ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రకత చరితర...

రకత చరితర...

మనం పుట్టించకపోతే పదాలెలా పుడతాయి...ఆర్ జీ వీ సినిమా తీయకపోతే మనమేం మాట్లాడుకుంటాము. మామూలు మనుష్యులకొచ్చే ఆలోచనలు ఆయనకి రావనుకుంటా. దేవుడంటే నమ్మకం లేదు(ట). దెయ్యాలుంటాయో లేదో తెలీదు(ట). ఇలా చాలా ఉన్నాయి. శివ సినిమాతో ఇండస్ట్రీలోకొచ్చి ...కాల క్రమేణా కొన్ని సినిమాలు తీసి..కొండపై స్వామి వారి కిరీటం కొట్టేసే లెవల్లో అద్భుతమైన సినిమాలు తీసి..అందులో దేవుడున్నాడు అని చెప్పాడో లేదని చెప్పాడో అర్ధం కాలేదు.సడెన్ గా చక్రం అదీ వస్తుంది..మరి.. ఎవరి మీదో అలిగి..తెలుగు సినిమాకు దూరమైనాడు..

తరువాత ఫాక్టరీ ఒకటి పెట్టాడు.. కానీ అందులోంచి పొల్యూషను..వ్యర్ధ పదార్ధాలే ఎక్కువ వచ్చి అసలు ఉపయోగపడే ప్రోడక్ట్లు తక్కువ వచ్చినాయి. అని ఆయనదే ఉవాచ. నాకిష్టమొచ్చినట్టు తీస్తా చూస్తే చూడండి ...లేక పోతే లేదు.. అని ధైర్యంగా చెప్పగల దమ్మున్న ప్రొడ్యూసర్..డైరెక్టర్...ఆయన తీసిన దెయ్యం సినిమాలు...ఒక్కళ్ళే చూడగలిగితే ప్రైజ్ ఇస్తానన్నట్టుగానే ఆయన తీసిన ఆగ్ లాంటి సినిమాలు ఆయనొక్కడే లేదా ధియేటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడే చూసిన సందర్భాలూ ఉన్నాయి.నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

వ్యాఖ్యలు

అజ్ఞాత చెప్పారు…
Raktha Charitra Peru tho janaala lo uttapunyana sanchalanam chesi aa sanchalananni ammukovatam lo baga success ayyadu RGV. Naku nachey cinemalu teesta avi meeku nachalani emundi ani aney Director cinema ku tagina maryaada chesaru prekshakulu. malla Bollywood ki velithey baguntundemo RGV, alochinchu

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!