Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, నవంబర్ 07, 2007

ఒకటికి మూడు ఫ్రీ

పండగ సీజన్ వచ్చింది కదా...మూడు కొంటే ఒకటి ఫ్రీ రోజులు పోయి ఒకటి కొంటే మూడు ఫ్రీ రోజులొచ్చాయి...తెలుగు సినిమాలు కూడా అంతే..ఒకటి కి మూడు ఫ్రీ కాన్సెప్ట్ తో వస్తున్నాయి..కావాలంటే ఈ ధారావాహిక ఫాలో అవండి..

ఫాక్షన్ సినిమాలు..




గ్రా మ సిం హం



హీరో కాశీ లోనో, కేరళ లోనో, కన్యాకుమారి లోనో అంట్లు తోముతూనో, కార్లు కడుగుతూనో, ఉంటాడు..బాగా కడుగుతున్నాడని, యెదురుగా ఉన్న ఒక హీరోయిన్ ప్రేమిస్తుంది...అడుక్కుతింటున్నా హీరో కాబట్టి అమెరికాలో పాటలు పాడుకుని...పెళ్ళి మంటపం దాకా వస్తారు....అప్పుడు 40 టాటా సూమోలు వచ్చి ఆగుతాయి మంటపం ముందు.. అందులోంచి 80 జతల మగ కాళ్ళూ, ఒక జత ఆడ కాళ్ళూ దిగుతాయి.. ఆ పెళ్ళీ ఆపి అతను హోటల్ లో క్లీనర్ కాదని, కడపలో లీడర్ అని చెప్పి అందరినీ కడప రైలు యెక్కిస్తారు..అక్కడ ఈలోపల ఈ పాప తో ఫ్లాష్ బాక్ లో పాటలు, ప్రేమలు.. అయిపోయి.....క్లైమాక్స్ లో కొత్త రకం ఆయుధం పట్టి విలన్లు అందరి పని పట్టి ....చంపడం పాపం నరకడం ఘోరం అన్న సూక్తి తో సినిమా సమాప్తమౌతుంది.....
ఇందులో హీరో గారికి విలన్ ని చంపడానికి కత్తులక్కర్లేదు..కంటి చూపు చాలు....గొడ్డళ్ళక్కర్లేదు--గోళ్ళు చాలు...ఉరి తాడు అక్కర్లేదు....మొలతాడు చాలు.....

మనకి ఆయన చంపక్కర్లేదు--సినిమా చూస్తే మనమే పోతాం....
(మీకు 3 సినిమాలు గుర్తుకు వస్తే బాధ్యత నాది కాదు....చిన్ని క్రిష్నుడిది )

ఇది ఒకటికి మూడు ఫ్రీ లో ప్రధమ భాగం...ఇంకా అనేకం ఉన్నాయి...

ప్రస్తుతానికి

ధన త్రయోదశి..నరక చతుర్దశి.....దీపావళి శుభాకాంక్షలు.....మీ ఫణి మాధవ్...,..

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నమస్తే ఫణి మాధవ్ గారూ
వాస్తవానికి వ్యంగ్యం జోడించి రాస్తున్న ఫ(ణి)న్ కౌంటర్ బాగుంటోంది. సెటైర్ చదవగానే నవ్వు కలిగినా వాటి వెనుక నిజం అలోచింపచేస్తుంది. వెన్నాడుతుంది.
ఈ మధ్య హెదరాబాద్ యఫ్. యం. రేడియోలలో(కొన్ని దుకాణాలు విజయవాడ, వైజాగుల్లో కూడా తెరిచినట్లున్నారు) ఏం'ఖరా'సురులు, ఏం'ఖరా'సురుణిలు తెలుగు భాష ని నాశనం చేసేందుకు అహోరాత్రాలు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. విని , వినిపించి ఫటాయించించి భాషని కుళ్ళబొడుస్తున్నారు. మన యె.బి.కె. ప్రసాద్ గారికి అధికారం ఉంటె తక్షణం ఉరి శిక్ష విధించేవారేమో వీళ్ళకి.

ఈ మధ్య మాగంటి వారి బ్లాగులో చదివింది పేస్ట్ చేస్తున్నా ఇక్కడ


" కొంగర జగ్గయ్య, శ్రీ శ్రీ, నండూరి సుబ్బారావు, బందా కనకలింగేశ్వర రావుగారు, బుచ్చిబాబు, పింగళి లక్ష్మీకాంతం, మంగళంపల్లి బాలమురళి, దేవులపల్లి వారు, గొల్లపూడి ఇంకా ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలవారు అంతా మొదట్లో ఆకాశవాణి లో పనిచేసినవారే.

ఇక ఈ తరం అనౌన్సర్లు - మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు విందామని రేడియో పెట్టుకోగానే, ఒక్క సారి వాంతికొచ్చినంత పని అయ్యింది...అదేదో ఎఫ్.ఎం ఛానెళ్ళ వారు తమ భయంకరమయిన ఉచ్చారణతో - నోరు అంతా మైకులో దూర్చేసి అదేదో కోడి పిల్లో, కుక్కపిల్లో అన్నట్టు - "నేను అల్లరి పిల్ల గౌతమో , భూతమో అని...ఉత్సాహంగా ఉల్లాసంగా" అని ఏదేదో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఖర్మ అండి ఖర్మ....ఏం చేస్తాం?"


కాబట్టి తెలుగు యఫ్.యం రేడియోల భాగో(భూ)తాలని ఎండగట్టమని మనవి.

కృష్ణ

LinkWithin

Related Posts with Thumbnails