అయ్యోధ్య
రేపో మాపో తీర్పు వస్తుందిట అయోధ్య గురించి.. తీర్పు ఏం వస్తుందో తెలీదు కాని ..తీర్పు వచ్చిన తరువాత ఏం జరుగుతుందో మాత్రం చెప్పేయ్యచ్చు. ఒకళ్లకి నచ్చిన తీర్పు వస్తే మరొకరు. హింసకు దిగుతారు..మరో కోర్టులో అపీల్ చేస్తారు. గొడవలూ జరుగుతాయి..ఆ విషయం మీద అసెంబ్లీలలో పార్లమెంటులో రభస జరిగి సభలు వాయిదాలు పడతాయి. ఇరువర్గాల మధ్య సయోధ్య లేనంతకాలం అయోధ్య భవిష్యత్తు మిధ్యే..
రాముడు బీజేపీ వాళ్ళకి మాత్రమే దేవుడో..వాళ్ళకి మాత్రమే హక్కు ఉందో తెలీదు కానీ కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చినట్టు... ఎలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తెందుకొస్తాడో తెలీదు, కమలం రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది..వీళ్ళూ అంతే ఎన్నికలప్పుడే వినిపిస్తారు-కనిపిస్తారు. పాపం సాధువులు, సన్యాసులు, మత ప్రచారకులు, వీళ్ళు రాముడి కోసం పోరాడుతున్నారో రాజకీయంలో పావులౌతున్నారో మరి వారి దివ్య దృష్టికే తెలియాలి. ఎందుకంటే.. కల్పాల కాలం కన్నా ముందు..3 యుగాల క్రితం జరిగిన రామాయణం తరువాత వచ్చిన ప్రళయాలతో నిజమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో ? ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ? త్రేతా యుగం - ద్వాపర యుగం దాటినాక కదా కలి యుగం వచ్చేది.
భారతీయులు అందునా హిందువులు శాంతికాముకులు - మన ఇంటికో - మనకో ప్రాబ్లెం వస్తే తప్ప పక్కవాడేమై పోయినా పట్టించుకోడు. చిన్ని నా పొట్టకు శ్రీ రామ రక్ష అన్నట్టు..జీవించేస్తుంటారు.
రాముడు మా గుండెల్లో నే ఉన్నాడు..కాబట్టి మేమిక్కడే పూజించుకుంటామంటారు.
రోడ్డు వైడెనింగు కోసం అడ్డమున్న హిందూ ఆలయాలనైతె పక్కన పెట్టేస్తుంది కాని.. మరో ప్రార్ధనాలయమో..సమాధో ఉంటే మాత్రం ప్రభుత్వమే టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తుంది..మరి ఇంత పెద్ద విషయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందో..80 శాతం పైగా ఉన్న హిందువుల మనోభావాలు-నమ్మకం-భక్తి-చర్త్ర కన్నా వాళ్ళకి ఓట్లే ముఖ్యం. అణు బిల్లు కోసం ఎవరితోనైనా పోరాడతాం కానీ మహిళా బిల్లుకో-ఈ అయోధ్య విషయానికో అంటే వాళ్ళ దగ్గర టైం లేదు మరి( ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా!)
ఫలానా రామ సేతు ఉంది..అని..ద్వారక సముద్రంలో కనిపిస్తోందని.ఏ నాసా వాడో చెప్తే నమ్ముతాం కానీ.. ఎవరు నస పెడితే మాత్రం నమ్ముతామా..ఇక్కడ కూడా వాళ్ళే కనుక్కుని చెప్పాలేమో.. లేకపోతే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి..ఆ రాముణ్ణే ఇంకెక్కడో పుట్టమని చెప్పాలి. బాబర్ కి చెప్పలేం కదా..
చూద్దాం శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
1 కామెంట్:
>>> లేకపోతే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి..ఆ రాముణ్ణే ఇంకెక్కడో పుట్టమని చెప్పాలి. బాబర్ కి చెప్పలేం కదా..
Very Sad :(
కామెంట్‌ను పోస్ట్ చేయండి