ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జీను లేని గుర్రాల మధ్య జీన్స్ పాంట్ వేసుకుని పరిగెత్తే కుర్రాడి కధ !

జీను లేని గుర్రాల మధ్య జీన్స్ పాంట్ వేసుకుని పరిగెత్తే కుర్రాడి కధ !

 హీరో ఎంత బేవార్సైతే అంత గొప్ప అని చాటే మరో చిత్రం. పోలీసైన అన్నని లెక్క చెయ్యం, 500 కోట్లకు ఓనరైన హీరోయిన్ తండ్రిని ఎదవని చేస్తాం.. చివరకి కాన్సర్ గురించి చేసిన ఓ ప్రకటనలో ఉన్న చనిపోతూ కాన్సర్ కారణం గుట్కా అని చెప్పే మహేష్ కారెక్టర్ ని కూడా కామెడీ చేసేదాక వదలం. ఎక్కడో ఒక చిన్న సాయం చేసి ..అది కూడా అన్నయ్య కి తెలీకుండా తండ్రి వీసా కోసం ఇచ్చిన పైసలు దానం చేసి.. హీరోయిజం...సంపాదించేస్తాం. అదేంటో చిన్న చిన్న దానికి కూడా ఖూనీలు చేసేలా చూపించే విలన్ లు హీరోని మాత్రం అస్సలు ముట్టుకోరు.. లాస్ట్ దాకా యెదవలైపోవడమే.. ప్రతీ సినిమాలో సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చి బక్రా అయే బ్రహ్మీ కామన్.. దీనికి తోడు.. పాటేదో..అందులో మాటేదో కూడా అర్ధం కాని మ్యూజిక్కు, రణ గొణ ద్వనుల తో బాక్ గ్రౌండ్ రోరింగ్..


ఏంటో నాకీ మధ్య సినిమాలు ఎంజాయ్ చెయ్యడం రావట్లేదు... ఇంక అభిమానులు తిట్టిపొయ్యడానికి రెడీ.. రండి బాబు రండి.. మరో సారి సినిమా చూసి మరీ రండి..నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

వ్యాఖ్యలు

Subhadra Vedula చెప్పారు…
చాలా బాగా రాశారు. హాల్లో అందరూ విరగబడి చూస్తూ ఉంటే మాకు మాత్రం నచ్చటం లేదేమిటా అని సందేహం వచ్చింది, మీరు రాసినది చూస్తే "పరవాలేదు, మనలాంటి వారు ఇంకా ఉన్నారు" అని ధైర్యం వచ్చింది.
స్వర్ణమల్లిక చెప్పారు…
Intaki em movie gurinchi ee briview.. (brief review)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!