Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, ఆగస్టు 19, 2009

ఇన్ ఫ్లూ ఎన్సా


ఇన్ ఫ్లూ ఎన్సా

అ ప్పుడెప్పుడో చాలా యుగాల క్రితం హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రం లో పడేస్తుంటే విష్ణు మూర్తుల వారు వరాహావతారం ఎత్తి భూమిని కోరల మీద నిలబెట్టి కాపాడి,, ఆ రాక్షసుణ్ణి చంపేసాట్ట. ఇది కధగా చిన్నప్పుడు వినా. ఐతే ఇప్పుడు ఆ వరాహాల వల్ల స్వైన్ ఫ్లూ అనే జబ్బు భూమిని గడ గడ లాడిస్తోంది. ఆ జబ్బు చాపలా చుట్టేసి అప్పుడే అంతటా వ్యాపిస్తోందట.

మూతులకి చిక్కాల లాంటి తొడుగులు..మాస్కులతో అందరూ ఆ వరాహ మూర్తుల లానే కనిపిస్తున్నారు. అప్పుల అప్పారావులకి...మాటిచ్చి నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా ఉపయోగ పడుతోందనే చెప్పాలి. ఎందుకంటే ఏ కర్చీఫో..మాస్కో కప్పుకుంటే జనం బారిన పడకుండా పార్పోవచ్చు.

అసలు ఇదివరకూ ఇన్ని మందులు జబ్బులు ఉన్నాయా ఐనా అందరూ హాయిగా వందకి దగ్గరదాకా బతికేసే వాళ్ళు. ఏమిటో సైన్ సు..టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రాబ్లెం స్ ఎక్కువౌవుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో జబ్బులు మందులు...విచ్చలవిడి తనం వల్ల పెరిగిపోతున్న ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పటికైనా మన సంప్రదాయం మన పద్ధతులే కరెక్ట్ అనిపించక మానదు.

ఐడ్స్, బర్డ్ ఫ్లూ..ఆంత్రాక్స్....చికెన్ గున్యా..ఇప్పుడు స్వైన్ ఫ్లూ...ఇలా కొత్త కొత్త జబ్బులు..వాటికి మందులేంతి అంటే వేపలో ఐడ్స్ నిరోధక లక్షణాలున్నాయి అని ప్రకటనలు..తులసి ఆకులు..లవంగాలు తింటే స్వైన్ ఫ్లూ నివారించొచ్చు అని స్టేత్ మెంట్సూ వింటుంటే మనమీద మనకి గౌరవం పెరుగుతుంది.

పక్క దేశాలను చూసి ఇన్ ఫ్లూ ఎన్స్ అవడం మన బలహీనత..వాళ్ళని అనుకరించి తెచ్చుకున్న ప్రేమికుల దినాలు..ఇతర దినాల లాగనే ఈ జబ్బులూ రోగాలూను.
వాళ్ళ జీవన శైలికి వాళ్ళు చేసే పనులు సూటౌతాయేమో కాని మనకి కాదు. అక్కడి పిల్లలు ఎంత షార్పో పుట్టిన దగ్గరనుంచీ ఇంగ్లీషులో మాట్లాడతారు...ఎంతగొప్పో అనుకుంటాం కానీ అది వాళ్ళ మదర్ టంగ్ అని కూడా ఆలోచన రాదు...ఎందుకంటే మనమూ సాధారణ పౌరులమే కదా..మాస్కు కట్టుకోండి ముసుగు అన్నమాట అది మనసు మీద నుంచీ తీసేయండి భారతీయులెంతో గొప్పవారని చాటండి..మేరా భారత్ మహాన్..











నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

1 కామెంట్‌:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇక్కడ ఎల్లవేళలా అన్నింటినీ దిగుమతి చేసుకోబడును.పాశ్చాత్య సంస్కృతి-50 డిగ్రీల వేడిలో కూడా మగవాళ్ళు సూటూబూటూ వేసుకోవడం,డిసెంబర్ చలిలో కూడా ఆడవాళ్ళు స్లీవ్ లెస్సులు వేసుకోవడం,బోరున గాలిలో కూడా జుట్టు విరబోసుకోవడం లాంటివి మనవాతావరణానికి సరిపోకపోయినా down load చేసుకోవడం.జబ్బులను దిగుమతి చేసుకోవడంలో మనల్ని మించిన వారు ప్రపంచంలో మరెవరూ ఉండరు.ఎయిడ్స్, ఆంత్రాక్స్, సార్స్, ఇప్పుడేమో స్వైన్ ప్లూ.ఉన్నతమైన మన భారతీయ సంస్కృతిని, వస్త్రధారణను ఎప్పటికైనా ఎగుమతి చేయగలమా ?

LinkWithin

Related Posts with Thumbnails