ని(ల్)ర్మాత
వెనకటికి, ఎన్ టీ ఆర్ సినిమాల్లో చేసేటప్పుడు..వాళ్ళమ్మాయికి చెప్పులు కొనడానికి లంచ్ బ్రేక్ లో వెళ్ళి రావడానికి కూడా నిర్మాత పర్మిషన్ తీసుకుని..భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళి కొనుక్కొచ్చారట...
ఈమధ్య ఆసిన్ కోసం ఒక నిర్మాత చెప్పులకి మూడు లక్షలు పోసి కొన్నాడట...ఆసినీ సోద్యం బంగారం కానూ అనుకున్నా.. ఆ మధ్య ఐస్వర్యా రాయి కీ ఒక నిర్మాత 10 లక్షలు పోసి కళ్ళ జోడు కొనాల్సి వచ్చిందట..సినిమా కోసం..ఈ మధ్య నిర్మాత అంటే పొలాలమ్మి డబ్బు తెచ్చి హీరో హీరోయిన్ లకి కళ్ళ జోళ్ల నించీ కాలి జోళ్ళ వరకూ....కొని అవసరమున్నా లేకున్నా ఫారిన్ లొకేషన్లకి తిప్పి...తరువాత ప్రింట్లకి డబ్బుల్లేక తిప్పలు పడేవాడు గా కనిపితోంది యవ్వారం...
ఈ మధ్య చిన్న నిర్మాతలు పాపం చాలా ప్రాబ్లెంస్ ఫేస్ చేస్తున్నారని రోజూ చూస్తున్నాం..ఇన్నాళ్ళూ ప్రొద్యూసర్ అంటే అబ్బో సినిమాల్లో చాలా మిగిల్చుకుంటాడు అనుకున్నా..
సినిమా కి ప్రొద్యూసర్ అవడం అంత వీజీ కాదు అన్నమాట..సినిమా మొదలెడదాము అనుకోగానే ఒక ఆఫీసు తియ్యాలి అదీ ఫిల్ము నగరులోనే ఉండాలి..దానికి ఒక గుమాస్తా..అకౌంటంటు..ప్రొడక్షన్ మేనేజరు..అటెండరు..రోజూ మందు..విందు అన్నీ తప్పని రోజూ వారి ఖర్చు..ఇక దర్శకుణ్ణి అనుకోగానే ఆయనా, ఆయన సిబ్బంది కూడా తోడవుతారు..ఇక కధలు చెప్పడానికి డైరెక్టరుగారి మంద,,ఇంకా కొంత మంది కొత్త ఔత్సాహిక రచయితలు..గట్రా వచ్చిపోతూ ఉంటారు..కధ ఒక కొలిక్కి రాగానే ఏ హీరోకి బాగుంటుందో అనుకుని వారిని కలవడానికి తిరగడానికి, సిఫారసు చెయ్యించుకోవడానికి వారి బంధువులో..ఫ్రెండ్సో, పాత చిత్ర దర్శకులో ..లేక ఆయన గారి ఆస్థాన జ్యోతిష్కుడినో పట్టుకొని కధ వినిపిస్తే ఆయన గారి పైత్యం కూడా కొంచెం తోడయి మొత్తానికి ప్రాజెక్టు రెడీ అవుతుంది..
ఇక హీరోగారితో అంతకు ముందు చేసిన జీరోయిన్ గారిదో కొత్తగా బాలివుడ్డు నుంచి వచ్చిన మరో చెక్క బొమ్మదో (చక్కని బొమ్మ అని వాళ్ల ఫీలింగు) డేటు దొరికి రేటు ఫిక్ష్ అవడానికి కొంత ...ఇక మ్యూసిక్ చెయ్యడానికి ఇట్టే కాపీ కొట్టి హిట్ కొట్టెయ్యగల మ్యూసిక్ డైరెక్టరు..మోకాళ్ళు వంగిపొయ్యినట్టు డాన్సు చేయించే డాన్సు మాస్టరు వంటి హీరోగారి హిట్ కాంబినేషన్ కం సెంటిమెంట్ కం సెటిలెమెంట్ మంద కొందరు వెరసి టీం రెడీ...
ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక పెద్ద స్టూడియోలో పెద్ద సెటప్పు,.,దానికి సినిమాలు లేని అగ్ర దర్శకులు క్లాపు, స్విచాను..గౌరవ దర్శకత్వం...పనిలేని మరో కొంత మంది అనుకోని అతిధుల తో హడావిడి...ఆ తర్వాత షరా మామూలుగా రొటీనుకి భిన్నం గా మా సినిమా ఉంటుంది అని రొటీన్ గా ఊక దంపుడు ఉపన్యాసాలు...
అసలు షూటింగు మొదలయ్యాక అడుక్కుతినేదో ఆటో నడుపుకునేదో క్యారెక్టరు చేస్తున్న హీరోగారు...అమెరికాలో ఇంట్రడక్షను సాంగు...కొంత మంది సహాయకుల తో సహా పయనం..
జీరోయిన్ గారు బాంబే నుంచీ రావడానికి మధ్యలో వెళ్ళిరావడానికి..వారి అమ్మగారికి..మేనేజర్ గారికి..తెలుగు నేర్పే గురువు గారికి ఇలా వారి ఖర్చు వారిది..ఇక కాల్షీట్ ఇచ్చి టైముకి రాని కమెడియన్లు..ఇంప్రువైసేషన్ పేరుతో టేకులు తినే తిర్టీ యేర్స్ ఇండుస్ట్రీ మేధావులు..మొత్తనికి సినిమా దాదాపు పూర్తయ్యే టైము... ఈ లోగా ఆడియో రిలీజు అంటూ మళ్ళీ కొత్త ఫిట్టింగు మళ్ళీ ఒక పెద్ద సెట్టింగు..టీ వీలో యాంఖరు గారి నేత్రుత్వంలో ఒక ఫంక్షను..అందులో కామెడీ పేరుతో హింస..తరువాత..సినిమా పెద్దల సమక్షంలో సీడీలు విడుదల...మ్యూసిక్ అదిరింది..చిరిగింది..రికార్డు విరిగింది అంటూ ఒకరినొకరు పొగుడుకున్నాక..తలో సీడీ ఇచ్చి పంపుతారు..
ఇక సినిమా విడుదల హీరోగారి ఇమేజిని బట్టి అంతకు ముందు సినిమా వీర ఫ్లాపు కాబట్టి ఒకే సారి 200 ప్రింట్లతో విడుదల కనీసం ఒక్క రోజు ఆడినా 200 రోజుల ఫంక్షన్ చేసుకునే అభిమానుల కోసం...(ఎందుకంటే మొదటి రోజు చొక్కాలు చించుకుని టికెట్ సంపాదించి చూసిన అభిమాని ఆ తరువాత తెరని చించడానికి సిద్ధంగా వుంటాడు కాబట్టి)
ఎలాగూ సినిమా ఆడదు కాబట్టి టీవీల్లో ఊదరగొట్టే కార్యక్రామాలు..లైవులు...తరువాత సక్సెస్ టూర్లు..టికెట్ కొన్న వారికి సినిమా చూసి ఆరోగ్యంగా బయటకి వచ్చిన వాళ్ళకి బంగారు గొలుసు బహుమానాలు లాంటివి చేసీ చేసీ పాపం నిర్మాత సినిమా అయ్యేసరికి నిల్ మాత (చివరకు ఏమి మిగలని అమ్మ )గా మిగిలిపోతున్నాడు
నిజా నిజాలేంటొఈ తెలీక పోయినా ఇంతకాలం మనల్ని నవ్వించిన బాబూ మోహన్ నిర్మాత గా మారి నష్టపోయానంటూ బాధ పడడం, చిన్న నిర్మాతలు నిరాహార దీక్ష చెయ్యడం చూసి బాధతో...వారికి మంచి జరగాలని ఆసిస్తూ...
1 కామెంట్:
చిన్న నిర్మాతలు కష్టాలు పడుతున్నది కాదనలేని నిజం, కాని ఎంతమంది నిర్మాతలు మంచి సినిమాలు తీస్తున్నారు? రియల్ ఎస్టేట్ లొ డబ్బులు సంపాదించేసి సినిమా గురించి ఏ అవగాహనా లేకుండా సినిమా తీద్దామని వచ్చేసే నిర్మాతలు వున్నంతవరకు ఈ పరిస్థితే
కామెంట్‌ను పోస్ట్ చేయండి