Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

మంగళవారం, డిసెంబర్ 16, 2008

న్యూసెన్స్ చానెల్స్ - చూస్తూనే ఉండండి మాకిష్టమొచ్చింది చూపిస్తాం

న్యూసెన్స్ చానెల్స్
చూస్తూనే ఉండండి మాకిష్టమొచ్చింది చూపిస్తాం
న్యూస్ పేరుతో న్యూసెన్స్ అందిస్తున్న చానెల్స్ ని చూస్తుంటే రోత పుడుతోంది..ఒక పక్క పక్షపాత ధోరణితో రాజకీయాల విషయాలలో ఎలాగూ నిజాలు చెప్పట్లేదు..జరిగే దారుణాలు..ఇతర విషయాలు కూడా పక్క దారి పట్టిస్తే ఎలా?
పక్క చానెల్ కన్నా మనమే ముందు చెప్పాలని...వాళ్లకి ఏది తోస్తే అది చెప్పేస్తారు..చూపిస్తారు..అది ప్రజలని తప్పుదోవ పట్టించినా వాళ్ళకి అనవసరం ఎందుకంటే అది వాళ్ళ టీ ఆర్ పీ ని పెంచుతాయి కాబట్టి..
ఈ మధ్య బాంబే ఘాతుకాన్ని ప్రసారం చెయ్యడం వల్ల లోపల తీవ్రవాదులకి కూడా తెలిసి ఎంత నష్టం వాటిల్లిందో చూసాం కదా.. ఆ మధ్య హైదరాబాద్ లో పంజాగుట్ట వద్ద ఫ్లై ఓవర్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా అంతే మొత్తం ఫ్లై ఓవర్ కూలిపోయిందని..దానికింద వందలాదిమంది వర్షం తల దాచుకున్నవాళ్ళు, చాలా వాహనాలు ఇరుక్కున్నారనీ ఒకటే హడావిడి చేసారు..ఇళ్ళలో వున్న వాళ్ళకి తమ వాళ్ళు రోజూ అక్కడినించే కదా వచ్చేదని ఎంతమంది ఎంత టెన్షన్ అనుభవించారో నాకూ స్వీయ అనుభవమే...ప్రమాదంలో ఇరుక్కున్న వాళ్ళని రక్షించడానికి వచ్చిన వాళ్ళకి..వీళ్ళు అడ్డేఅ..అసలెలా జరిగింది..కారణాలేంటి..ఎవరు బాధ్యులు అంటూ సర్వే ఒకటి మొదలెడతారు..దీనికి ప్రభుత్వం ఎలా స్పందించాలి అంటూ ఎస్ ఎం ఎస్ కాంటెస్ట్ ఒకటి మొదలెడతారు..వాళ్ళు అక్కడ తీసుకోవాల్సిన చర్యలకి అడ్డం రావడమే కాకుండా మీడియా పై దౌర్జన్యం చేసిన అధికారులు అంటూ మరో కధనం ...
ఇవన్ని ఎందుకు చెబుతున్నానంటే..పాపం ఇప్పుడిప్పుడే హీరోయిన్ అవుతున్న భార్గవి అనే అమ్మాయి అనుమాస్పద స్థితి లో మరణించింది..ఇది హత్యా...ఆత్మ హత్యా? ఎవరు చేసారు..అక్కడ జనం గుమిగూడారు అంటూ స్క్రోలింగులు..ఆ అమ్మాయికి నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది ..ఒక బాబు ఉన్నాడు అని మరో స్క్రోలింగు..ఈ లోగ వార్తలు చదివే మనిషి ఆమె ఆత్మ హత్యకు పాల్పడింది అని చెబుతూ సదరు సంఘటనా స్థలంలో ఉన్న మరో రిపోర్టర్ని అడిగితే ఆయన ఇక్కడ ఆ అమ్మాయి మరో వ్యక్తితో బెడ్ పైన పడి వుంది..అతను ఆమె కాబోయే భర్త అని చెప్పాడు..ఈలోగా..వాళ్ళ అమ్మా వాళ్ళని మాట్లాడిస్తే (పాపం వాళ్ళు ఏడిచే టైము కూడా ఇవ్వకుండా, )అసలు మా అమ్మాయికి పెళ్ళే కాలేదు..అతను మాకు తెలిసిన అబ్బాయి మాత్రమే అని వాళ్ళ సమాధానం..ఈ మధ్యే ఒక మంచి క్యారెక్టర్ పోషించిన అమ్మాయి కదాని చూస్తున్న వాళ్ళకి అసలు ఏమీ అర్ధం కాలేదు..అసలు పోలీసులు, డాక్టర్లు కూడా ఇంకా ఏమీ చెప్పకుండానే..తల్లి దండ్రులు..కూడా రెస్పాండ్ కాకుండానే వీళ్ళ హడావిడి ఏమిటో..
యాసిడ్ దాడికి గురైన వాళ్ల సంగతీ అంతే..అందరికన్నా ముందు మాతో మాట్లాడినప్పుడు అంటూ కధనాలు..దానికి ఒక హీరో..వారి జీవిత భాగస్వామితో చర్చ..ఆ సదరు హీరో గారు నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కాదంటే చంపేద్దామనుకున్నా...కానీ ఆగిపోయా అంటూ విచిత్రంగా చెప్పడం...ఎందుకు ఇలాంటివన్నీ//రామోజీ రావ్ సుమన్ గొడవపడితే ఉండవల్లితో చర్చ...అసలు సంబంధం ఉందా అని?
ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి న్యూస్ చానెల్స్ లో మెమే నంబర్ వన్ అనిపించుకోవడం ఎంతవరకు సమంజసమో ?

5 వ్యాఖ్యలు:

సతీష్ జి కుమార్ చెప్పారు...

chala baaga chepparandi. Nijanga ee media ne vunna daani kante ekkuvaga create chesi andari feelings tho adukuntunnaru.....

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు. మన మెదళ్ళు తెలుగులో వచ్చె వార్తా చానెల్స్ చూసి చూసి సగం బూజు పట్టే సాయి. అసలు మనకు దూరదర్శన్ లో 15 నిమిషాలు వచ్చే వార్తలు చాలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

అదుర్స్ బెదరూ

అజ్ఞాత చెప్పారు...

phani nee google dabbula box naku kanipinchaledu click cheyyataniki velte akkada tellaga vundi emi ledu

అజ్ఞాత చెప్పారు...

phani nee google dabbula box naku kanipinchaledu click cheyyataniki velte akkada tellaga vundi emi ledu

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa