Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
telugu film లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu film లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జనవరి 17, 2012

స్వామి భక్తి కి పరాకాష్ట బాడీగార్డ్



హీరో బాడీ గార్డ్ కాబట్టి.. హీరో చుట్టూనే తిరుగుతుంటుంది కధ..గవర్నమెంటాఫీసు నుంచి వచ్చే ఉద్యోగం గా ప్రైవేట్ సెక్యూరిటీ సెర్వీసెస్ లోని మహా  బలశాలి బాడీ గార్డు. తను కాపాడిన వాడు ఎవరో తెలీని స్వామికోసం ఏదైనా చేయాలనుకునే నమ్మకమైన బాడీగార్డు..షరా మామూలుగా ఎంగేజ్  మెంట్ ఐపోయిన అమ్మాయిని చేసుకోవడమనే సెంటిమెంట్ నిలబెట్టుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. పలీ బూతు కామెడీకి వేణుమాధవ్ నాటు కామెడీ తోడై..అటు ఆడా..మగా కాని వేషాలేసిన కామెడీతో కలిపి..కడుపు తిప్పుతుంది. కాస్త కామెడీ.కాస్త సెంటిమెంటు.కాస్త రొమాన్సు కలిపి..ముసలి హీరో..పడుచు హీరోయిన్లు..చివరకి హీరో హీరోయిన్ కలవాలి కాబట్టి 10 యేళ్ళ పిల్లాడి మెచ్యూరిటీకి మెచ్చి..పెళ్ళీ పెటాకులు లేకుండానే పట్టుచీర కట్టుకుని బయలుదేరే హీరోయిను..పాపం సినిమా అంతా హీరోయిన్ పక్కనే తిరిగి..ఇద్దరినీ కాపాడడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన రెండో హీరోయిన్ కాన్సర్ తో చచ్చిపోయి బతికిపోతుంది.. అసలు హీరోయిన్ ని చేసుకుందామనుకున్నాయన ఏమైపోయాడో తెలీదు. ఇంట్లో మొగుడికి తెలీకుండా 10 యేళ్ళ పిల్లాడికి డైరీ దొరికేలా ఎలా చేస్తుందో తెలీదు. రైల్లో చదూతూ వస్తుంటే కూడా ఎవరూ ఎందుకు చూడరో తెలీదు. లేడీస్ బాత్ రూంలోకి..హాస్టల్ లోకి వెళ్ళే హీరో గారి కామెడీ..ప్రిన్సిపాల్ అన్నా లెక్చరర్ అన్నా జోకర్ గా చూపించే కామెడీ.  కధ ఎలా ఉంటుందో సింబాలిక్ గా లాస్ట్ సీన్ లో చెత్తబుట్టలోంచి ఏరుకొచ్చిన డైరీ చూపించారు.. మధ్యలో పాటలెన్ర్దుకొస్తాయో సమయం సందర్భం లేకుండా..అర్ధం కాదు. రెండు పాటలమధ్యలో ఫైటు ఉండాలి కాబట్టి ఒక రివెంజు..పార్కులు,,,సినిమాలు..కాలేజీలు తిరుగుతున్నా జరగని గొడవలు...అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటాయి. ఏంటో నాకు సినిమాలు చూడ్డం ఎప్పటికి వస్తుందో..? ఈ మధ్య పంజా గురించి రాస్తే...నాకసలు సినిమా చూడ్డం రాదని..మ్యూజిక్ అద్భుతంగా ఉంటే వినడం చేతకాక బాగాలేదన్నాని నన్ను తిట్టిపోసారు..పవర్ స్టార్ గారి అభిమానులు కొందరు.. వాళ్ళు ఇప్పటికి ఎన్ని సార్లు చూసారో ఆ సినిమాని..పాపం ఆ భగవంతుడికే తెలియాలి. 







