ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గెలిచిన వేళనే చూడాలీ

 గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
 
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.

నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.

ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.

ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు.  రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '

జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..

నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వ్యాఖ్యలు

అజ్ఞాత చెప్పారు…
Sooper...!!! Bagundi nalugurikee cheppemundu ade vishayam meeku cheppalani anthe.... Good work...!!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!