Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, మార్చి 31, 2014

జయనామ సంవత్సర రాశి ఫలితాలు :

జయనామ సంవత్సర రాశి ఫలితాలు :
12 రాశులున్నా.. ప్రస్తుతానికి ఇంతటితో సరిపెడుతున్నా..
కేవలం ప్రస్తుత పరిస్థితుల మీద ఓ వ్యంగ్య రచనే.. కానీ సంప్రదాయ పంచాంగ పఠనం/శ్రవణం మీద గౌరవం లేక కాదు. సరదాకి నవ్వుకోవడానికి..

మేష రాశి..
రాజ పూజ్యం : ఎన్నికల ముందు... అవమానం : ఎన్నుకున్నాక
ఆదాయం : బిరియానీ,సారా పాకెట్టు,వంద నోటు వ్యయం : ఐదేళ్ళ భవిష్యత్తు
అంటే పొట్టేలు/మేక .. సాధారణంగా ఓటర్లు ఈ రాశికి చెందిన వారౌతారు. గంభీరంగా కనపడతారు. ఎలక్షన్ టైం లో కొమ్ములు కూడా కనిపిస్తాయి.కానీ ముందు వాడో పక్కవాడినో చూసి గుంపుగా గుడ్డిగా ఫాలో ఐ.. ఫూల్ అవుతుంటారు. ఎవరు సాయం చేద్దామనుకున్నా..మంచి చేద్దామనుకున్నా.. కసాయి వారినే నమ్మి బలౌతుంటారు..
వృషభ రాశి :
రాజపూజ్యం : అక్కర్లేదు                అవమానం :లెక్క చేయరు
ఆదాయం : దొరికినంత                   వ్యయం :
దున్నపోతు అని కూడా అనొచ్చు. దాదాపుగా ముదిరిన రాజకీయనాయకుల రాశి. మీద ఏం పడ్డా చలించరు.. తీరిగ్గా దొర్కింది మేసేసి.. నెమరు వేస్తూ ఉంటారు. లోకులు అరిచినా..కాకులు వాలినా..జోకులు పేలినా తోకతో కూడా అదిలించరు.. ఆవులించరు. చర్మం మందం..  ఏమన్నా పట్టించుకోరు కాబట్టి ఎక్కడున్నా ఒకటే..


కర్కాటకం :
రాజ పూజ్యం :                              అవమానం :  
ఆదాయం :                                   వ్యయం :                      
దీనినే కాన్సర్ అని కూడా అంటారు. కాన్సర్ లాగానే పట్టుకుంటే రూపీ థెరపీలు.. మందులు.. అవసరం. సాధారణంగా దళారులు ఈ రాశి వారుంటారు.


మకరం :
మకర రాశి.. మొసలి లాంటి వాళ్లు. పట్టుకుంటే వదలరు. పదవిలో ఉన్నప్పుడు బలవంతులు. పదవి వదిలితే బలహీనులు. మొండితనం,మూర్ఖత్వం వీరి సొంతం..

సిమ్హం :
రాజ పూజ్యం : సినిమా తెర                అవమానం :  రాజకీయ వేదిక
ఆదాయం :  కోట్లు                           వ్యయం :  అభిమానుల ప్రేమ                    
సాధారణంగా సినీ హీరోలు ఈరాశి వారు. సినిమాల్లో తాము సిమ్హం పై చెప్పిన డైలాగులు నిజమనే భ్రమలో ఉంటారు. వీలైనంత వరకు..సిమ్హం లాగా ఉండడానికి ప్రయత్నిస్తూ... గాండ్రిస్తూ... గంభీరం ఒలకబోస్తూ.. అరుస్తూ ఉంటారు.. జూలు విదిలిస్తూ ఉంటారు.. జూలో పెడితే వినోదం అందిస్తారు..


ధనస్సు :
ఇది మీడియా రాశి. ఎవరిమీదైనా ఎక్కుపెట్టి ప్రశ్న బాణాలు వేస్తారు. తగిలినా తగలకపోయిన పోయేదేమీ లేదు.

మీనం :
వీళ్ళు పదవున్నా లేకున్నా పని చేసుకుపోయే సీనియర్ కార్యకర్తలు..నీళ్ళు వదిలితే ఉండలేని చేపల్లా..పార్టీలని వీడి రాలేరు..అక్కడక్కడే తిరుగుతూ. దొరికింది తింటూ.. గుంపుగా..గుంభనగా బతికేస్తారు.
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa