tag:blogger.com,1999:blog-4740197530551242641.post2164386131689294974..comments2023-10-31T14:51:12.554+05:30Comments on FunCounter.Com: ఒకటికి మూడు ఫ్రీUnknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-4740197530551242641.post-84131723428112962332007-11-10T01:11:00.000+05:302007-11-10T01:11:00.000+05:30నమస్తే ఫణి మాధవ్ గారూవాస్తవానికి వ్యంగ్యం జోడించి ...నమస్తే ఫణి మాధవ్ గారూ
వాస్తవానికి వ్యంగ్యం జోడించి రాస్తున్న ఫ(ణి)న్ కౌంటర్ బాగుంటోంది. సెటైర్ చదవగానే నవ్వు కలిగినా వాటి వెనుక నిజం అలోచింపచేస్తుంది. వెన్నాడుతుంది.
ఈ మధ్య హెదరాబాద్ యఫ్. యం. రేడియోలలో(కొన్ని దుకాణాలు విజయవాడ, వైజాగుల్లో కూడా తెరిచినట్లున్నారు) ఏం'ఖరా'సురులు, ఏం'ఖరా'సురుణిలు తెలుగు భాష ని నాశనం చేసేందుకు అహోరాత్రాలు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. విని , వినిపించి ఫటాయించించి భాషని కుళ్ళబొడుస్తున్నారు. మన యె.బి.కె. ప్రసాద్ గారికి అధికారం ఉంటె తక్షణం ఉరి శిక్ష విధించేవారేమో వీళ్ళకి.

ఈ మధ్య మాగంటి వారి బ్లాగులో చదివింది పేస్ట్ చేస్తున్నా ఇక్కడ

" కొంగర జగ్గయ్య, శ్రీ శ్రీ, నండూరి సుబ్బారావు, బందా కనకలింగేశ్వర రావుగారు, బుచ్చిబాబు, పింగళి లక్ష్మీకాంతం, మంగళంపల్లి బాలమురళి, దేవులపల్లి వారు, గొల్లపూడి ఇంకా ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలవారు అంతా మొదట్లో ఆకాశవాణి లో పనిచేసినవారే.

ఇక ఈ తరం అనౌన్సర్లు - మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు విందామని రేడియో పెట్టుకోగానే, ఒక్క సారి వాంతికొచ్చినంత పని అయ్యింది...అదేదో ఎఫ్.ఎం ఛానెళ్ళ వారు తమ భయంకరమయిన ఉచ్చారణతో - నోరు అంతా మైకులో దూర్చేసి అదేదో కోడి పిల్లో, కుక్కపిల్లో అన్నట్టు - "నేను అల్లరి పిల్ల గౌతమో , భూతమో అని...ఉత్సాహంగా ఉల్లాసంగా" అని ఏదేదో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఖర్మ అండి ఖర్మ....ఏం చేస్తాం?"

కాబట్టి తెలుగు యఫ్.యం రేడియోల భాగో(భూ)తాలని ఎండగట్టమని మనవి.

కృష్ణAnonymousnoreply@blogger.com