షిఫ్ట్ డెలిట్
కంప్యూటర్ వాడేవారందరికీ ఇది తెలిసే ఉంటుంది..షిఫ్ట్ డెలిట్ అంటే పెర్మినెంట్ గా తొలగింపు అని...హస్తినా పురం లో అడ్మినిస్ట్రేటర్ మాత ..ప్రస్తుతం అదే చేసినట్టున్నారు?
వై ఎస్ ప్రోగ్రాం సడెన్ గా క్రాష్ కాగానే...వెంటనే రన్ అవుతుందనుకున్న సబ్ ప్రోగ్రాం జగన్ సాఫ్ట్ వేర్ కి టెస్టింగ్ కాలేదని..ఓల్డ్ వెర్షన్ ఐనా రోశయ్య టూల్ నే ఎంచుకున్నారు.
మాటి మాటికి సీ ఎం వెర్షన్ మార్చే కాంగ్రెస్ లో .. మార్పు అవసరం లేకుండా నెట్టుకొచ్చిన ఆపరేటింగ్ సిస్టం వై ఎస్. కొత్తగా తెచ్చిన..ప్రోగ్రాం లు.. ఇంకా కొన్ని సబ్ ప్రోగ్రాం లు.. ఇందిరా రాజీవ్ ల పేరున తయారు చేసిన స్టైల్ షీట్లు..ఒకటేమిటి..మళ్లీ ఏ ఆపరేటింగ్ సిస్టం అవసరం లేకుండా..నదిపించేసాడు...పాద యాత్రలు అలవాటు కదా.కానీ సడెన్ గా క్రాష్ అవడం తో..ప్రస్తుతం అగమ్యగోచరం అనుకుంటున్న తరుణం లో రోశయ్య రూపంలో ఓల్డ్ వెర్షన్ దొరికింది..కాంగ్రెస్ సెర్వర్ కి.
చూద్దాం ఏం జరుగుతుందో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి