ ప్రత్యూషకి మాత్రం అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపీలేదేమో. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్  చేస్తారట.
ayeshaa_ysrమరో కేసులో విజయవాడలో అత్యంత కిరాతకంగా రేప్ కి గురై హత్యగావించబడ్డ ఆయేషా మీరా కేసులో నిందితులని వైఎస్ఆర్ కాపాడుతున్నారని పెద్ద దుమారమే రేగింది. ఐనప్పటికీ వైఎస్ఆర్ చలించలేదు. కేసు విచారణ వేగవంతం అయ్యేటప్పుడే  విజయవాడ పోలీస్ కమీషనర్ నీ ట్రాన్స్ ఫర్ చేసేసారు. కేసుతో సంబంధం లేని లడ్డు అనే వైజాగ్ యువకుడిని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం జరిగింది . తర్వాత సత్యం బాబు అనే మరొక యువకుడి పేరు వెలుగులోకి తెచ్చారు . కానీ ఆయేషా మీరా  కి అన్యాయం జరిగింది అని ఆమె తల్లి మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేవలం తన వర్గం వాడు అనే ఫీలింగ్ తోనే నిందితుడిని కాపాడి ఒక అమాయకమైన ఆడపిల్లకి అన్యాయం చేసి సిఎం సీటులో దర్జాగా కూర్చున్నారు అనే ఆరోపణ వైఎస్ఆర్  మీద ఉంది. ఇలా ఆడపిల్లలకి అన్యాయం చేసి చివరికి వీరు సాధించింది ఏంటి? బావుకున్నది ఏంటి ?
తాజాగా విజయవాడలో హత్యకి గురైన నాగవైష్ణవి హత్య కేసులో నిందితులని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అని వూహాగానాలు వస్తున్నాయి. కనిసం ఎనభై ఏళ్ళ వయసులో అన్న రోశయ్య తన కుర్చీ కన్నా ఆడపిల్లకి న్యాయం చేయడంలో శ్రద్ధ వహిస్తారు అని ఆశిద్దాం ప్రతిస్పందన.


దయచేసి..సినిమాలు చూసి ఎమోషన్ అవద్దు. ఈ అన్యాయాలు శతాబ్దాల బట్టీ స్త్రీల మీద జరుగుతునే ఉన్నాయి. అందులో చూపించేవి కేవలం ఎమోషనల్ గా టచ్ చేసి సినిమా ఆడించుకోవడం కోసమే..నిజంగా వాళ్లకి అంతటి చిత్త శుద్ధి ఉంటుందా? అని నా ప్రశ్న. ఆ సినిమా అయిపోయి మళ్ళీ వేరే సినిమా మొదలవగానే అందులోని విషయం మర్చిపోతారు..ఏ ప్రేమ సబ్జెక్టో ఐతే వీలైనంతవరకూ "హీరోయిన్ " ని ఎక్స్ పోజ్ చేస్తారు.వాళ్ళు ఎప్పటికీ ఆదర్శం కారు.

ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే...అసలు మనదగ్గర ఉన్నది ప్రజా స్వామ్యమే కాదు. ఎందుకంటే..వారసత్వాన్ని ఓటు  ద్వారా మార్చుకుని గెలిచే వీళ్లు రాజకీయ నాయకులే కానీ ప్రజా నాయకులు కాదు. ముందు తరం నాయకుల పేర్లు చెప్పుకుని  కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, భార్యలూ(కరెక్టే కొందరికి ఇద్దరు ముగ్గురున్నారు), ఇలా బంధువులే నిండిపోతే ఇక ప్రజా  నాయకులెక్కడనుంచీ వస్తారు.

వాళ్ళ స్వంత ఖర్చులు..డ్రైవర్లు, పీ ఏలు, ఇతర మెయిన్ టెనెన్స్ ఖర్చులు ,అసెంబ్లీ లో వృధా చేసే గంటల కొద్దీ సమయం యొక్క విలువ లెక్కగడితే ఐదేళ్ళలో వాళ్ళు నియోజక వర్గానికి ఖర్చుపెట్టేదానికి కనీసం 30 రెట్లు ఎక్కువ ఉండవచ్చు.

ఇక ప్రత్యూష, అయేషా ల లాంటి కేసులు విషయానికొస్తే...బయటకు రాని కేసులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క చూడవలసి ఉంటుంది. కులం , వర్గం, ప్రాంతం, బంధు జనం, ఇలా అనేక రకాలుగా చుట్టూ ఉన్న జనాన్ని కాపాడే విషయంలో ప్రజల కి జరిగే అన్యాయాలని పట్టించుకునే టైం లేదు వీళ్లకి. దొరికిన ఐదేళ్ళలో అందింత దోచుకోవడానికే ప్రణాళికలు తప్ప..ఆడవాళ్లకి ఏమి జరిగితే వీళ్లకేమిటి.


బ్రిటీష్ వాళ్ళు మనలని డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతి లో పాలించారు. కలిస్తే ప్రమాదమని ...వీలైనంతవరకు విభజించి పాలించారు. చేస్తే చేసారు కనీసం రైళ్ళు, విమానాలు లాంటి టెక్నాలజీ త్వరగా ఇచ్చి వెళ్ళారు. కానీ ఇప్పటి నాయకులు.. డిలే అండ్ రూల్ అనే సూత్రం పాటిస్తారు అంటే ...నిదానంగా పాలించు..ఎందుకంటే కొంత కాలం అయితే జనం మర్చిపోతారు. ఎవరు ఉన్నా ఎవరు లేక పోయినా ప్రపంచం నడుస్తునే ఉంటుంది కాబట్టి..ఎవరి గోల లో వాళ్ళుంటారు అని లేట్ చేస్తారు.

ప్రపంచం లో మనలని ఎవరూ ఉద్ధరించరు..మనలని మనమే కాపాడుకోవాలి..జనమే కలిసి పోరాడాలి..మన దాకా వచ్చేదాకా వేచి చూడక..పక్క వాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తే..ప్రభుత్వమూ కళ్ళు తెరుస్తుంది..


"ఒక్క ఆడపిల్లకి సాయం/న్యాయం చేయలేని సీ ఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత ?" ఇది కాదు ముఖ్యం "పక్కవాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందించని మనం ఉంటే ఎంతా...లేకపోతే ఎంత.????"


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వ్యాఖ్యలు

Naga Valli చెప్పారు…
i liked this article....i like the dialogue also from the leader Movie....everyday memu ee particular dialogue gurthu techukuntam...meeru cheppinattu pakka vadiki annyayam jariginappudu pattinchukoni manam unte entha pothe entha super :-)
శ్రీ చెప్పారు…
స్పందన బాగుంది.ప్రతిస్పందన, స్పందన మీద నీళ్ళు చల్లినట్టుంది.
ఆకాశరామన్న చెప్పారు…
బాగా చెప్పారు. అన్నింటినీ రాజకీయనాయకుల మీదో సమాజం మీదో తోసేసి తానూ ఉన్నతంగా ఉన్నాను కానీ సమాజమే బాగలేదని ప్రతీ సామాన్యుడు ఫీలవుతూనే ఉంటాడు. నిజానికి అవన్నీ బాగుపడాలంటే మొదట తాను బాగుపడాలన్న విషయాన్ని గ్రహించడు. వీటన్నింటికీ మూల కారణం రాజకీయనాయకులో సమాజమో కాదు, సామాన్యుడిలో వుంది అసలు తప్పంతా.
lasya చెప్పారు…
chala baagaa chepparu.
Fun Counter చెప్పారు…
naakalaa thochindi mastaru..vaallu cheppindi khandinchaledu..ii vishayam kooda alochinchamannaa. anthe. mee abhipraayam tho nenu eakiibhavistunnaanu.
Sharanya చెప్పారు…
Nenu pampina Mail ni intha mandiki teliya barichinanduku..Thanks Phani Garu..

All The Best
phani చెప్పారు…
Leader ayina,samanyudaina vaadikee oka manassakshi vuntundi. Tappumeeda tappuchestoo tanaki taanu sardi cheppukunevadu pani meeda dhyasa pettaleka saasvatamga tappukuntaadu leda chavu debba tintadu. Jarigindee, jarigedi kooda ade! THERE IS NO ROOM FOR UNFIT COMPONENTS IN A MECHANISM. IT'S PART OF SELF CORRECTION OF THAT MECHANISM.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!