Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
ys jagan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ys jagan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, మే 04, 2014

ఐ పీ ఎల్

రెండు ఐ పీ ఎల్ లు ఒకే లా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ పొలిటికల్ లీగ్.

ఎవరు ఏ టీం లో ఉన్న్నారో.. ఎవరు ఎవరిని కొన్నారో .. కంఫ్యూజన్.
ముందు దుబాయ్ లో తరువాత ఇక్కడ..  ఇక్కడా అంతే..మును కొన్ని ప్లేసుల్లో తరువాత కొన్ని ప్లేసుల్లో

అక్కడా ఫిక్సింగ్ ప్రాబ్లెం..  ఇక్కడా ఫిక్సింగ్ ప్రాబ్లెం..

అక్కడ కింగ్ఫిషర్ స్పాన్సర్..ఇక్కడ స్పాన్సరింగ్ కింగ్ ఫిషర్..

అక్కడా కోట్ల డబ్బు.. ఇక్కడా కోట్ల డబ్బు..

అక్కడ బాటు తో బాలు కొట్టాలి.. ఇక్కడ బాలెట్ తో..


చూద్దాం ఎవరు గెలుస్తారో ?







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

గురువారం, ఆగస్టు 12, 2010

నీకేమి తెలుసు..నిమ్మకాయ పులుసు

నీకేమి తెలుసు ..నిమ్మకాయ పులుసు

రక్తం అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారు....జీవితా రాజసేఖర్

రక్త దానం గురించి మాట్లాడితే నాలుక కోస్తా--అల్లు అరవిందు

తెలంగాణా అడ్డుపెట్టుకుని వేల కోట్లు గడించాడు కే సీ ఆర్ - హరికృష్ణ

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.పరువునష్టం దావా వేస్తా - కే సీ ఆర్

తండ్రి వల్ల జగన్ ఆస్తులు కూడబెట్టాడు  --ఈనాడు
ప్రజల ఆస్తి మార్గదర్శిలో పెట్టి మోసం చెసాడు రామోజీ రావు - సాక్షి
శని వారం - భారత్ నంబర్ వన్ క్రికెట్ టీం
మనగళ వారం - 98 పరుగులకే ఆలౌట్ 200 పరుగుల తేడాతో న్యూజీలాండ్ చేతిలో ఓడిన భారత్
హా...కీ...
ఐ హెచ్ ఎఫ్ నే గుర్తిస్తాం..హాకీ ఇండియా నే సరైనది...
కామన్వెల్త్ క్రీడల పై క్రీనీడలు..పూర్తి కాని స్టేడియాలు...కొలిక్కిరాని స్పాన్సర్షిప్పులు
అభివృద్ధి పధం లో ముందుకు పోలేక పోయినా
బెల్టు షాపులతో నడుం బిగించి మందుకు పోదం అంటున్న ప్రభుత్వం
గవర్ణమెంటు ఆసుపత్రి..బడి..ఆఫీసు ఉన్నా లేకపోయినా వీధి వీధి కి....ఇంటి ఇంటి కీ మధ్య మధ్యం దుకాణం మా వరం...

ఇవి రోజూ వారీ హెడ్ లైన్లు.. కాకపోతే ... సగటు ఆంధ్రుడు..రోజూ సీరియల్ లాగా న్యూసు చూసేసి..ట్విస్ట్ లు చూసి..ఇది మామూలే అనుకుని..మళ్ళీ తన పని లోకి తాను...పోనీ ఏదైనా ఎవరినైనా అడుగుదామంటే..అతనికి ఎదురయ్యే ప్రశ్న

నీకేమి తెలుసు..నిమ్మకాయ పులుసు








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

గురువారం, నవంబర్ 05, 2009

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

కెలక్కు

వెన్న ముద్దలు అనే పుస్తకంలో ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అన్నారు..ఇష్టం లేక పోతే ఉలక్కు పలక్కు కానీ కెలక్కు...అని...ప్రస్తుతం కాంగ్రెస్ అధిస్టాన వర్గం అదే చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర లో రాజకీయ అనిస్చితి చూసి....ఏం చెయ్యాలో తెలీక...ఏదో ఒకటి చేసేయలేక..ఎదురుచూస్తోంది.

సోనియా నే అన్నీ చూసుకుంటారు..సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు అని మిగిలినవాళ్ళు చెబుతున్నా....'ఆ' నిర్ణయం ఏంటో ఇంకా ఆవిడకి కూడా అంతుబట్టటం లేదు. ఇన్నాళ్ళూ అన్ని తానే అయి నడిపించిన రాజసేఖరుడు స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక తిక మక పడుతున్నారు.

మొన్నేమో జగనే సీ ఎం అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం గేప్ ఇచ్చారు. అటు కే వీ పీ...హైదరాబాదు..డిల్లీ తిరిగి తిరిగి విసిగి ఉన్నారు..ఇన్నాళ్ళూ వెనకుండి నడిపించిన ఆయన ప్రస్తుతం ముందు జరగవలసిన దాని గురించి మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఏమిటో ...ప్రస్తుతం రోశయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్నా...అలా ఉండడం ఆయనకూ ఇస్టం ఉండదు...ఐతే మొత్తం అవాలి లేదా ఊరుకోవాలి...





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

శనివారం, సెప్టెంబర్ 05, 2009

' ప్రజా ' శేఖర్ రెడ్డి= ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి

ప్రజా సేవకు రెడీ అనే రాజ శేఖర్ రెడ్డి ఇక లేరు...ఇది ఇవ్వాళ ఏ పేపరు చూసినా..న్యూస్ చానెల్ పెట్టినా కనిపించిన హెడ్ లైను.కానీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నాడు. ఇంత ఏ ముక్యమంత్రి మరణానికీ పక్క రాష్ట్రాలు కూడా శలవు ప్రకటించలేదు..అంటే ఆయనకున్న మంచి పేరు ఎలాంటిదో అందరికీ అర్ధం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కి వెళుతూ.తరలి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహా మనిషి.

ప్రజా సేవకు రెడీ అనే ఆ రాజ శేఖరుడు...కాలిబాటన రాష్ట్రం నలుమూలలా పర్యటించి..రాజధానికి రాజుగా చేరుకున్నాడు. పల్లెలో వెతలు చూసి ఉచిత కరెంటు ఇచ్చాడు, పల్లె బాటలో జనాన్ని చూసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు. డాక్టరు కావడం వల్ల..తన ఆరాధ్యమైన రాజీవ్ పేరిట ఆరోగ్య శ్రీని అందించాడు...ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి...కష్టించే వాళ్ళకూ గూడు అందించాడు. కూడు.గూడు..ఆరోగ్యం ....అందించాడు..ప్రాజెక్టులు కట్టి..పూర్తి చేసాడు...తలచిన పని చేసుకు పోవడమే కానీ వెను తిరిగి చూడని ధీశాలి.

ఇంకా ఎన్నో చేయాలనుకున్నా....మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ పనులు ఇంక ఎవరు చేస్తారో వేచి చూడాలి. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ






నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails