Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, డిసెంబర్ 06, 2008

సినిమా(య) లోకం

సినిమా(య) లోకం


చాలా సంతోషం అనిపించింది..నాకు వచ్చిన కామెంట్స్ చూసాక..బాలివుడ్ తోనో హాలివుడ్ తోనో పోలిస్తే కొంచెం నయమే అయినా..ఆ విషయానికి సంత్రుప్తి పడడం తప్ప మరొకటి కాదు..

అత్యధిక సినిమాలు నిర్మించే విషయంలో పడే పోటీ అర్థవంతమైన సినిమాలు నిర్మించడంలో ఉండదు..యేడాదికి 200 పైగా సినిమాలు నిర్మించే మన రాష్ట్రం నుంచీ ఇంతవరకూ జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డు సినిమాలు వచ్చాయి..?

సినిమా వ్యాపారం అనే వాళ్ళూ ఉన్నారు..నేనూ ఆ మాట ఒప్పుకుంటా..కానీ ప్రతీ వ్యాపారానికీ కొన్ని కట్టుబాట్లుంటాయి..ఉదాహరణకి ఫుడ్ కి సంబంధించిన వ్యాపారం అయితే ప్రజల ప్రాణానికి హాని కలిగించని విధంగా తయారుచేయాలి..ఎక్ష్పైరీ డేట్ లాటివి వేస్తారు...కల్లు లో డైజపాం కలిపి కల్తీ చేసినట్టు మనవాళ్ళు సినిమల్లో ఏవో కలిపి కల్తీ చేసి ఆ మత్తుకి యువతని అలవాటు చేస్తున్నారు...తమ వ్యాపారానికి వేరే వాళ్ళని బలి చెయ్యడం ఎంతవరకు సమంజసం...

ఎంతసేపూ పెద్ద హీరోల ఇమేజ్ తగ్గ కూడదు అంటూ అర్ధం లేకుండా విలన్లని స్రుష్టించి..వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి హీరోలు కత్తి పట్టి చంపడాలు,,,పిల్లల పెళ్ళిళ్ళు చేసిన హీరోలకు పదహారేళ్ల పడుచు హీరోయిన్లు.....ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా సంభాషణలు...పిచ్చి పుట్టేలా వెకిలి గంతులు...చివర్లో శ్రీరంగ నీతులు..,,,తప్ప మరో విధం గా అలోచించలేరు...అటు అభిమానులు..ఇటు దర్శక నిర్మాతలు..

మళయాలం నుంచీ తమిళం నుంచీ కధలు...కధానాయకలని అరువుతెచ్చుకుంటున్నప్పుడు..మరి అక్కడి హీరోల లా వయసుకు తగ్గ పాత్రలు..ప్రయోగాత్మక సినిమాలు ఎందుకు చెయ్యరో అర్ధం కాదు...ప్రయోగం అనగానే చీకట్లో ...అడవుల్లో,,భయపెట్టే విధంగా తప్ప ఆలోచించలేరు...

సినిమా అనేది ఒక బలమైన వినోద సాధనం..ప్రజలని ముఖ్యంగా యువతని ప్రభావితం చేసే ఈ మాధ్యమానికి చెందిన వారికి..దాని వల్ల సంపాదిస్తున్న వారికి సమాజం పట్ల బాధ్యత కూడా వుండాలి..రేపటి జెనరేషన్లో వాళ్ళ పిల్లలు కూడా వున్నారని గుర్తించాలి..అప్పుడైనా కొంచెం మంచి సినిమాలొస్తాయని ఆశ.....

2 వ్యాఖ్యలు:

నాగప్రసాద్ చెప్పారు...

ఒక సినిమాకి 40-50 కోట్లు లాభం వస్తుందంటే కారణం ఎవరో ఒకసారి ఆలోచించారా. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తేనే అన్నేసి కోట్లు లాభం వస్తుంది. మరి అన్ని కోట్లు లాభం వస్తుంటే ఎవ్వరూ వదులుకోరని నా అభిప్రాయం.

ఒకవేళ సినిమాని కళగా తీసుకున్నా, ఏ కళాకారుడికైనా కావలసింది తన కళ ని ఆదరించడమే. ఏ కళ కైతే ఎక్కువ ఆధరణ వుంటుందో దాదాపు చాలా మంది అదే కళ ను ప్రదర్శిస్తారు. ఏ కళ కైతే అంతగా ఆధరణ వుండదో, ఆ కళకి ఆధరణ లభించే చోటికి వలస పోవడం చేస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతుంది ఇదే.

అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి కదా, వాటిని ప్రజలు ఆధరిస్తున్నారు కదా అని మీరు అడగవచ్చు. కాని మాస్ సినిమాలకు వచ్చినంత లాభం ఈ క్లాస్ సినిమాలకు రావని అందరికి తెలిసిందే. క్లాస్ సినిమాలను కేవలం చదువుకున్న వాళ్ళు చూస్తారు. అదే మాస్ సినిమాలైతే అందరూ చూస్తారు. థియేటర్ కి వెళ్ళి ఎక్కువగా చూసేది మాస్ జనాలే కాబట్టి, దర్శక నిర్మాతలు ఎక్కువగా వారినే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే, నాకు తెలిసిన ఒక బెంగాలీ మిత్రుడు ఇలా చెప్పాడు. వాళ్ళ భాషలో సినిమాలు తనకు అంతగా నచ్చవని, మరి జాతీయ అవార్డులు వస్తుంటాయి కదా అని అడిగితే, వాళ్ళ భాషలో సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు కేవలం అవార్డుల కోసమే తీస్తారని చెప్పాడు.

ఇక నేను రెండు మళయాలం సినిమాలు ( మమ్ముట్టి హీరోగా ఒకటి, మోహన్ లాల్ హీరోగా ఒకటి) చూశాను. అవి నాకు అస్సలు నచ్చలేదు. అటువంటి సినిమాలు మనవాళ్ళు ఖచ్చితంగా చూడరు.

శృంగారం, హింస వున్నా కూడా మనవాళ్ళు హాస్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.

నా విషయానికొస్తే, ఎంత చెత్త సినిమా అయినా సరే, "అల్లరి నరేష్" నటించిన ప్రతి సినిమాను చూస్తాను. :))).

నాగప్రసాద్ చెప్పారు...

మీ బ్లాగు open కావడానికి చాలా టైము తీసుకుంటుందండి. దయచేసి క్రింది వాటిని తొలగించండి.
1.Snap Shots, 2.కలిసొచ్చే కాలం, 3. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.

ఇంకా కొన్ని వున్నాయి. ప్రస్తుతం మీకు వీలైతే వీటిని తొలగించండి. తర్వాత పేజి లోడ్ అయ్యేదానిని బట్టి మిగతావి తొలగించాలో వద్దో చెప్తాను.

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa