ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రియేటివిటీ

మేము కలిసి ఉంటున్నాం (లివ్ ఇన్ రిలేషన్ షిప్) - ఆ అమ్మాయి టీ బాగా పెడుతుంది, పంచదార ఎంత వెయ్యాలో తెలుసు పైగా ఏ టీ పొడి వాడాలో తెలుసు - మమకారం కలిపిన టీ.......ఒక టీ పొడి యాడ్

స్ప్రే కొట్టుకుంటే అమ్మాయిలు పనులు ఒదిలేసి మరీ అబ్బాయిల వెంట పడతారు పైగా అస్సలు ఆగలేరు - ఒక డియో స్ప్రే యాడ్

కూతురు గదిలో ఒక అబ్బాయి తలుపు వెనకాల దాక్కుంటే... ఫోన్ మోగినప్పుడు చూసిన తండ్రి - ఫోన్ చూసి ముచ్చట పడతాదు. ఫోన్ రేట్ కేవలం 4444 అని తెలుసుకుని ఆనంద పడతాడు..అంటే కూతురు లైఫ్ కనీసం 4444 వేల్యూ కూడా కాదనేమో.............. ఒక సెల్ ఫోన్ యాడ్

ఇంక డ్యూ తాగి కొండల మీదనుంచి దూకడం
థంస్ అప్ తాగడానికి హెలికాప్టర్ తో దిగడం లాంటి పైత్యాలూ మామూలే కానీ ఈ క్రియేటివిటీ ఎక్కడికెళుతోందో... మరి...నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!