యాక్ నిరంజన్
ఈ సినిమా మొదటి రోజునే చూసేసా. కానీ తేరుకుని ఈ పోస్టు రాయడానికి ఇన్ని రోజులు పట్టింది. అసలు వీళ్ళేమనుకుంటారో అర్ధం కాదు. బిల్లా సినిమాలో హీరోయిన్ లకి బికినీలేసి సారేమో తెల్ల సూట్లేసుకుని మలేసియానో అదేదో దేశం లో అటూ ఇటూ తిరిగాడు..ఇందులో ఏకంగా బేడీలు బొడ్లో దోపుకుని రౌడీల వెంటబడతాడు. ఏమిటో అంతా జగన్నాధుని మాయ. నేను బాగా చూసి అర్ధం చేసుకున్న విషయం ఏమిటంటే ,.ఈయన చిన్నప్పుడు అంటే కొంచెం పెద్దయ్యాకే..ఏ పోలీసు ఉద్యోగం కోసమో ట్రై చేశాడు ...కానీ అది రాలేదు..అని. ఎందుకంటే ..ఈయన గారి మొదటి సినిమా..బాచి లో జగపతి బాబు పోలీసు...(అనచ్చోలేదో) అమెరికా స్టైల్లో తెల్లటి డ్రస్సు..చొక్కాకి రెండు తుపాకులు .....ఊ అంటే అది తీసి ఆయన ఫైరింగు. ఇక ఇడియట్ లో ఐతే ఆయన మోటో పోలీసు ఆఫీసర్ అవడమే..పోకిరి డిటో ఆల్రెడీ పోలీసు..కానీ పోకిరి..ఇప్పుడు ఇందులో చిన్నప్పడు ఒకణ్ణి పట్టించి.ఒకరూపాయి అందుకున్న పాపానికి (మన పాపానికే) పెద్దయ్యేసరికి పోలీసు ఇంఫార్మర్ గా(దీనికి సార్ ఇంకేదో పేరు కూడా పెట్టాడు) బేడీలు కూడా వేసే స్థాయిలో మన హీరోగారు. హీరోయిన్ సరే సరి పాపం గిటారు నేర్పుతూ ఉంటుంది కొంత మంది పిల్లలకి..చాలా పేద పిల్ల కావడం వల్ల పాతిక వేల రూపాయల గిటారు కొనుక్కోవాలి కాబట్టి చిన్నప్పటి గౌన్లు అవీ వేసుకుని..గిరజాల జుట్టూ...కెనెటిక్ బండీ (సుమారు నలభై వేలుండదూ)
అన్నని చితక్కొట్టి జైల్లో పడేసిన హీరోగారి ప్రేమలో పడి..ఇంక ఆ తరువాత ..!!!!
సొంత గాంగులో వాళ్లని కూడా సరదాకో..దురదకో..ప్రాక్టీసుకో..పైత్యానికో చంపేసే విలన్ గారు మన హీరోగారు ఎన్నిసార్లు..ఏమి చేసినా..ఊరుకుని..చివరివరకు తన్నులు తింటుంటాడు. ఆలి లేని లోటు తీరచాడు సినిమాకి.
తల్లిని ఏదో అనడం...చెయ్యడం..తండ్రిని చంపడం..లాంటివీ షరా మామూలే.వీరి సినిమాలో..
ఇంకో ట్విస్టు...అసలే రకరకాల ప్రాబ్లెంసు..వీసా గొడవలు..విదేశీ ప్రయాణాలూ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో..హీరోగారికి ఫోనొచ్చిన మరుక్షణం పోలీసులకో ఇంటర్పోల్ వాళ్లకో అన్నట్టుగా...మరుక్షణం సార్ బాంకాక్ లో ప్రత్యక్ష్యం. ఆదిత్యరాం టికెట్ పెట్టినా...వీసా పాస్పోర్ట్ ఎవరిచ్చారో ? మరో వింతేమిటంటే బాంకాక్ లో పబ్బులో మైకేలు జాక్సన్ గారికి తెలుగు నివాళి.ధన్య జీవి,,,మన పూరీ గారికి మైకేలంటే చాలా ఇష్టమట..అందుకే వాళ్లింట్లో రెండు కుక్క పిల్లల్లో ఒకటి జాక్సన్ మరోటి మైకేలూను. బాగు బాగు....భౌ భౌ సంగీత సార్వాభౌ ' ముడు కదా.
హీరో అనగా...చింపిరి జుట్టు..మాసిన గడ్డం,,,,చదువు సంధ్య లేకపోవడం...సిగరెట్టు..మందు కొట్టడం..దేవుణ్ని నమ్మకపోవడం..దొరికిన వాణ్ని తన్నడం...వగైరా పూరీ మార్కు హీరో లక్షణాలన్ని ఉన్న యాక్ నిరంజన్ కు జోహార్.
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
3 కామెంట్లు:
హ్హి..హ్హి..హ్హి....అచ్చం నేను కూడా ఇలాగే ఏడ్చానండీ ఈ సినిమా చూసి .
http://naaspandhana.blogspot.com/2009/11/blog-post_12.html
nachindi ... naluguriki chepta ....
హ హ
చాలా బాగా రాసారు. ఐ మీన్ బాగా తిట్టారు.
నాకు ఈ సినిమా చూసేంత అదృష్టం పట్టలేదులెండి చక్కగా బ్లాగుల్లో రాస్తున్న రివ్యూ లు చదివి నవ్వుకొని ఆనందిస్తున్నా. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి