ఆర్యా థూ
దీనికి ఇంతకన్నా మంచి పేరు నాకు తోచలేదు. ఒక అద్భూతమైన ముక్కోణపు ప్రేమ-స్నేహం-పైత్యం-త్యాగం-మూర్ఖత్వం- ల సమ్మేళణం గా మలచిన విచిత్ర రాజం అనిపించిన సినిమా.అసలు ఆర్య లోనే ఆ పాయింటు అర్ధం కాక తికమక పడ్డా. ఇప్పుడు ఈ రెండో భాగం చూశాక అసలు వీళ్లకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అని అర్ధం కాలేదు.
ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు.అంటే ఒకళ్లకోసం ఒకళ్లు ప్రాణాలిచ్చేంత అని అపార్ధం చేసుకోకూడదు. వాళ్ల విచిత్ర స్నేహం తో మన ప్రాణం తీస్తారని అర్ధం. హీరో ఎవరికీ తెలీకుండా తాగిన, వాగినా, జనాల్ని కొట్టినా, సైటు తిట్టినా, హీరో కాబట్టి గ్రేటు..ఆయన గ్రేట్ నెస్ చూపాలంటే ఇంకోణ్ని వెధవని చెయ్యాలి. అంత ప్రాణ స్నేహితులు..ఎప్పటికప్పుడు హీరో ఫ్రెండు చెడ్డవాడిగా పనికిరానివాడిగా, చూపిస్తూ హీరోగారు మాత్రం మిస్టర్ పెర్ఫెక్త్ గా నిలుస్తుంటాడు. ఆయనంటే ఎంత గురి అంటే..హీరో లిఫ్టులో ముద్దు పెట్టాడు అని హీరోయిన్ చెప్పినా అదేదో టీ వీ లో టెలి బ్రాండ్ ఎడ్వర్టైజ్ మెంట్ లా చూసి నవ్వుకుని వెళ్లిపొతారు. ఆయన మాత్రం ఎంచక్క లేడీస్ టాయ్లెట్ లోకెళ్ళి మందు కొట్టి, ఆవకాయ నంచుకుని..బయటకొచ్చి బుడ్డిమంతుడు సారీ బుద్ధిమంతుడిలా నుంచుంటాడు..ఇక్కడా హీరోయిన్ పాపం బకరీ అవుతుంది..వీరి పైత్యానికి సపోర్ట్ గా బ్రహ్మానందం బ్యాచి, ఓ ముసుగు కారు,,మరిన్ని వింతలు..
ఇక హీరోగారు, హీరో ఫ్రెండు గారు సిగరెట్ మీద సగం సగం పేరు రాసుకుని..సగం సగం పంచుని, తాగుతూ, ఆ బూడిద మనమీద వేస్తుంటారు. ఒక సిగరెట్ తాగినట్టుగానే ఒక అమ్మాయినే ప్రేమిస్తారు. చివరికంటా సిగరెట్టులానే మార్చి మార్చి పంచుకుంటారు. స్నేహం కోసం ఏమైనా చేసే..మన హీరో గారు హీరోయిన్ ను ఫ్రెండ్ కి అందించడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. మామూలుగానే ఫాక్షన్ లీడర్ గారైన హీరోయిన్ తండ్రిగారు...తాను మీ అమ్మాయి ప్రేమికుడిని అని చెప్పినా హీరోని ఏమీ అనక పోగ..అప్పట్నుంచీ హీరో ఏం చెబితే దానికి తల ఊపి, పెళ్లి చెడిపోయిన తరువాత తన కూతుర్నిచ్చి పెళ్ళికూడా చేస్తాడు.
ఇక ఇక్కడనుంచీ హీరో గారి హీరోయిజం ముందు మన భారత దేశం, మన సంప్రదాయం, పెళ్లి పై ఉన్న అభిప్రాయం, ఇవన్ని చిన్నబోతాయి. పెళ్లి చేసుకున్న తన భార్య ఐన ప్రియురాలిని..ఫ్రెండుకిచ్చి పంపించేసి మామ గారింటికి వెళ్లి పోతాడు మన హీరోగారు. ఫ్రెండుని ప్రియురాలిని అమెరికా పంపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసేసి..పాపం ఫ్రెండు సిగరెట్టు మానెస్తాడేమో అని సగం సిగరెట్ట్లు తాగెసి పోగేసి హీరోయిన్ కం ప్రియురాలికి గిఫ్టు ఇస్తాడు. ఆ త్యాగం, చూసి చెలించిన చెలి అదేనండీ ప్రియురాలు తండ్రికి ఫోను చేసి పిలిపిస్తుంది..ఫ్రెండు ని పొడవబోయి అల్లుణ్ణి పొడుస్తాడు.
హాస్పటల్ లో జ్`నానోదయం అయిన ఫ్రెండు ప్రియురాలిని భర్తకి ఒదిలేసి కధ సుఖాంతం చేస్తాడు. ఆహా ఆక్సిజన్ సిలిండర్ ఆపినా బతికే హీరోగారు..ఎవర్ని ప్రేమించిందో తెలీని హీరోయిన్ కలిసిపోతారు. గ్రేట్ ఐడియా...
రింగ రింగ పాటలో అర్ధం బాగాలేదని గొడవ చేసిన.. వారికి ..సినిమా చూస్తే ఇంక ఏమనిపిస్తుందో..మరి. అసలు సెన్సార్ అన్నది ఉందా. వారి పనేంటో..సినిమాలో సీనులు చూసి దాని బట్టి సర్టిఫికేట్ ఇవ్వడమేనా..ఇలాంటి అద్భుతాలు కనిపించినప్పుడు పట్టించుకోరా. హీరోలు...దర్శకులు వాళ్లకేది అనిపిస్తే అది తీసేసి జనం మీదకి తోసెయ్యడమేనా..పాట లో మార్పులు చేసారు.సినిమాలో, కానీ అప్పటికే విడుదలైన సీడీల మాటేమిటి..ఇక నుంచీ ఆడియోకి కూడా సెన్సారుండాలా విడుదల కి ముందు ఎవరైనా విని ఓకే చేసే పరిస్థితి వస్తుందా.? అసలు పైత్యానికి పరాక్ష్టగా ఉన్న వీళ్ల ఆలోచనలు ఎప్పుడు మారతాయో..ఎనిమిదేళ్ల అబ్బాయి ఏదో రసాయన చర్యలతో పెద్దగా ఐపఓయి. పెళ్ళి చేసుకుని, ఒక పూట చిన్నగా, ఒక పూట పెద్దగా ఉండే లాంటి కధలల్లే అపర మేధావులు, స్నేహం కోసం భార్యని త్యాగం చేసే మిస్టర్ పెర్ఫక్ట్ గార్లు, అబ్బ తెలుగు సినిమా పతాకం ఎక్కడో రెప రెప లాడుతోంది. రేపటి రోజు సినిమా తలుచుకుంటే భయమేస్తోంది.
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
2 కామెంట్‌లు:
sarvadu chala baga chepparu.nenu e cinema chusina taruvata em matladalo ardham kaledu.bhahusa verri veyi talalu veyadam ante edenemo!!!!???????
నచ్చింది బాగా ఈ పోస్టువల్ల. అందరికీ తప్పక చెబుతాను,మీకూ చెబుతున్నా.. అసలు ఆ పాట తలచుకుంటే ఒళ్ళి మండిపోతుంది. ఆ దరిద్రపు సాహిత్యం రాసిన మహానుభావడిని ఏంచెయ్యాలి. పండగ చేసుకుంటూ దాన్ని చెత్తగా చిత్రీకరించిన వాళ్లని ఏం చెయ్యాలి? జనం పిచ్చి వాళ్లనా వీళ్ళ ఉద్దేశ్యం? ఎవరూ పట్టించుకోరా ? ఎవరికీ బాధ్యత లేదా? ...
మీ పోస్టు స్పూర్తితో నేను కొత్త పోస్టు రాస్తున్నాను . దయచేసి చూడండి. http://telugukala.blogspot.com/2009/12/blog-post_29.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి