హీరోల అభిమానులకి విజ్ఞప్తి..
పాపం మీకిష్టమైన హీరోలని మనుష్యులుగా చూడండి..వాళ్ళని జూ లో జంతువులుగా చూడొద్దు. మీ అభిమానం తో మీ హీరోలని "సిమ్హా"లు.'పులులు " గా చూసి వాళ్లకి మేమూ మనుష్యులమే అనుకోవడం మర్చిపోయేలా చేస్తున్నారు..అడవిలో పులులు సిమ్హాలా లా
గుహల్లో(గృహాల్లో) ఉండిపోతున్నారు.. మీ అభిమానానికి..ఎక్ష్పెక్టేషన్ కోసం.అవసరమున్నా లేకున్నా ఇమేజ్ కాపాడుకోవడం కోసం ఒకే లాంటి కధలు..కధనాలతో నటించి ఫ్లాపులు ఇస్తున్నారు.
సమర సిమ్హం, సీమ సిమ్హం, నరసిమ్హం, సిమ్హా ఇలా పేర్లు కోసం పాకు లాడి..ఒకటో రెండో డైలాగులు..పాటలతో నెట్టుకు రావడం..అది మీకు నచ్చక సినిమా ఫ్లాపు కావడం..మరి మీరు నిజంగా అంత గొప్ప అభిమానులైతే మీ హీరో ఎంతో ఇష్టపది..కష్టపడి చేసే సినిమాలు ఎందుకు ఆడించరు. మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో వాళ్లకి ఎందుకు తెలీదు..ఈసారి పాపం మీ కోసం ఒక పడుచు పిల్ల స్నేహా ఉల్లాల్ దాదాపు కూతురు వయసు..మధ్య వయస్కురాలు..నయన తార చాన్నాళ్ళకు చీరతో..ఇక నమిత.. ఇలా ఎన్నో చేయవలసి వస్తుంది..ఆ హీరో గారికి తండ్రి పాత్ర వేసే నటుడు ఉండడు..హీరో ఒక్క దెబ్బ తినకూడదు..మీసం మెలేస్తే రైళ్లు , విమానాలు ఆగిపోతాయి..ఇవి నిజం గా జరిగే విషయాలేన..చిటికెన వేలికి దెబ్బ తగిలి షూటింగు ఆపేస్తారు..అంటే వాళ్ళూ మానవ మాత్రులే కదా. మరి ఎందుకు మీ ఓవరేక్షన్..సినిమా బాగుంటే ఆదరించండి..ఒకరి పై అభిమానాన్ని ఒకరిపై ద్వేషం గా మార్చుకోకండి.. ఎన్ టీ ఆర్ బాగా డైలాగు చెబితే..రాం చరన్ స్టైలిష్ గా ఉంటాడు.. అల్లు అర్జున్ చలాకి గా ఉంటే..నాగ చైతన్య మరో లా ఉంటాడు..మీ మధ్య వైరాలతో వాళ్ళ మధ్య దూరాలు పెంచకండి.
కలెక్షన్లు, 100 డేయ్స్ విషయం లోనూ అంతే..సినిమా ఎలా ఉంటుందో తెలీక ముందే వంద పైన ప్రింట్లతో వదులుతారు..మొదటి వారంలో వేలం వెర్రి గా చూసేస్తారు..మొత్తం ఏదో కలెక్షన్ వస్తుంది.. అదే కొలమానమా..రెండో వారానికి సగానికి పైగా ప్రింట్లు వెనక్కి వచ్చేస్తాయి..నాలుగో వారానికి నాలుగైదు చోట్ల తప్ప ఇంకెక్కడా ఉండదు..సడెన్ గా ఎక్కడో ఒక చోట 50 రోజులదో ఇంకోటో ఫంక్షను..ఎందుకీ ఖర్మ.
నాయకుడు లాంటి సినిమా మన బాల కృష్ణలు, చిరంజీవి లాంటి వాళ్ళు చేయలేరా. చేస్తే మీరు చూడరా..చూడకపోతే మీది నిజమైన అభిమానం కాదు. మూస పాత్రల సినిమాలకన్నా ..మంచి సినిమాలు ఆదరించండి..ఇకనైనా మీ హీరోలని మనుష్యులుగా చూడడానికి ప్రయత్నించండి..గోళ్ళతో గోడౌన్ లని కూల్చే, కళ్ళ తో రైళ్ళు ఆపేసే సినిమాల కన్నా .. హాయిగా ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోలు కలిసి నటించే సినిమాలు ఆదరించండి..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
2 కామెంట్‌లు:
Wonderful Phani Garu. well said.
నచ్చినా నచ్చకున్నా , మీకే చెబుతా.. :))
మరేనండీ మీ పై పోస్టింగ్ అదుర్సండి. మరి ఆ డెంటెడ్ ఫేస్ చిరుతయ్యినపుడు, మన ఏనుగు గారి కొడుకు సింగం అవడాండి? కాని ఇలాగే ఏ కుక్క, నక్క, పిల్లి , పందులైపోతారేమో అని నా పరేషానీ అండీ .. ఆయ్!
కామెంట్‌ను పోస్ట్ చేయండి