Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, ఆగస్టు 05, 2011

సినీ ఓదార్పు యాత్ర

సినీ ఓదార్పు యాత్ర


ఇదీ ఓ రకం రాజకీయ ఓదార్పు లాటిదే. కాకపోతే ఇక్కడ సినిమా(ఆడక)పోతే, మా సినిమా ఎక్కడికీ పోలేదూ, అభిమానుల గుండెల్లో ఉందీ, జనాలు రాని ధియేటర్లలో ఉంది..ఎలాగైనా రికార్డులు సృషిటిస్తాం సృష్టిసుతున్నాం అంటూ ఓదార్పు సారీ విజయ యాత్రలు సాగిస్తారు(తున్నారు) మన సినీ జనాలు.

రాజకీయాల్లో లాగానే సినిమాల్లోనూ వారసత్వాలే పౌరసత్వాలుగా...అందిపుచ్చేసుకుని..తాత..తండ్రి తరువాత దిగిపోతున్నారు హీరోలు. వాళ్ళకి నటన అలవాటు కాకపోయినా మనం వాళ్ళ నటనకు (ఇది ఫలాన హీరో స్టయిల్) అలవాటుపడీపోతున్నాం ".

హీరో అంటే అన్నిరకాల అవలక్షణాలూ ఉండాలి..ఎంత ఎదవైతే అంత మాసు ... మరి శంకరాభరణం అన్ని క్లాసుల్లోనూ ఆడింది.. ఏదో ఒక ఫార్ములా హిట్టైతే ఇక అదే ఫార్మూలాలు పెట్టేసి సినిమా తీసేసి జనాలమీద తోసేసి ఆడలేక మద్దెల ఓడన్నట్టు..పైరసీనో ఇంకేదోనో అని జనాలమీద పడటం. సినిమా హీరోలో రేట్లు పెంచేయడం..నిర్మాణం కాస్టు పెంచేయడం..తమిళనాడు నించీ డైరెక్టరు, కేరళ నుంచీ స్టోరీ, బాంబేనుంచీ హీరోయిను., విలన్ లని తెచ్చి ... ఏదో ఒకటి తీసేసి..పోనీ అదీ ఏమైనా త్వరగా వస్తుందా అంటే 2 యేళ్ళు, 3 యేళ్ళు...మరి ఖర్చుపెరగక చస్తుందా...ఎలాగూ అభిమానులు మొదటి వారం ఎగబడి చూస్తారు కాబట్టి టికెట్లు రేట్లు పెంచేసి..అటు టిక్కెట్ల కుమ్ములాటలో కాకపోయినా సినిమా చూశాక చొక్కాలు చించేసుకుని.. జుట్లు పీకేసుకుని బయటకు పరుగెత్తుకొచ్చేసి..మళ్ళీ పిచ్చి అభిమానంతో రెండో సారో ...మూడో సారో ఐనా అర్ధమౌతందునుకుని మళ్ళీ మళ్ళీ చూసే  అమాయకులుంటారు కాబట్టి .....తీసేయడం....ఇక అది ఆడదని ఒకటో ఆటకే తెలిసిపోతుంది కాబట్టి ఆరోజు మధ్యాన్నం నుంచే న్యూసు చానెల్సు..ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ అని తేడాలేకుండా గంటకో ఇంటర్వ్యూ...రోజుకో చర్చ...వారోనికో కాంటెస్టూ రన్ చేసి..ఇవీ చాలదన్నట్టు యూనిట్ మొత్తం పొలో మని బస్సు యాత్రలు..ధియేటర్లకి..కనీసం వాళ్లని చూడడానికైనా వస్తారని.

ఇక రోజూ గోడల మీద చూస్తే.. ఎవరో పోయినోళ్ళ పేపర్ అడ్వర్టైజ్ మెంటులాగా ఒకటో "రోజు  " పదో 'రోజు " 13వ 'రోజు " అంటూ పోస్టర్లు.. వాటికి బొట్లు దండలూ బోనస్.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ..సినిమా పోయాక జనాలని పట్టుకునే ప్రయత్నం కన్నా..హీరోలని గాల్లోంచి భూమి దింపిన కధలు..జనాల కు దగ్గరగ ఉండే సినిమాలైతే  చూస్తారేమో




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

కామెంట్‌లు లేవు:

LinkWithin

Related Posts with Thumbnails