ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అయ్యోధ్య

అయ్యోధ్య

రాముల వారు వేటకి వెళ్లినపుడు ఆయన వేసిన బాణం ఓ చిలుక కి తగిలిందట .. ఆ చిలుక ని చేతిలోకి తీసుకుని ఏమ్మా బాణం తగిలినప్పుడు అరవలేదే అన్నాడట.. అప్పుడు ఆ చిలుక -- ఏమని అరవను స్వామీ.. నాకేదైన కష్టం వస్తే..బధ కలిగితే రామా అని నీతో చెప్పుకునే దాన్ని...ఇప్పుడు నువ్వే బాణం వేస్తే నేనెవరికి చెప్పుకోనూ అంటూ ప్రాణం వదిలిందిట అందుకే అప్పటి నుంచి దానిని 'రామ చిలుక ' అన్నారట.. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది..అందరి కష్టం తీర్చే ఆ రాముడికే కష్టం వచ్చింది.. మరి ఆయన ఎవరితో చెప్పుకోవాలో.. ఎవరి పాలన ఐనా రామరాజ్యం లా ఉండాలి అంటుంటారు..మరి ఈ రాజ్యం లో రాముడి స్థానమేంటి ? అయోధ్య రామ జన్మ భూమా ? కాదా ? 
రేపో మాపో తీర్పు వస్తుందిట అయోధ్య గురించి.. తీర్పు ఏం వస్తుందో తెలీదు కాని ..తీర్పు వచ్చిన తరువాత ఏం జరుగుతుందో మాత్రం చెప్పేయ్యచ్చు. ఒకళ్లకి నచ్చిన తీర్పు వస్తే మరొకరు. హింసకు దిగుతారు..మరో కోర్టులో అపీల్ చేస్తారు. గొడవలూ జరుగుతాయి..ఆ విషయం మీద అసెంబ్లీలలో పార్లమెంటులో రభస జరిగి సభలు వాయిదాలు పడతాయి. ఇరువర్గాల మధ్య సయోధ్య లేనంతకాలం అయోధ్య భవిష్యత్తు మిధ్యే..

రాముడు బీజేపీ వాళ్ళకి మాత్రమే దేవుడో..వాళ్ళకి మాత్రమే హక్కు ఉందో తెలీదు కానీ కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చినట్టు... ఎలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తెందుకొస్తాడో తెలీదు, కమలం రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది..వీళ్ళూ అంతే ఎన్నికలప్పుడే వినిపిస్తారు-కనిపిస్తారు. పాపం సాధువులు, సన్యాసులు, మత ప్రచారకులు, వీళ్ళు రాముడి కోసం పోరాడుతున్నారో రాజకీయంలో పావులౌతున్నారో మరి వారి దివ్య దృష్టికే తెలియాలి. ఎందుకంటే.. కల్పాల కాలం కన్నా ముందు..3 యుగాల క్రితం జరిగిన రామాయణం తరువాత వచ్చిన ప్రళయాలతో నిజమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో ? ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ? త్రేతా యుగం - ద్వాపర యుగం దాటినాక కదా కలి యుగం వచ్చేది.

భారతీయులు అందునా హిందువులు శాంతికాముకులు - మన ఇంటికో - మనకో ప్రాబ్లెం వస్తే తప్ప పక్కవాడేమై పోయినా పట్టించుకోడు. చిన్ని నా పొట్టకు శ్రీ రామ రక్ష అన్నట్టు..జీవించేస్తుంటారు.
రాముడు మా గుండెల్లో నే ఉన్నాడు..కాబట్టి మేమిక్కడే పూజించుకుంటామంటారు.

రోడ్డు వైడెనింగు కోసం అడ్డమున్న హిందూ ఆలయాలనైతె పక్కన పెట్టేస్తుంది కాని.. మరో ప్రార్ధనాలయమో..సమాధో ఉంటే మాత్రం  ప్రభుత్వమే టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తుంది..మరి ఇంత పెద్ద విషయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందో..80 శాతం పైగా ఉన్న హిందువుల మనోభావాలు-నమ్మకం-భక్తి-చర్త్ర కన్నా వాళ్ళకి ఓట్లే ముఖ్యం. అణు బిల్లు కోసం ఎవరితోనైనా పోరాడతాం కానీ మహిళా బిల్లుకో-ఈ అయోధ్య విషయానికో అంటే వాళ్ళ దగ్గర టైం లేదు మరి( ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా!)

ఫలానా రామ సేతు ఉంది..అని..ద్వారక సముద్రంలో కనిపిస్తోందని.ఏ నాసా వాడో చెప్తే నమ్ముతాం కానీ.. ఎవరు నస పెడితే మాత్రం నమ్ముతామా..ఇక్కడ కూడా వాళ్ళే కనుక్కుని చెప్పాలేమో.. లేకపోతే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి..ఆ రాముణ్ణే ఇంకెక్కడో పుట్టమని చెప్పాలి. బాబర్ కి చెప్పలేం కదా.. 

చూద్దాం శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష..

 

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

వ్యాఖ్యలు

అజ్ఞాత చెప్పారు…
>>> లేకపోతే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి..ఆ రాముణ్ణే ఇంకెక్కడో పుట్టమని చెప్పాలి. బాబర్ కి చెప్పలేం కదా..

Very Sad :(

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!