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

బుధవారం, ఆగస్టు 19, 2009

ఇన్ ఫ్లూ ఎన్సా


ఇన్ ఫ్లూ ఎన్సా

అ ప్పుడెప్పుడో చాలా యుగాల క్రితం హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రం లో పడేస్తుంటే విష్ణు మూర్తుల వారు వరాహావతారం ఎత్తి భూమిని కోరల మీద నిలబెట్టి కాపాడి,, ఆ రాక్షసుణ్ణి చంపేసాట్ట. ఇది కధగా చిన్నప్పుడు వినా. ఐతే ఇప్పుడు ఆ వరాహాల వల్ల స్వైన్ ఫ్లూ అనే జబ్బు భూమిని గడ గడ లాడిస్తోంది. ఆ జబ్బు చాపలా చుట్టేసి అప్పుడే అంతటా వ్యాపిస్తోందట.

మూతులకి చిక్కాల లాంటి తొడుగులు..మాస్కులతో అందరూ ఆ వరాహ మూర్తుల లానే కనిపిస్తున్నారు. అప్పుల అప్పారావులకి...మాటిచ్చి నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా ఉపయోగ పడుతోందనే చెప్పాలి. ఎందుకంటే ఏ కర్చీఫో..మాస్కో కప్పుకుంటే జనం బారిన పడకుండా పార్పోవచ్చు.

అసలు ఇదివరకూ ఇన్ని మందులు జబ్బులు ఉన్నాయా ఐనా అందరూ హాయిగా వందకి దగ్గరదాకా బతికేసే వాళ్ళు. ఏమిటో సైన్ సు..టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రాబ్లెం స్ ఎక్కువౌవుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో జబ్బులు మందులు...విచ్చలవిడి తనం వల్ల పెరిగిపోతున్న ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పటికైనా మన సంప్రదాయం మన పద్ధతులే కరెక్ట్ అనిపించక మానదు.

ఐడ్స్, బర్డ్ ఫ్లూ..ఆంత్రాక్స్....చికెన్ గున్యా..ఇప్పుడు స్వైన్ ఫ్లూ...ఇలా కొత్త కొత్త జబ్బులు..వాటికి మందులేంతి అంటే వేపలో ఐడ్స్ నిరోధక లక్షణాలున్నాయి అని ప్రకటనలు..తులసి ఆకులు..లవంగాలు తింటే స్వైన్ ఫ్లూ నివారించొచ్చు అని స్టేత్ మెంట్సూ వింటుంటే మనమీద మనకి గౌరవం పెరుగుతుంది.

పక్క దేశాలను చూసి ఇన్ ఫ్లూ ఎన్స్ అవడం మన బలహీనత..వాళ్ళని అనుకరించి తెచ్చుకున్న ప్రేమికుల దినాలు..ఇతర దినాల లాగనే ఈ జబ్బులూ రోగాలూను.
వాళ్ళ జీవన శైలికి వాళ్ళు చేసే పనులు సూటౌతాయేమో కాని మనకి కాదు. అక్కడి పిల్లలు ఎంత షార్పో పుట్టిన దగ్గరనుంచీ ఇంగ్లీషులో మాట్లాడతారు...ఎంతగొప్పో అనుకుంటాం కానీ అది వాళ్ళ మదర్ టంగ్ అని కూడా ఆలోచన రాదు...ఎందుకంటే మనమూ సాధారణ పౌరులమే కదా..మాస్కు కట్టుకోండి ముసుగు అన్నమాట అది మనసు మీద నుంచీ తీసేయండి భారతీయులెంతో గొప్పవారని చాటండి..మేరా భారత్ మహాన్..











నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, జూన్ 09, 2009

'ఈక'కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ

'ఈక'కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ

'ఈక'కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ లో పడ్డ పసివాడి ప్రేమ కధ ఈ ప్రయాణం..ఈరోజుల్లో ప్రేమలకు ప్రతిరూపంగా అనిపించింది ....కనిపించింది..నిన్ననే ప్రయాణం సినిమా చూసా..సినిమాని సినిమాగా చూడు లాజిక్కులు వెతక్కు అంటే వదిలేస్తా..కానీ టికెట్టు పెట్టి చూసా కాబట్టి నాకనిపించింది చెప్పే హక్కు ఉందేమో అనిపించి..రాత్రంతా
విలపించి...ఇలా మొదలెట్టా...

సినిమాలో అసలు 'ప్రయాణమే' లేదు...ఐర్పోర్టులో ట్రాలీ మీద తప్ప...ధూమపానాన్ని అసలు సహించని మలేషియాలో కూడా మన హీరొలకి ఐర్పోర్టులో సైతం సిగరెట్టు తాగేంత హీరోయిజం ఉన్నది అన్న సత్యం తెలిసింది..నాకు తెలిసినంత వరకు, అక్కడ స్మోక్ జోన్ లు ఉంటాయి ..కాని మనోడు 'మనోజు' హీరో కాబట్టి నో స్మోకింగు బోర్డు ముందు నుంచుని తాగేస్తూ వాగేస్తూ ఉంటాడు..

థ్రిల్లు కోసం గ్రిల్లు పట్టుకుని కైపెక్కి- పైపెక్కి- పైకెక్కి, పోలీసుల చేతిలో చిక్కి..చచ్చీ చెడీ బయటకొచ్చి...నిమిషం తరువాత ఏమి చేస్తాడో తెలీని "ఉత్తర ధ్రువానికి" అక్కడ "మంచు " ఎక్కువలేండి..
గంటలో ప్రేమ....రోజులో పెళ్ళి,,,,,నెలలో విడాకులు..పాపం హీరోయిన్ పెట్టిన ఎం సెట్ లాంటి పరీక్షా పత్రంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది...ఆ 'మారేజిసెట్లో' ఫైల్ అయినా హీరో ప్రేమ పరీక్షలో పాస్....రెండు గంటల పరిచయం..ఏడుప్రశ్నల కు సమాధానం వెరసి ఒక జీవితకాల 'ప్రయాణం'..

'పాట్లు' గురించి చెప్పాలంటే భయంగా ఉంది 'ప్రింటు మిస్టేకు' కాదు 'పాటలు' అనే కన్నా 'పాట్లు' అనడమే కరెక్టు..అంత ఘోరంగా ఉన్నాయి అవి..సంగీతపు హోరులో 'మాట ' అర్ధం కాదు..రికార్డింగు..మరీ ఘోరం...గొంతుల్లో అపశృతులు..

చంద్రశెఖర్ ఏలేటికి ఐర్పోర్టు సెంటిమెంటో మరోటో తెలీదు కానీ 'ఐతే' ..మాత్రం కొంచెం ఆలోచించుకోవాలేమో...ఏ ఫ్లయిట్ తెలీకుండా ...ఒక వేళ రాత్రి ఫ్లయిట్ ఐతే అన్నిగంటల ముందుగా చెకిన్ ఎలా అవుతారో...అర్ధం కాలే..
బ్రహ్మానందాన్ని 'ఆడుకున్నారు' అనాలో 'వాడుకున్నారు' అనాలో కూడా తెలీదు...పాయింటు చిన్నది కాబట్టి...'బట్ట తలకీ' -మోకాలు కి లింకెట్టి" చాక్లెట్ తిన్నవాణ్ణి వదిలేసి..బ్రహ్మానందం వెంటపడ్డ ఒక ఆధునిక హిడింబాసురుడు..పెళ్ళాం బాధ పడలేక వెంటపడడం...అసహజంగా అనిపిస్తుంది...

మందు కొట్టడం..సిగరెట్ తాగడం..బెట్టు కట్టడం..అమ్మాయి వెంట పడడం..వంటివి హీరోదాత్త లక్షణాలుగా చెలామణి అవుతున్న ఈరోజులకు ప్రతిరూపంగా కనిపించే హీరో...అప్పటిదాకా ప్రాక్టికల్ గా లైఫ్ గురించి ఆలోచించిన అమ్మాయి కన్నుమూస్తే తాజ్మహల్ కట్టిస్తానన్న హీరో మనసుకి ఆకర్షితురాలవడం...పరాయి దేశం లో పోలీసులకి బాంబు విషయం లో ఇరికించినా...ఉత్తరం అందించి సాయం చేసే రైతు బ్రహ్మానందం ఆహా అద్భుతం...చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇంక దీనిగురించి ఇంతకన్నా టైము వేస్టు చెయ్యడం ఎందుకులే అని వదిలేస్తున్నా...
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails