Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, మార్చి 22, 2019

మంగళవారం, ఫిబ్రవరి 20, 2018

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ :

రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ఆపండి అని గొడవ. కారణం ఏంటి అంటే అతని రెండో భార్య (ఇషిత - ఈమే హీరోయిన్) కనపడకుండా పోయింది.. అది ఈ మూడో భార్య (ఇంకా పెళ్ళి జరగలేదు.. బహుశా ఒక నెలలో జరగొచ్చు), ఆమె కుటుంబ సభ్యులే కారణం అని అభియోగం. విచిత్రం ఏమిటంటే.. ఆ కనపడకుండా పోయిన అసలు భార్య తల్లి తండ్రులు ఆ వివాహ వేడుకలో అతిధులుగా ఉండడం. ఇప్పటికే కిడ్నాపు, మర్డరు, పిచ్చిపట్టడం, మతిమరుపు వల్ల భార్యని మర్చిపోవడం, లాంటి వివిధ పైత్యాలు చూపడం ఐపోగా.. ఈ పెళ్ళి ముందు దాకా, సదరు హీరోయిన్ గారు మారు వేషం లో పనిమనిషిగా అదే ఇంట్లో భర్త దగ్గర పనిచేస్తూ, ఆఫీసుకెళ్ళి పనిచేసుకోవడం.. లాంటి త్యాగభరితమైన ట్విస్టులు కూడా చాలా జరిగాయి.. ఇదంతా నాకెలా తెలుసు నేను ఫాలో అవుతున్నానా అనుకోకండి.. గత 5-6 నెలలలో అప్పుడప్పుడు ఆ సీరియల్ సమయంలో టీ వీ ముందుకు రావడం వల్లనున్నూ, కధ ఎలాగు 'కొనాసాగుతూ ఉండడంవల్లనున్నూ నాకు కలిగిన కనువిప్పు..  (ఇక్కడ నానోదయం అని రాసా కానీ ఫేసుబుక్కోడు ఇంకా ఒప్పుకోవట్లేదు_ యాపిల్ జనాలను కాపాడ్డానికి - ఈ సీరియల్స్ నుండి మనల్ని ఎవరు కాపాడతారో ) 

ఇషిత..రమణ్ భల్ల..మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే ????




నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శనివారం, డిసెంబర్ 30, 2017

శుక్రవారం, డిసెంబర్ 22, 2017

2ఛీ

అవినీతి జరిగింది కానీ అందరూ నిర్దోషులే .... 2ఛీ







నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

బుధవారం, నవంబర్ 22, 2017

ఆధార్

ఆధార్ - లింకింగే అనుకున్నా, అన్‌లింక్ కూడా చేస్తుందన్నమాట ;)


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, నవంబర్ 17, 2017

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది

ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది

ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ

బాబు ఆన అయ్యిందేమో బావ దరికి నందియే... కదిలొస్తానంది! 



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

గురువారం, అక్టోబర్ 26, 2017

Whatsapp


గ్రూపులు కట్టడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి - వాట్సాప్, ఫేసు బుక్కులు (ఫణిమాధవ్ కస్తూరి)
నా పేరు తీసేసి పోస్ట్/షేర్ చేసిన వారికి 81% జీ ఎస్ టీ తగులుగాక ..


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

LinkWithin

Related Posts with Thumbnails