Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com
rosayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rosayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మే 03, 2013

పవర్ యాత్ర




ఈ మధ్య ఎక్కడ చూసినా యాత్రలు..పాద యాత్రలు..పవర్ యాత్రలే కనిపిస్తునాయ్ వినిపిస్తున్నాయ్.

అప్పట్లో పదండి దండి మార్చ్ కి అంటూ ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీ గారు పాదయాత్ర చేసారట

తరువాత అద్వానీ గారు రామ రధం మీద గల్లీ గల్లీ తిరిగి తిరిగి ఢిల్లీ చేరారు

ఆ మధ్య వై ఎస్ ఆర్ గారు పాదయాత్ర చేసి చేసి చివరకి సీ ఎం కుర్చీలో రెస్ట్ తీసుకున్నారు. రెండు సార్లు ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన మరణించాక వాళ్ళబ్బాయీ..ఆయన జైలుకెళ్ళాక వాళ్ళ చెల్లాయి ఓదార్పు యాత్ర పేరుతో పాద యాత్రలు..బస్సు యాత్రలు చేసారు చేస్తున్నారు..

నిన్నటి దాకా మన చంద్ర బాబు గారు కూడా గుర్తు సైకిల్ ఐనా పాపం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రస్తుతం ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి పాదయాత్రలా పవర్ యాత్రలా అంటే పవర్ కోసం యాత్రలా ?


వీళ్ళంతా పదవి లేనప్పుడు పదవి కోసం తిరగడమే తప్ప..పదవి లో ఉన్నప్పుడు ఎందుకు తిరగరో.. టైముండదనుకుంటా...అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లెంసు, ఇంకా అవీ ఇవీ అడ్డొస్తాయి కాబోలు!

అందరూ పల్లె పల్లె తిరిగేసి..గుడిసె గుడిసే చూసేసి..బుగ్గలు నిమిరేసి..భోజనాలు చేసేసి..కష్టాలు వినేసి.. స్పీచులు ఇచ్చేసి.. వాగ్దానాలు చేసేసి.. సరాసరి పీఠం ఎక్కేసి.. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటారు... జనం మాత్రం ఈ ఐదేళ్ళు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ, పంచాయితీల చుట్టూ.. ఆఫీసర్ల చుట్టూ,,రేషన్ కొట్ల చుట్టూ, సంక్షేమ పధకాల చుట్టూ చేతిలో పాత్రతో పాద యాత్ర మొదలు..


కమాన్ కామన్ మాన్ గెట్ రెడీ ఫర్ పాద యాత్ర!










నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

మంగళవారం, డిసెంబర్ 15, 2009

జై ఆంధ్రా - జై తెలంగాణా

 జై ఆంధ్రా - జై తెలంగాణా  

బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.

ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?

ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?

ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.





నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

LinkWithin

Related Posts with Thumbnails