Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

మంగళవారం, జనవరి 17, 2012

స్వామి భక్తి కి పరాకాష్ట బాడీగార్డ్హీరో బాడీ గార్డ్ కాబట్టి.. హీరో చుట్టూనే తిరుగుతుంటుంది కధ..గవర్నమెంటాఫీసు నుంచి వచ్చే ఉద్యోగం గా ప్రైవేట్ సెక్యూరిటీ సెర్వీసెస్ లోని మహా  బలశాలి బాడీ గార్డు. తను కాపాడిన వాడు ఎవరో తెలీని స్వామికోసం ఏదైనా చేయాలనుకునే నమ్మకమైన బాడీగార్డు..షరా మామూలుగా ఎంగేజ్  మెంట్ ఐపోయిన అమ్మాయిని చేసుకోవడమనే సెంటిమెంట్ నిలబెట్టుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. పలీ బూతు కామెడీకి వేణుమాధవ్ నాటు కామెడీ తోడై..అటు ఆడా..మగా కాని వేషాలేసిన కామెడీతో కలిపి..కడుపు తిప్పుతుంది. కాస్త కామెడీ.కాస్త సెంటిమెంటు.కాస్త రొమాన్సు కలిపి..ముసలి హీరో..పడుచు హీరోయిన్లు..చివరకి హీరో హీరోయిన్ కలవాలి కాబట్టి 10 యేళ్ళ పిల్లాడి మెచ్యూరిటీకి మెచ్చి..పెళ్ళీ పెటాకులు లేకుండానే పట్టుచీర కట్టుకుని బయలుదేరే హీరోయిను..పాపం సినిమా అంతా హీరోయిన్ పక్కనే తిరిగి..ఇద్దరినీ కాపాడడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన రెండో హీరోయిన్ కాన్సర్ తో చచ్చిపోయి బతికిపోతుంది.. అసలు హీరోయిన్ ని చేసుకుందామనుకున్నాయన ఏమైపోయాడో తెలీదు. ఇంట్లో మొగుడికి తెలీకుండా 10 యేళ్ళ పిల్లాడికి డైరీ దొరికేలా ఎలా చేస్తుందో తెలీదు. రైల్లో చదూతూ వస్తుంటే కూడా ఎవరూ ఎందుకు చూడరో తెలీదు. లేడీస్ బాత్ రూంలోకి..హాస్టల్ లోకి వెళ్ళే హీరో గారి కామెడీ..ప్రిన్సిపాల్ అన్నా లెక్చరర్ అన్నా జోకర్ గా చూపించే కామెడీ.  కధ ఎలా ఉంటుందో సింబాలిక్ గా లాస్ట్ సీన్ లో చెత్తబుట్టలోంచి ఏరుకొచ్చిన డైరీ చూపించారు.. మధ్యలో పాటలెన్ర్దుకొస్తాయో సమయం సందర్భం లేకుండా..అర్ధం కాదు. రెండు పాటలమధ్యలో ఫైటు ఉండాలి కాబట్టి ఒక రివెంజు..పార్కులు,,,సినిమాలు..కాలేజీలు తిరుగుతున్నా జరగని గొడవలు...అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటాయి. ఏంటో నాకు సినిమాలు చూడ్డం ఎప్పటికి వస్తుందో..? ఈ మధ్య పంజా గురించి రాస్తే...నాకసలు సినిమా చూడ్డం రాదని..మ్యూజిక్ అద్భుతంగా ఉంటే వినడం చేతకాక బాగాలేదన్నాని నన్ను తిట్టిపోసారు..పవర్ స్టార్ గారి అభిమానులు కొందరు.. వాళ్ళు ఇప్పటికి ఎన్ని సార్లు చూసారో ఆ సినిమాని..పాపం ఆ భగవంతుడికే తెలియాలి. నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

ఆధార్

ఆధార్ - లింకింగే అనుకున్నా, అన్‌లింక్ కూడా చేస్తుందన్నమాట ;) నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

LinkWithin

Related Posts with Thumbnails

Alexa