Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
telugu cinema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu cinema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, నవంబర్ 17, 2017

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది

ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది

ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ

బాబు ఆన అయ్యిందేమో బావ దరికి నందియే... కదిలొస్తానంది! 



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, ఏప్రిల్ 10, 2015

సింహాలు - పులులు....

తండ్రులు - కొడుకులు, తాతలు-మనవళ్ళు, మావయ్యలు - 'అల్లు 'ళ్ళు, బాబయి లు - అబ్బాయిలు, అంకుల్స్ - కజిన్స్, బావలు - బామ్మర్దులు, బాబులు - పెద బాబులు, చిన బాబులు, బుజ్జి బాబులు, బుల్లి బాబులు, సింహాలు - పులులు....


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

ఆదివారం, ఫిబ్రవరి 10, 2013

చిత్రవధ


చిత్రవధ 


పెద్ద సినిమా అనగా పెద్ద హీరో ఉండును..ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండును బాంబే విలన్లు ఉండును, ఫారిన్ లొకేషన్లు ఉండును.. ఎగిరిపడే సూమోలు..ఎగసి పడే సముద్రపు అలలు,విరిగిపడే విలన్ అసిస్టంట్లూ ఉండును  ... కావాల్సినన్ని థియేటర్లు ఉండును - టీ వీలో యాడ్లు - ఇంటర్వ్యూలు - ఊరినిండా పోస్తర్లు ఉండును


ఇక ఉండనివి : కధ - లాజిక్ - వారం తరువాత ఆడియన్స్ ..

చిన్న సినిమా అనగా - క్రియేటివ్ గా ఉండును...యాక్టర్లు-ఆర్టిస్ట్లు ఉండును - కధ ఉండును - లాజిక్ ఉండును - వారం తరువాత నుంచి ఆడియన్స్ ఉండును -

చిన్న సినిమాకి ఉండనివి : ఎగిరిపడే సూమోలు - హెలికాప్టర్లు - తీవీ లో ప్రోమోలు - ఇంటర్వ్యూలు - రిలీజ్ చేసుకోడానికి థియేటర్లు - సినిమా బయటకు రావడానికి బడ్జెట్టు..








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
  Share/Save/BookmarkShare/Save/Bookmark

మంగళవారం, జనవరి 17, 2012

స్వామి భక్తి కి పరాకాష్ట బాడీగార్డ్



హీరో బాడీ గార్డ్ కాబట్టి.. హీరో చుట్టూనే తిరుగుతుంటుంది కధ..గవర్నమెంటాఫీసు నుంచి వచ్చే ఉద్యోగం గా ప్రైవేట్ సెక్యూరిటీ సెర్వీసెస్ లోని మహా  బలశాలి బాడీ గార్డు. తను కాపాడిన వాడు ఎవరో తెలీని స్వామికోసం ఏదైనా చేయాలనుకునే నమ్మకమైన బాడీగార్డు..షరా మామూలుగా ఎంగేజ్  మెంట్ ఐపోయిన అమ్మాయిని చేసుకోవడమనే సెంటిమెంట్ నిలబెట్టుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. పలీ బూతు కామెడీకి వేణుమాధవ్ నాటు కామెడీ తోడై..అటు ఆడా..మగా కాని వేషాలేసిన కామెడీతో కలిపి..కడుపు తిప్పుతుంది. కాస్త కామెడీ.కాస్త సెంటిమెంటు.కాస్త రొమాన్సు కలిపి..ముసలి హీరో..పడుచు హీరోయిన్లు..చివరకి హీరో హీరోయిన్ కలవాలి కాబట్టి 10 యేళ్ళ పిల్లాడి మెచ్యూరిటీకి మెచ్చి..పెళ్ళీ పెటాకులు లేకుండానే పట్టుచీర కట్టుకుని బయలుదేరే హీరోయిను..పాపం సినిమా అంతా హీరోయిన్ పక్కనే తిరిగి..ఇద్దరినీ కాపాడడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన రెండో హీరోయిన్ కాన్సర్ తో చచ్చిపోయి బతికిపోతుంది.. అసలు హీరోయిన్ ని చేసుకుందామనుకున్నాయన ఏమైపోయాడో తెలీదు. ఇంట్లో మొగుడికి తెలీకుండా 10 యేళ్ళ పిల్లాడికి డైరీ దొరికేలా ఎలా చేస్తుందో తెలీదు. రైల్లో చదూతూ వస్తుంటే కూడా ఎవరూ ఎందుకు చూడరో తెలీదు. లేడీస్ బాత్ రూంలోకి..హాస్టల్ లోకి వెళ్ళే హీరో గారి కామెడీ..ప్రిన్సిపాల్ అన్నా లెక్చరర్ అన్నా జోకర్ గా చూపించే కామెడీ.  కధ ఎలా ఉంటుందో సింబాలిక్ గా లాస్ట్ సీన్ లో చెత్తబుట్టలోంచి ఏరుకొచ్చిన డైరీ చూపించారు.. మధ్యలో పాటలెన్ర్దుకొస్తాయో సమయం సందర్భం లేకుండా..అర్ధం కాదు. రెండు పాటలమధ్యలో ఫైటు ఉండాలి కాబట్టి ఒక రివెంజు..పార్కులు,,,సినిమాలు..కాలేజీలు తిరుగుతున్నా జరగని గొడవలు...అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటాయి. ఏంటో నాకు సినిమాలు చూడ్డం ఎప్పటికి వస్తుందో..? ఈ మధ్య పంజా గురించి రాస్తే...నాకసలు సినిమా చూడ్డం రాదని..మ్యూజిక్ అద్భుతంగా ఉంటే వినడం చేతకాక బాగాలేదన్నాని నన్ను తిట్టిపోసారు..పవర్ స్టార్ గారి అభిమానులు కొందరు.. వాళ్ళు ఇప్పటికి ఎన్ని సార్లు చూసారో ఆ సినిమాని..పాపం ఆ భగవంతుడికే తెలియాలి. 







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

శనివారం, జులై 24, 2010

మర్యాద జక్కన్న

మర్యాద రాజన్న..మర్యాద జక్కన్న...మర్యాద రామన్న
 ఏమనాలో తెలీదు కానీ...చాలా కాలం తరువాత ఫ్యామిలీతో అంటే..అమ్మా నాన్నా భార్యా బిడ్డా కలిసి కాసేపు హాయిగా నవ్వుకునే సినిమా చూసిన ఫీలింగు కనిపించింది..అనిపించింది..ఈ సినిమా చూసినంత సేపూ..

మగధీర లేకాదు మర్యాద రామన్ననూ తియ్యగలను అనిపించుకున్నాడు జక్కన్న ఉరఫ్ స్యూర్ సక్సెస్ రాజమౌళి.

ఎంత సేపు కడప లో మొదలయ్యే కధలు..టాటా సూమోలు పేలడం..కత్తులు బాంబులే కాదు గడపలోపల జరిగే మర్యాద..మర్యాదకు..ఆచారానికి వాళ్ళిచ్చే మర్యాద..బాగా చూపించారు.

తెలుగు అమ్మాయి కాకపోయినా రాజమౌళికి చిక్కిన జక్కన్న  చెక్కిన సలఒని బాగానే ఉంది..ఎక్స్పోజింగు కాదు ఎక్స్ప్రెషన్ ముఖ్యం అని గుర్తించిన అతి కొద్ది మంది డైరెక్టర్లలో రాజమౌళి ఒకడు..అతి అనిపించకుండా శృతి మించకుండా,,అందం గా చూపించారు..

ప్రభుదేవాకే డ్యాన్స్ నేర్పిన సునీల్ డ్యాన్సులు బాగా చేశాడు..

పౌరుషాల కోసం చంపుకోవడమే కాదు..ఆచారం కోసం మర్యాద కోసం విలువనిచ్చే కొత్త కడపని చూపించారు..ఏంటో చాలా కాలం తరువాత ఒక సినిమా గురించి పాజిటివ్ గా రాసేస్తున్నా..

ట్రైన్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదనిపించింది...ఈ చిత్ర రచయిత కాంచీ గారు ఉన్న కాసేపూ బాగా నవ్వించారు..

పాపం బ్రహ్మాజీ ఏమయ్యాడో లాస్ట్ లో అర్ధం కాలేదు..చావు వెంటపడుతుంటే ఎక్కడ లేని శక్తి వస్తుందని...టాటా సూమోని డామినేట్ చేసే సైకిల్ చేజ్ చూపించింది..

మొత్తానికి సునీల్ పారిపోవడానికి తిరిగినన్ని మలుపులు లేకుండా..వర్షం పడ్డప్పూడు హైదరాబాదులోని రోడ్లంత గతుకులు అతుకులు లేకుండా..స్ట్రైట్ గా నీట్ గా ఉన్న మర్యాద రామన్న...నాకు నచ్చింది..మా ఇంట్లో నలుగురికీ నచ్చింది.
ఫార్ములా ప్రకారం..ఓ మమైత్ ఖాన్ పాట..రెండు టాటా సూమో బ్లాస్ట్లు..లేకుండా..ప్రశాంతం గా తీసిన ఈ సీమ సినిమా 500 వందల ఏళ్ళు పూర్తి చేసుకున్న "రాయలు "వారు ఏలిన రాయల సీమ పై వచ్చిన ఓ మంచి సినిమా గా చెప్పుకోవచ్చు..ఇంటిల్లిపాదీ చూసెయ్యొచ్చు..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

ఆదివారం, మార్చి 28, 2010

మరో "ఛ" రిత్ర...

మరో "ఛ" రిత్ర...


 పాటలు రి మిక్స్ లు చేస్తున్నారు...డాన్సులు రి మిక్సు చేస్తున్నారు..సినిమా పేర్లు పాతవి వాడుతున్నారు...ఇంకా ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తాన్ని ఫ్రీ మిక్సు చేసేసి...మరఒ చరిత్ర సృష్టించామంటున్నారు...గ్రేట్ ...కొత్త ఐడియా..పైగా పైరసీ వద్దు అంటూ సినిమా విడుదల డేటునుంచీ రోడ్డున పడతారు.

అదేంటో...వాళ్ళ సినిమా రిలీజు అప్పుడు మాత్రమే ఈ పైరసీ గురించి గుర్తొస్తుందేమోఅ వాళ్లకి..ఆమధ్య మగధీర రిలీజప్పుడు..చరణ్, అల్లు అరవిందు, పవన్ కళ్యాణ్ ఇంకా చిరు అందరూ పైరసీ గురించి బోల్డన్ని టీవీల్లో చెప్పేసారు..తరువాత నాగ్ వాళ్ళబ్బాయి సినిమా గురించి జోష్ గా తనవంతు పైరసీ వ్యతిరేకం గా దంచేసారు...సినిమా కూడా త్వరగా దించేసే సరికి..వదిలేసారు..మళ్ళీ కొన్నాళ్ళు ఎవరూ వినపడలేదు...ఇప్ప్పుడు మళ్ళీ వాళ్ళ సినిమాలు రెడీ కాబట్టి మళ్లీ షురూ..లీడర్ టీం, మరో చరిత్ర టీం ఇలా అందరూ..మరి వాళ్ళ సినిమా లేనప్పుడూ పోరాడచ్చుగా...పట్టుకోవచ్చుగా..

వాళ్ళ పని తీరు మార్చుకుని..మన మీద ఎందుకు నెడతారో..
మరో చరిత్రని పాపం బాలచందర్ గారు వైజాగులో తీసేసి మమ అనిపించారు...వసూళ్ళూ చేసింది, అవార్డులూ గెలుచుకుంది..ఇప్పుడు ఆ స్టోరీని అమెరికా ఎందుకు పంపించారో ...ఉన్న మంచి పాటల్ని ఎందుకు "చిత్ర" హింస పెట్టారో..వాళ్ళకే తెలియాలి..ఖచ్చితంగా..పాత మరో చరిత్ర అంత గొప్పగా తీస్తాం అని ప్రకటించారు కూడా..ఐనా మాయా బజార్ లా ఆ మరో చరిత్రనే కలర్ చేసేస్తే బాగుండేదేమో..? ఏమిటో ఇదివరకూ సినిమా ఇక్కడ తీసి పాటలకోసం ఫారిన్ వెళ్లేవాళ్ళు..ఇప్పుడు సినిమా కూడా అక్కడే తీసేసి (వేలం) పాటలకోసం ఇక్కడకొస్తున్నారు. ఒక పక్క జేంస్ కెమరూన్ లాంటి వాళ్ళు మన రామాయణం నుంచి స్ఫూర్తి పొందుతుంటే మనం మాత్రం..........ఎటు పోతున్నామో అర్ధం కావట్లేదు.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, నవంబర్ 14, 2009

యాక్ నిరంజన్

 యాక్ నిరంజన్
ఈ సినిమా మొదటి రోజునే చూసేసా. కానీ తేరుకుని ఈ పోస్టు రాయడానికి ఇన్ని రోజులు పట్టింది. అసలు వీళ్ళేమనుకుంటారో అర్ధం కాదు. బిల్లా సినిమాలో హీరోయిన్ లకి బికినీలేసి సారేమో తెల్ల సూట్లేసుకుని మలేసియానో అదేదో దేశం లో అటూ ఇటూ తిరిగాడు..ఇందులో ఏకంగా బేడీలు బొడ్లో దోపుకుని రౌడీల వెంటబడతాడు. ఏమిటో అంతా జగన్నాధుని మాయ.

నేను బాగా చూసి అర్ధం చేసుకున్న విషయం ఏమిటంటే ,.ఈయన చిన్నప్పుడు అంటే కొంచెం పెద్దయ్యాకే..ఏ పోలీసు ఉద్యోగం కోసమో ట్రై చేశాడు ...కానీ అది రాలేదు..అని. ఎందుకంటే ..ఈయన గారి మొదటి సినిమా..బాచి లో జగపతి బాబు పోలీసు...(అనచ్చోలేదో) అమెరికా స్టైల్లో తెల్లటి డ్రస్సు..చొక్కాకి రెండు తుపాకులు .....ఊ అంటే అది తీసి ఆయన ఫైరింగు. ఇక ఇడియట్ లో ఐతే ఆయన మోటో పోలీసు ఆఫీసర్ అవడమే..పోకిరి డిటో ఆల్రెడీ పోలీసు..కానీ పోకిరి..ఇప్పుడు ఇందులో చిన్నప్పడు ఒకణ్ణి పట్టించి.ఒకరూపాయి అందుకున్న పాపానికి (మన పాపానికే) పెద్దయ్యేసరికి పోలీసు ఇంఫార్మర్ గా(దీనికి సార్ ఇంకేదో పేరు కూడా పెట్టాడు) బేడీలు కూడా వేసే స్థాయిలో  మన హీరోగారు. హీరోయిన్ సరే సరి పాపం గిటారు నేర్పుతూ ఉంటుంది కొంత మంది పిల్లలకి..చాలా పేద పిల్ల కావడం వల్ల పాతిక వేల రూపాయల గిటారు కొనుక్కోవాలి కాబట్టి చిన్నప్పటి గౌన్లు అవీ వేసుకుని..గిరజాల జుట్టూ...కెనెటిక్ బండీ (సుమారు నలభై వేలుండదూ)
అన్నని చితక్కొట్టి జైల్లో పడేసిన హీరోగారి ప్రేమలో పడి..ఇంక ఆ తరువాత ..!!!!

సొంత గాంగులో వాళ్లని కూడా సరదాకో..దురదకో..ప్రాక్టీసుకో..పైత్యానికో చంపేసే విలన్ గారు మన హీరోగారు ఎన్నిసార్లు..ఏమి చేసినా..ఊరుకుని..చివరివరకు  తన్నులు తింటుంటాడు. ఆలి లేని లోటు తీరచాడు సినిమాకి.
తల్లిని ఏదో అనడం...చెయ్యడం..తండ్రిని చంపడం..లాంటివీ షరా మామూలే.వీరి సినిమాలో..
ఇంకో ట్విస్టు...అసలే రకరకాల ప్రాబ్లెంసు..వీసా గొడవలు..విదేశీ ప్రయాణాలూ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో..హీరోగారికి ఫోనొచ్చిన మరుక్షణం పోలీసులకో ఇంటర్పోల్ వాళ్లకో అన్నట్టుగా...మరుక్షణం సార్ బాంకాక్ లో ప్రత్యక్ష్యం. ఆదిత్యరాం టికెట్ పెట్టినా...వీసా పాస్పోర్ట్ ఎవరిచ్చారో ? మరో వింతేమిటంటే బాంకాక్ లో పబ్బులో మైకేలు జాక్సన్ గారికి తెలుగు నివాళి.ధన్య జీవి,,,మన పూరీ గారికి మైకేలంటే చాలా ఇష్టమట..అందుకే వాళ్లింట్లో రెండు కుక్క పిల్లల్లో ఒకటి జాక్సన్ మరోటి మైకేలూను. బాగు బాగు....భౌ భౌ సంగీత సార్వాభౌ ' ముడు కదా.

హీరో అనగా...చింపిరి జుట్టు..మాసిన గడ్డం,,,,చదువు సంధ్య లేకపోవడం...సిగరెట్టు..మందు కొట్టడం..దేవుణ్ని నమ్మకపోవడం..దొరికిన వాణ్ని తన్నడం...వగైరా పూరీ మార్కు హీరో లక్షణాలన్ని ఉన్న యాక్ నిరంజన్ కు జోహార్.



నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2009

'జత' దినోత్సవాలు

ఊరంతా ఒకటే హడావిడి..హైదరాబాద్ లో ఆర్ టీ సీ క్రాస్ రోడ్డులో ఒక ధియేటర్ లో అంతా హడావిడి గా ఉంది. బానర్లు రెప రెపలాడుతున్నాయ్. అభిమానులు గోల గోల గా తిరుగుతున్నారు. పూల దండలు.కొబ్బరికాయలు, పాటల సౌండు..ఒకటేమిటి అంతా రచ్చ రచ్చ.
అన్నిటికీ కారణం ఒక పెద్ద హీరోగారి అబ్బాయి మొదటి సినిమా రెండోరోజుకావడమే.

ఇవన్నీ 'జత ' దినోత్సవ వేడుకల హడావిడి. సినిమా రిలేజు కాకముందే..మా సినిమా 100 రోజులు ఆడేస్తుంది..అని 'హ్రుదయం ' ఇంటిపేరుగా మారిపోయిన నిర్మాత గారు ప్రకటించేసారు. ఆయనకి ఇది వరకు డిస్టిబ్యూటర్ గా అనేక సినిమాల 100 రోజుల షీల్డులు అందుకున్న అనుభవం తో...అలా చెప్పారు. ఇండియాలో.ఫారిన్ లో కలిపి ఎన్నో? (వాళ్ళకి కూడ తెలీదు) ప్రింట్లు రిలీజు చేసి...తిరిగొచ్చిన డబ్బాలు..తిరిగి రాని డబ్బాలు(డబ్బులు అనాలేమో?) లెక్క కట్టి మొత్తం వందరోజులు అనుకోవచ్చో? లేక అన్ని ధియేటర్లూ కలిపి..ఆడిన రోజులులెక్క కట్టాలో మరి.
వెనకటికి ఆత్రేయగారు ఒక సినిమా నాలుగు వారాలు ఆడుతుంది అని చెప్పారట! తీరా చూస్తే ఆ సినిమా నాల్రోజుల్లోనే ఎత్తేసారట. అదేంటండీ అంటే నేను చెప్పింది నిజమే నాయనా,,నీకర్ధం కాలేదు...శుక్ర వారం, శని వారం, ఆదివారం, సోమ వారం మొత్తం నాలుగు వారాలు అంటూ 'ముసి ముసి ' నవ్వులు నవాడట మనసు కవి.

ఇహ ఈ సినిమా విషయానికొస్తే,,,,జత దినోత్సవ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి ...కారణం ..సదరు హీరోగారి తండ్రిగారు...హీరోయిన్ గారి తల్లిగారూ, హీరో..హీరోయిన్ను. మ్యూజిక్ ఇచ్చినాయన..ఇలా అందరూ వస్తున్నారట. మర్నాడు విజయ యాత్ర కూడా ఉండడం తో..హడావిడి అలా ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న టైము రానే వచ్చింది..హీరో అండ్ బాచ్ వచ్చేశారు.నడుస్తున్న సినిమ ఆపేసి..దండయాత్ర కార్యక్రమం అదే దండలు వేసే కార్యక్రాం..అయిపోయాక..హీరో గారి తండ్రి గారు..ఇన్నాళ్ళూ నన్ను భరించారు ఇక మా అబ్బాయిని మీ మీదకి వదులుతున్నా . ఇక మీ ఇష్టం అంటూ చేతులూపాడు. హీరోయిన్ తల్లి..మాట్లాడుతూ...హీరోగారి ఫాదర్ తో నేను ఇంతకు ముందు హీరోయిన్ గా చేసా ఇప్పుడు మా పిల్లలు కలిసి చేస్తుంటే 'ఆ ' రోజులు గుర్తొస్తున్నాయి అంటూ తెగ సిగ్గు పడిపోయింది.

హీరోయిన్ స్టేజి మీద కి వచ్చింది..ఆవిడ ఎటు చూస్తోందో కెమెరా వాళ్ళకి కూడా అర్ధం కాలేదు.ఆమె మొదలెట్టింది. అమ్మా వాడు నిండా పెద్ద హీరోయిన్ ఉంది..అప్పుడు. అంకుల్ నాకు హీరోయిన్ చేసినందుకు హాప్య్..అండ్ తాంక్స్..హీరో చాలా కోపరేటివ్....నేను ఒక కన్ను టాలివుడ్..ఒక కన్ను కోలివుడ్(తమిళ సినిమా) మీద పెట్టా అందుకనే ఇలా కనిపిస్తుంది అని మెల్లగా తన మెల్ల రహస్యాన్ని చెప్పింది
ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ,,, when I heard the story , I was inspired and gave music in one day అంటూ హిందీ సినిమా కోసం చేసి హైద్రాబాద్లో తన ఆల్బం మర్చిపోయిన తన పీ యే ని తిట్టుకుంటూ ....చెప్పేసాడు.
ఇక హీరోగారి వంతు...ఈ రోజు కోసమే..ఈ రోజు కోసమే 23 ఏళ్ళు గా ఎదురుచూస్తున్నా..చదువుకుందామనుకున్నా..అబ్బలేదు..స్పోర్ట్స్ మెన్ అవుదామనుకున్నా కష్టపడలేను..బిజినెస్ చేద్దామనుకున్నా చేతకాలేదు...అందుకే ఇక హీరో అవుదామనుకున్నా...అయిపోయా....తాంక్స్ టు తాత,,,,నాన్న...తాంక్స్ టు హృదయం అంకుల్ ....తాంక్స్ తొ మీకందరికి...అంటూ ఇంగ్లీషు..తెలుగు కలిపి అనేసి చెయ్యి చూపించేసి..బయలుదేరాడు.

తనకి సినిమా సినిమాకీ గుండెపోటు వస్తుంది కాబట్టి హృదయం ప్రొడ్యూసర్ అంటారు అనీ...ఆ సినిమా తీసినందుకు కాదని చెబుదామనుకుని...తనకి చాన్స్ రాకపోవడం తో రేపటి విజయ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి బయలుదేరాడు ఆ ప్రొడ్యూసర్.
ఏమో శత దినోత్సవాల రోజులు పోయి ఇలా జత దినోత్సవాలు వస్తాయేమో కూడా
చూశారా మరి.




నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails