Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

ఆదివారం, నవంబర్ 15, 2009

పేరంటంఆదివారం కదా అని హాయిగా లేటుగా నిద్ర లేచి...వాకిట్లో కూచుని పేపర్ తిరగేస్తున్నా.ఈలోగా..పట్టుచీరలు కట్టుకుని కొంతమంది ఆడవాళ్ళు పొలో మంటూ పది మంది వచ్చారు. మా ఆవిడ స్నేహితులేమో అనుకుని..లోపలకొచ్చి మా ఆవిణ్ణి పిలిచా. ఆ వచ్చిన వాళ్ళు, మా ఆవిడకి బొట్టుపెట్టి, రవికల గుడ్డ పెట్టి ఇంకేదో చెబుతున్నారు. మా ఆవిడ నన్ను పిలిచింది. ఏంటో అనుకుని నేను బయటకెళ్ళా. వాళ్ళలో ఒకరు..అన్నయ్య గారూ..మీరూ తప్పకుండా రావాలి. వొదిన్ని..బాబాఇగారిని తీసుకురావాలి. మర్చిపోవద్దు. అంటూ పొలోమని వెళ్ళి పోయారు...ఏదో గాలి దుమారం లా. నాకేమీ అర్ధం కాలేదు. ఆడవాళ్ళ ఫంక్షన్ కి నేనేమిటీ అని అడిగా మా ఆవిణ్ణి.కిసుక్కున నవ్వింది మా ఆవిడ.


ఆ వచ్చింది పేరంటానికి పిలవడానికి కాదండీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఓటెయ్యడానికి అని అసలు రహస్యం చెప్పింది. ఔరా అనుకున్నా. ఇంతలో దూరంగా మరో బాచ్ వస్తుంటే .. భయపడి బాత్రూం లో చేరా...


బయటకొచ్చాక మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతూ..ఆవిడిచ్చిన (అదే పిలుపులకొచ్చిన ఆవిడ) ఫాంప్లేట్ చూశా. ఒక పక్క వాళ్ళాయన ఫొటో ..మరో పక్క ఆవిడ ఫొటో ఉన్నాయి. ఆయన మా కాలనీ చుట్టుపక్కల ఓమాదిరి పేరున్న లీడరే..ఏమైనా గొడవలూ గట్రా ఐతే  ఆయన తప్పకుండా అక్కడుంటాడు..ఐతే గోడవ తీర్చడానికి లేకపోతే గొడవపడుతూనో ఉంటాడు..ఈ మధ్యే ఒక ఆటో డ్రైవర్ ని ఐదు రూపాయలు ఎక్కువడిగినందుకు పళ్ళూడగొట్టి.అవినీతి పై తన ప్రతాపం చూపించిన మహా లీడర్ ఆయన. ఆయనకి మా కాలనీలో ఒకటి బయటింకెక్కడో మూణ్నాలుగు వైన్ షాపులున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. మరి ఏకంగా ఆయనే నుంచోకుండా..వాళ్ళావిణ్ణి ఎందుకు నుంచో పెట్టాడా అనుకున్నా. ఈ నియోజకవర్గం లో స్త్రీల రిజర్వేషన్ ట .. గెలిచేది ఆవిడే అయినా పాలన వారిదేనట..ఇంకొన్ని కాంట్రాక్టులు ఈజీ గా రావడానికి వీలుగా మనమె మెంబరైపోతే ఇంకా హాయి గదా అని.ఇలా.....


సరే ఆ విషయం వదిలేస్తే ఓటెవరికి వెయ్యాలో అర్ధం కావట్లేదు. మొన్నటిదాకా కలిసున్న తెలుగు దేశం. టీ ఆర్ ఎస్ విడిపోయారో కలిసే ఉన్న్నారో అర్ధం కావట్లేదు. చిరంజీవి తప్ప మరెవరు ఆ పార్టీయో అర్ధం కాని ప్రజా రాజ్యం...లోక్ సత్త జయ ప్రకాష్ దీ అదే పరిస్థితి...ఇక వై ఎస్ లేని కాంగ్రెస్. ఎవరు ఎవరితో కలిసున్నారో..కలిసి లేరో..ఏది మిత్ర పక్షమో..ఏది ప్రతిపక్షమో..అసలు తెలీట్లేదు.


పాత బట్టలకి స్టీల్ సామానిస్తాం, సత్తుబిందెలకి మాట్లేస్తాం.,అంటూ అరుస్తూ తిరిగే వాళ్ళలా ఎలక్షనప్పుడు మీ రోడ్లు బాగుచేస్తాం..మంచినీళ్ళిప్పిస్తాం, ప్రాబ్లెంస్ తీరుస్తాం, అంటూ వీధి వీధి..ఇల్లు ఇల్లు తిరిగి చాటింపు వేసే వీళ్ళు గెలిచాక ఎక్కడుంటారో..ఏం చేస్తారో తెలీదు. పెద్ద వాళ్లంతా ఎసెంబ్లీలో కొట్టుకుంటుంటే..వీళ్లంతా ఇక్కడేమో..ఏంటో ఈ ఎలక్షన్ లేమిటో.ఈ గొడవలేమిటో.


ఫ్లై ఓవర్ లు కూలితే తప్పు అవతల వాళ్లది.బాగుంటే ఘనత మనది..మినిస్టర్లు..సినిమా వాళ్ళు తిరిగే రోడ్లు అద్దాల్లా ఉంటాయి..,,మిగతావి అధ్వాన్నం గా ఉంటాఇ.. మళ్లీ విదేశాల్లో సర్వేలు.నివేదికలు..బడ్జెట్లు...గొడవలు..ఓకే అయ్యే నాటికి మళ్ళీ ఎలక్షన్ లు..షరా మామూలే..ఓకే మీరెళ్ళే సరికి మీ ఓటుంటే వేసి రండి...


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa