ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యమదూత

ఒకప్పుడు రాజ్ దూత్ ఉండేది..ఇప్పుడు యమహా అని యమదూత వచ్చింది..ఏదో సినిమాలో చూసి,,మరో ఫ్రెండు దగ్గర చూసి..ముచ్చటపడి...అపోహ పడి..ఒక్కో సారి అవమాన పడి..అమ్మా నాన్నలకు అడ్డు పడి..కింద పడి మీదపడి..మొత్తానికి బైకు కొనేస్తారు.. సుమారుగా లక్ష పెట్టి బైకు కొంటారు కానీ..హెల్ మెట్టు కొనరు..వాడిచ్చినా వాస్తు ప్రకారం ఏదో గదిలో పడేస్తారు కాని..తలకి వాడరు. అసలే ఇరుకు రోడ్లు..ట్రాఫిక్ జాములు..పోలీసులు - చలానాలు - ఫలానాలు - ఫ్రెండ్స్ తో పోటీలు.. ఇంకేముంది ఆదివారం..మరో వూరు ప్రయాణం..హై వేలో వందకి పైగా స్పీడుతో రక రకాల విన్యాసాలు..పైత్యాలు..కోపాలూ - ప్రకోపాలూ.. ఎగసే వయసు...ఎగిరే బళ్ళు..ఎదురొచ్చే బస్సులు..ఆగిపోయిన లారీలు..జారిపోయిన చక్రాలు-అడ్డంగా వచ్చే గేదెలు..ఐనా మనం ఆగం...పోటీకో..మాటకో..మరోదానికో మొత్తానికి స్పీడుగా వెళ్లి ఏదో జరిగి..మనం గెలిస్తే దండ పడుతుందో లేదో కానీ...ఫొటోకి దండ పడడం .......నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వ్యాఖ్యలు

Marco Crupi చెప్పారు…
Hi, I am the owner of the blog of photography http://photographymc.blogspot.com/

I have added in the favorite, I would like an exchange links with you.

In my photography blog articles on photographic techniques, Photoshop tutorials, digital cameras and photomontage.

Tell me what do you think.
Sai Praveen చెప్పారు…
మీ పాయింట్ కరెక్టే. ప్రమాదాల గురించి హెచ్చరించాలనే మీ ఆలోచన బాగానే ఉంది. కాని చివర్లో అలా 'ఖాయం' అనేస్తే ఎలాగండి? :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!