Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శుక్రవారం, జనవరి 27, 2012

టైం
టైం
సోమ మంగళ బుధ ...వారానికి 7 రోజులు..రోజుకి 24 గంటలు
ఐనా మనకి టైం లేదు..

మొగుళ్ళకి..మొగోళ్ళకి :

లేటుగా లేచి..
పరిగెడుతూ బ్రేక్ "ఫాస్టు " చేసి
బ్రేకెయ్యకుండా ఫాస్టుగా డ్రైవ్ చేసి
కరెంటులేని ఆఫీసు లిఫ్ట్ ని తిట్టుకుంటూ
బాస్ ఇచ్చే వార్నింగులు తలుచుకుంటూ
ఆఫీసు చేరి..
మళ్ళీ ట్రాఫిక్కులు దాటుకుంటూ
పాలిటిక్సు మాట్లాడుకుంటూ
ఇల్లు చేరినా సెల్లు వదలక
బరువు పెరిగి వళ్ళు కదలక
ఇంటికాడా ఇంటర్ నెట్టు
ఆఫీసు పనితో ల్యాపుటాపు

పెళ్ళాం కట్టిన చీరని..తెల్ల  చీర కట్టిన పెళ్ళాం పెట్టిన చారుని
చూసే..రుచి చూసే టైం లేదు..

ఆడోళ్ళు : 

తెల్లారే లేచి - పనిమనిషి తో పేచీ
సంపులో నీళ్ళు పంపులో వచ్చేదాక ఎదురుచూపు
క్యారేజీలు-కాపీ తిఫినీల హడావిడిలో మాడిపొయే పోపు
సబ్బు తువ్వాల ఇచ్చిన 'లోపలి ' దేదో బయట మర్చిపోయే పతిదేవునికి సపర్యలు
కాఫీ పంచదారకొచ్చిన పొరుగింటి పుల్లమ్మ తో చిట్టీపాట చర్చలు

బాక్సులు-బజార్లు-పచారి సామాన్లు-జరీ డిజైన్లు
టీవీలు - సీరియళ్ళు - బాధలు - ఏడుపులు
పట్టుకుంటే పట్టుచీరలు - లక్కీ చాన్సులు - బంపర్ భాగ్యలక్ష్మిలు
తిన్నవి కడుక్కోడాలు- మిగిలినవి ఫ్రిజ్జిలో కుక్కడాలు
ఆఫీసు నుంచొచ్చిన మొగుడి కన్నా - ఇనుపరేకుల సీరియల్ మిన్న

టైం లేదు..

పిల్లలు :

క్రచ్చులు - ప్రి నర్సరి - నర్సరి - ప్లే స్కూలు- హై స్కూలు - కాన్సెప్టు స్కూలు - టేక్నో సారు - హైటెక్ స్కూలు - పేరేదైనా - వయసెంతైనా - రెండో యేడు నుంచే  కంప్యూటర్ విజ్ఞానం  కోచింగు - స్లిప్పు టెస్టులు - ఎసైన్మెంటులు - యూనిట్ టెస్టులు - డైలీ టెస్టులు - ఉన్న బ్రైన్ మంచింగు

సైకిళ్ళు - స్కేటింగులు - చాటింగులు - వీడియో గేములు - సెల్ ఫోన్ థీములు
హోం వర్కు కు - కార్టూన్ నెట్ వర్కుకు పోటీలు
హాలిడేసంటే - పరీక్షకి - పరీక్షకి మధ్య వచ్చే గ్యాప్ గా మారిపోయి

ఇంట్లో ఉన్న నానమ్మ తాతయ్య తో మాట్లాడడానికి - ఊళ్ళో ఉన్న అమ్మమ్మ - తాతయ్యల ఊరెళ్ళడానికి అస్సలు టైం లేదు..

మనెవరికీ మనుష్యుల్లా బతకడానికి టైం లేదు..
చచ్చాక కూడా కండోలెన్సు మెసేజులతో బతికేస్తున్నాం కదా..
అలవాటైపోద్ది..

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa