ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శఠగోపం

కర్ణాటకది "గాలి " వాటం
మహారాష్ట్ర "నీటి " వాటం
ప్రతిపక్ష నేతల పై లాఠీ ప్రతాపం
ఆంధ్ర ప్రజలకు శఠగోపంనచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

వ్యాఖ్యలు

durgeswara చెప్పారు…
అయ్యా

శఠగోపం అనేది ఆలయాలలో భగవంతుని పాదములకు ప్రతీకగా భక్తుల శిరస్సుపై ఉంచి దీవించే ఒక పరికరం . మరి ఇక్కడ మీరు సన్నివేశానికి ఏమాలోచించి వ్రాసారో అర్ధం కావటం లేదు . బహుశా అర్ధం కంటే ప్రాస ముఖ్యమై ఉంటుంది . దయచేసి ఇలాంటి ప్రయోగం మనం చేయటం మానుకుందాం .
Fun Counter చెప్పారు…
దుర్గా నాగేశ్వర రావు గారు..ధన్యవాదాలు..

శఠగోపం అసలు అర్ధం నాకునూ తెలుసునండీ,,కాకపోతే..వ్యావహారికంలో అక్షింతలు అంటే తిట్లు అనీ,,,శఠగోపం అంటే టోపీ పెట్టడమని..ప్రజా బాహుళ్యం లో ఉండడం వల్ల వాడాను కానీ కించపరచడానికో..ప్రాసకోసమో కాదు. దయచేసి గమనించ గలరు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!