ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఊడ్చు మిషిన్

 ఊడ్చు మిషిన్రోడ్లూడ్చు మిషిన్  లు వచ్చాయని రోడ్లు అద్దాల్ల మెరిసిపోతాయని ఓ మురిచిపోయారు.
అవి మునిసిపాలిటీ నిధులు ఊడ్చే మిషిన్ లే కానీ... రోడ్లు ఊడ్చేవి కావని తేలిపోయింది

చెత్తని కిందా మీదా కాకుండా డస్ట్ బిన్ను లో వేసే విదేశాల్లోనో,
మంచు కురిసిన రోడ్ల మీదైతే  ఇవి పని చేస్తాయేమో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే మనం తిరిగే ఈ రోడ్ల మీద, ఎప్పుడూ గుంటలు పడి, రాళ్ళు తేలే మన రహదారులపైనా ఇవి ఎంతవరకు పనితనం చూపిస్తాయో ఆ భగవంతుడికే తెలియాలి.
కాంట్రాక్టరులు కొట్టేసే కమీషన్ లు పోయినా అర్ధరాత్రి నుంచీ తెల్లవారు ఝాము వరకూ రోడ్లూడ్చే వారి కడుపుకొట్టి ఎవరికో దోచిపెట్టే ఈ కొత్త మిషిన్ల కొనుగూలులో ఏదో మతలబు..
ఖచ్చితంగా స్కాములు జరిగి నిధులు ఊడవడానికి ఎంతో ఆస్కారమున్నట్టుగా ....

భవధీయుడి అనుమానం.నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

వ్యాఖ్యలు

అజ్ఞాత చెప్పారు…
Sweepers children will not take the same profession.In next generation they will study they will do some other jobs.only thing our heroes sons will become heroes in next generation, hero' son's son also may become hero. So don't find other entertainment watch only movies for ur entertainment.
Apparao Sastri చెప్పారు…
మానవ వనరులు సంవృద్దిగా ఉన్న దేశం మనది.
ఇక్కడ ఇలాంటి మిషన్లు పనికి రావు. ఇది రాజకీయ నాయకుల అజ్ఞానం కాదు, వారికి ఒక ఆదాయ వనరు,
Apparao Sastri చెప్పారు…
కరెక్ట్

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!