Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్

 నాల్కల్ కోస్తాం, ముక్కుల్ నేలకి రాస్తాం - హైడ్రామాబాద్ 

ఆహా ఈ రాజకీయ పరిభాష చూస్తుంటే, వింటుంటే అనాలేమో కానీ టీవీల్లో చూపిస్తున్నారు కదా. ఫరవాలేదు. ఎంత బాగుందో. అసలు వీళ్లు కొట్టుకునేదెందుకో అర్ధం కావట్లేదు. తెలంగాణా కోసం దీక్ష చేసిన కేసీ ఆర్ , ఒక పక్క ఒక్కడే చేసినా రాష్ట్రం మొత్త ఏకం చేసారు. మరి సమైక్యాంధ్ర కోసం చేసే దీక్ష తలొకళ్ళు తలా ఒక చోట ఎందుకు చేస్తున్నట్టు ? ప్రస్తుతానికి హైదరాబాదే కదా రాజధాని. ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ కోరుకుంటున్నారే తప్ప. అసలు విషయం అర్ధం కావట్లేదు. ఎక్కడో పుట్టిన వాడు ఏ డిల్లీకో, బాంబేకో, చెన్నై కో వెళ్ళి బతకట్లేదా? ఎక్కడ పని దొరుకుతుందో, సుఖం గా ఉంటుందో, అన్ని సదుపాయాలూ ఉంటాయో అక్కడ బతకాలనుకుంటాడు ప్రతీ మనిషి. బతకడం మొదలెట్టాక శాశ్వత నివాసం కోసం చూస్తాడు , తరువాత ఆస్తులు కూడబెడతాడు. కాలవ గట్టున ఉన్నవాళ్ళని ఖాళీ చేయించినట్టు..ఉన్న పళాన వెళ్ళి పో అంటే ఎక్కడికెళతాడు. ఇక్కడే ఉండనిస్తే రాష్ట్రం వస్తే ఆ రాష్ట్ర వాసి గా ఉంటాడు..లేదా పాత జీవితం కొనసాగిస్తాడు. ప్రభుత్వం తో పోరాడండి. సరైన నిర్ణయం తీసుకోండి..ప్రజలకి మంచి చెయ్యండి. అంతే కానీ మీలో మీరు కొట్టుకుని..ప్రజలను కంఫ్యూజ్ చేసి ..ఏమి జరుగుతున్నదో..అర్ధం కాకుండా..ఎవరో బ్రిటీషు వాళ్లతోనో.పాకిస్తాను వాళ్ళతోనో పోరాడినట్టు మన వాళ్ల మీద మనమే పోరాడడం ఎంత వరకూ సమంజసమో ఆలోచించండి. హోటళ్ళు మూసేసి, పేర్లు మార్చేసి, సినిమాలు ఆపేసి, బస్సులు పగల కొట్టి, ఆత్మాహుతులు చేసుకునీ కాదు..ఎందుకు చేస్తున్నాం, ఏమి సాధిస్తాం, అన్నది ప్రజలకి తెలిసేలా చెప్పండి. టీ వీల్లో చర్చల్లో..మోహన్ బాబు ఇలా అన్నాడు...కే సీ ఆర్ అలా అన్నాడు అని ఒక వ్యక్తి ప్రకటనలు, భావావేశం లో అన్న మాటలూ, గురించి టైం వేస్టు చేసుకుని, వాళ్ళ రేటింగులు పెంచి, వార్తలకో - ప్రకటనలకో సమయం అవగానే అర్ధాంతరంగా ఆగిపోయే చర్చలతో ఎందుకు కొట్టుకుంటారో అర్ధం కావట్లేదు.. విధ్వన్సానికి భయపడో..ఆస్తులు నష్టం అవుతాయనో మూసేస్తున్నారా..లేక నిజంగానే స్వచ్చందం గా మూస్తున్నారా మీరు చేసే బందులకి, ఇంట్లోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది.ప్రతీ ఒక్కరికీ, NIMS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ గా మారుతోంది. హైదరాబాద్ హైడ్రామాబాద్ గా మారుతోంది. సోనియా ఏమంటుందో తేలేదాకా ఇదే పరిస్థితి. ఏమనాలో..ఏమనుకోవాలో..ఏం జరుగనుందో ...అంతా సోనియా దయ.నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మంగళవారం, డిసెంబర్ 15, 2009

జై ఆంధ్రా - జై తెలంగాణా

 జై ఆంధ్రా - జై తెలంగాణా  

బయట జరుగుతున్న వాటిమీద నాకు పెద్దగా అవగాహన లేదు. అక్కడి ప్రజలు పడిన, పడుతున్న బాధలూ తెలీదు. టీ వీ చానెళ్ళలో చూపించేవి చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో...ఎవరిది కరెక్టో ఎవరిది కాదో కూడా అర్ధం కావట్లేదు. నా బాధ ఒకటే..నిన్నటిదాకా పక్క పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు. రాష్ట్రాలుగా కాదు..మనుష్యులుగా.

ఆంధ్ర మెస్ అని ఉంటే చెరిపేసి తెలంగాణా మెస్ అని రాస్తున్నారు..భోజనం మారుతుందా. రుచి మారిపోతుందా. ఆంధ్ర మహిళా సభ అని ఉంటే తెలంగాణా మహిళా సభ అని మారుస్తున్నారు. దేశం కోసం కష్టపడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గా బాఇ దేశ్ ముఖ్ ఆత్మ ఘోషించదా. ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆవిడ పెట్టిన ఓ సేవా సంస్థ అది. ఇప్పుడు విడిపోతే ఆమె పెట్టుకున్న పేరు మార్చెయ్యాలా. ఆంధ్ర అంటే తెలంగాణా కానిదా. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో లేదా.. ఆంధ్ర బ్యాంక్ కూ కొన్ని చోట్ల పేరు మార్చారు. భోగ రాజు పట్టాభి రామయ్య ఎప్పుడో మొదలెట్టిన ఆ అద్భుతాన్ని అవమానపరచాలా. మనం తలెత్తుకు ఎగురేసే జాతీయ జెండా తెలుగు వాడైన పింగళి వెంకయ్య తయారు చేసారు. మరి రేపు అదీ వద్దా..మనం వేరే జెండా తయారు చేసుకుందామా? మన ఎజెండాలో అదీ ఉందా?

ప్రాంతం కోసం జరిగే ఈ సమరం లో కొంచెం సమ్యమనం పాటించి..ఆవేశం తగ్గించి..మనకో పక్క వాళ్ళకో ప్రాణ నష్టం మరే నష్టం కలగ కుండా చూసుకొంటే మంచిది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్టూడెంట్లు అందించే ఆ ఫలం అందుకుని ఆ కుటుంబ సభ్యులు ఆనందించ గలరా..వాళ్ళూ స్వతంత్ర్య పోరాట యోధులు గా మిగిలుతారా? లేక ఈ రాజకీయ నాయకుల పనుల్లో సమిధలుగా మిగులుతారా?

ప్రజల ముందు ఒక మాట..వెనకాల ఒక మాట చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులని నమ్మి అమాయకులైన కుటుంబ సభ్యుల జీవితాలను పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చెయ్యకండి మిత్రులారా..మీదైనా..పక్కవాడిదైనా ప్రాణం విలువ సమానమే..గాంధీ మార్గంలో సాధించండి..విజయీ భవ.

నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa