Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

గురువారం, జూన్ 24, 2010

దేవుడా నీకెవరు దిక్కు??

దేవుడా నీకెవరు దిక్కు??

అప్పుడెప్పుడో మొసలి ఏనుగుని పట్టుకుంటే వచ్చి రక్షించాడట మహా విష్ణువు..ఇప్పుడు మొసళ్ళ లాంటి నాయకులు పట్టుకున్న ఆ విష్ణువు ని ఎవరు రక్షిస్తారో మరి. వరాలిచ్చే దేవుడే రాజకీయ నాయకుల ఉచ్చు లో బిగుసుకుని బయటకు రాలేక పోతున్నాడు. కలియుగ ప్రత్యక్ష్య దైవానికీ కలి ప్రభావం పాలక మండలి రూపం లో పట్టుకుంది.

రాబోయే ఐదేళ్ళవరకు కళ్యాణం టికెట్లు లేవు..మరి ఐదేళ్ళూ కళ్యాణాలు చేయించుకునే వాళ్ళు నిజం గా బుక్ చేసుకున్న భక్తులేనా...లంచాలు బుక్కి అమ్మేసారా?

2080 వరకూ ఆర్జిత సేవ టికెట్లూ బుక్ చేసుకోవచ్చు..ఇచ్చినవాళ్ళు కానీ పుచ్చుకున్న వాళ్ళు కానీ మరో 70 ఏళ్ళు బతికే ఉంటారా..మరి అవి ఎవరికి చేరతాయి ?

పెద్ద చేపలకు (కింగు ఫిషర్లు), ప్రత్యేక దర్శనాలకోసం రోజుల తరబడి క్యూలో వున్న భక్తులను ఆపి మరీ దర్శనాలు..అందుకు "ఆది" నుండీ ఆర్భాటం..

ఆర్జిత సేవలు స్వామివారికి...ఆర్జన ఎవరెవరికి ?

పాలక మండలి లో పాలెన్ని నీళ్ళెన్ని - ఏడుకొండలు ఎక్కి వచ్చే భక్తులను ఏడిపించే విధానాలు !!

పాలక మండలి లో ఉండే వారికుండాల్సిన అర్హతలేమిటి ??

పాలక మండలి డ్యూటీలేమిటి - భక్తులను లూటీ చేయడమా..???

పాపం ఈ ప్రశ్నలకు స్వామి వారి వద్ద కూడా సమాధానం లేక .. మౌనంగా మరో గుమ్మం వెనక్కి వెళ్ళాడు..

తిరుమలేసునికే నామాలు పెట్టి..భక్తులకి తిరు క్షవరం చేస్తున్న పాలక మండలీ ...గోవిందా గోవిందా

కళ్యాణ కట్టనుంచీ..కళ్యాణం టికెట్ల వరకూ...ఎవరి వాటా వారిదే - గోవిందా గోవిందా 

నడిచి వచ్చే భక్తూల సుదర్శనం - వీ ఐ పీ లకు బ్రేక్ దర్శనం గోవిందా గోవిందా.
మామూలు జనాలను వెనక్కి లాగుతాం - విజయ మాల్యాలకు ఘన స్వాగతం గోవిందా 
గోవిందా

తి తి దే అంటే 'తి 'నేస్తాం 'తి 'నిపిస్తాం 'దే 'వుడి సొమ్ము -- గోవిందా గోవిందా.

హుండీలో రూపాయలనుంచీ..బంగారు డాలర్ల దాకా గోవిందా గోవిందా.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగుందండీ మీ తి.తి.దే. నిర్వచనం. బహుషః తి.తి.దే బోర్డులన్నీ ఇలా రాస్తే సరిగ్గా సరిపోతుందేమో??

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఎంత వచ్చినా 2004 నుంచి ఇంతవరకూ ఒక్క పైసా కూడా బ్యాంకులందు Diposit కావడంలేదంట!ఏమవుతుండాదో స్వామివారి సొత్తు?

LinkWithin

Related Posts with Thumbnails