Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

శనివారం, మే 01, 2010

కాశీ పట్నం చూడర బాబూ


కాశీ పట్నం చూడర బాబూ
   తెలుగు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...'కొత్త ' ఐడియా లతో వస్తున్న 'చిత్రాలని ' చూడాలంటే భయమేస్తోంది..సినిమాకి ఐతే వెళ్ళడం తప్పించుకోవచ్చు,
కానీ,,ట్రైలర్ల పేరుతో ఇంట్లో టీవీల్లోవి ఏం చేద్దాం.ఇదివరకు పండంటి సంసారం, పచ్చని కాపురం, నిండు గౌరవం లాంటి సినిమాలొచ్చాయి, తరవాత సంసారాలు పోయి,
రాక్షసుడు, యమకింకరుడు, కిరతకుడులాంటి సినిమాలొచ్చాయి, తరువాత..నువ్వు నాకు నచ్చావ్, ప్రేమించుకుందాం రా , కలిసుందాం రా ,
ఇంకేదో చేదాం రా లాంటి సినిమాలొచ్చాయి, ఇప్పుడు తిట్ల ట్రెండు అనుకుంటా...ఈడియట్, కంత్రి, పోకిరి, బలాదూర్,దేశ(హ)ముదురు,
ఇలా తిట్ల సినిమాలొస్తున్నాయి..సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతోంది...ఎంత పెద్ద "తిట్టో "అంత పెద్ద "హిట్టు"....
ఇక ప్రస్తుత జెనెరషన్ బాడీలది..అవును మొహం తో నటించలేం కాబట్టి బాడీ లాంగ్వేజు అంటున్నారు..ఇది ఏమి లాంగ్వేజ్ప మరి, మనమెక్కడ నేర్చుకోవాలో..
సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు (హెరాయిన్ అనాలేమో?)...బలిసిన శరీరాల్ని...సుష్కింపచేసి..కండలు పెంచి..చొక్కాలు చించి.....
గడ్డాలు పెంచి...నీరసించి...కనిపిస్తున్న హీరోలు...ఆ సమయాన్ని కాస్త నటననేర్చుకోవడానికి....కాస్త మంచి సబ్జెక్టుల్ని వెతుక్కోవడానికి ఉపయోగిస్తే
బాగుంటుందేమో..

ఒక డైరెక్టరు ఒకహిట్టు ఇవ్వగానే వెంటనే ఆయనతో ఒక సినిమా అనేసుకోవడం.హడావిడిగా మొదలెట్టడం..ఒక హీరోయిన్ హిట్టవగానే ఆమెతోనే సినిమాలు చెయ్యడం..

వాళ్ళకి విసుగొచ్చి బాంబేనో, చెన్నయ్యో, కేరళో పారిపోతే..సినిమా ఆపి కోటి పైగా ఇచ్చి ఆ పర భాషాకాంత ని తెచ్చి చెయ్యడం ఫాషన్ అయిపోయింది...
జాతీయ అవార్డు అందుకున్న నటి చేస్తున్న చిత్రం అంటూ వచ్చిన ఒక సినిమాలో (అవార్డు వచ్చిన సినిమా కాదు) ఆమె కు నటించాల్సిన అవసరం లేని పాత్ర..
ఒకట్రెండు పాటలు..ప్రేమ, ఇతరత్రా విషయాలు//మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా మీకెలాంటి పాత్రలు ఇష్టం అంటే అన్నీ అలాంటి పవిత్రమైన పాత్రలు పరుత్తివీరన్
పాత్రలే వస్తున్నాయి...నాకు బబ్లీగా ఉండే పత్రలిష్టం ఎక్స్పోజింగు అవసరమైనంత మేరకు చేస్తాను (ఎవరికి అవసరమైనంత వరకో మరి ??) అంటూ "ప్రియం"గా
చెప్పింది ఒక భామా "మణి".....

ఇంకా నేను తూనీగ పిల్లనే అనుకుంటున్నారు నేను "పెద్ద" దాన్నాయాను..గుర్తించండి..కావాలంటే ఎక్స్పోజింగు చేస్తా(అప్పటికైనా గుర్తిస్తారనేమో)

అని ఈనాడు ఒక బాల వర్ధమాన యువ నటి సెలవిచ్చింది///నేను మాటలు చెప్పను అంతా చేతలే అంటూ 'నయనా' నికి ఆనందం కలిగించే 'తార ',
ఇటీవల 'విశాల హృ దయం కల ఒక హీరోకి పోటీగా తన 'కండలని-గుండెలని ' ప్రదర్శించింది....ఆమె స్ఫూర్తికి "సెల్యూట్ " .
యోగాభ్యాసం నుంచి హీరోయిన్ "యోగం "పట్టిన మరో చిన్నది కూడా వీలైనంత చిన్న దుస్తులే వేసుకుంటూ ఇటీవల పెంచిన తన పారితోషికానికి న్యాయం చేస్తూ..
కనీసం కాస్ట్యూంస్ విషయంలోనైనా నిర్మాత కి నాలుగు డబ్బులు మిగులుస్తోంది....

ఇక రాబోయే సినిమాల్లో ఎలా వుంటారో..ఏమో? ఈ మధ్య ఒక జోక్ చదివా ఆ సినిమాలో నగ్నంగా ఎలా నటించారు అని ఒక విలేఖరి హీరోయిన్ ని అడిగితే..

ఏం చెయ్యను హీరో అలా కల గన్నాడు మరి అంటూ అమాయకంగా జవాబిచ్చిందిట..కధ డిమాండ్ చేసింది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు..
కానీ నాకు అర్ధంకాని విషయం ఒకటుంది...కధకి మాటలొచ్చా అని..రైటర్ అనుకున్నది తెర మీదకి వస్తుందా అని..మధ్యలో ప్రొడ్యూసరు, డైరెక్టరు,
హీరో ఇలా తలా ఒక చెయ్యి వేస్తారుకదా....హీరోయిన్ మీద కాదండీ కధ మీద...

ఇక రాబోయే సినిమాల టైటిల్సు ఇలా వుంటాయేమో?

వె ధ వ - వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు
శ్రీ రాముడు - ఈయనకి ఇద్దరు పెళ్ళాలు
లేచిపోదాం రా...కట్నాలు మిగులుద్దాం, కళ్యాణం చేసుకుందాం
సిక్స్ పాక్ వీరుడు- సెక్సీ లుక్ చిన్నది

అదిగో అక్కడ ఏదో సినిమా ప్రా'రంభో'త్సవం మొదలౌతోంది :


అక్కడ బాగా హడావిడిగా ఉంది...షామియానాలు, కుర్చ్చీలు, మైకులు, ఒకటే హడావిడి..ఇంతకీ విషయం ఏమిటంటే అక్కడ ప్రెస్ మీట్ జరగబోతోంది..

ఒక సినిమా తాలూకు విశేషాలు చెప్పడానికి...సినిమా అద్భుతంగా వచ్చింది..ఇంత వరకూ తెలుగు తెర మీద ఇలాంటి సినిమా రాలేదు (తాను చూసి ఇన్ స్పైర్ అయి
కాపీ కొట్టిన ఇంగ్లీషు సినిమా తలుచుకుంటూ, దాని వసూళ్ళు లెక్కలు కడుతూ ) దర్శకుడి ..తొలి పలుకులు...

మ్యూజిక్ చాలా బాగా వచ్చింది హీరో (లావుగా బొజ్జతో కదలలేని)బాడీ లాంగ్వేజ్ దృష్టిలో పెట్టుకుని చేసా...గ్యారంటీగా సూపెర్ హిట్ అవుతుంది..

తాను డైరెక్టుగా డౌన్ లోడ్ చేసిన ఇంగ్లీష్ ఆల్బం మీద నమ్మకంతో) మ్యూజిక్ డైరెక్టరు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ చాలా హాపీ గా ఉంది..మంచి
ఎక్స్పోజింగు కి) స్కోప్ ఉన్న సినిమా...హీరో సార్, డైరెక్టర్ సార్, ప్రొద్యూసర్ సార్ చాలా 'కోపరేట్" చేస్తున్నారు...
(సబ్బు కంపేనీ యాడ్ నుంచి దిగుమతి ఐన బొంబాయ్ భామ)..

సినిమా అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది (అంత చండాలంగా తీద్దామని అనుకోడం ఎందుకు ? బాగా వచ్చిందనడం ఎందుకు ?)

బాగా రిచ్ గా తీసాం (తప్పలేదు మరి).హీరో గారు బాగా "కోప"రేట్ చేసారు...(నెక్లెస్ రోడ్లో తీయాల్సిన హీరో నడిచే సీను న్యూజిలాండ్లో
చేయించిన సీను గుర్తు చేసుకుంటూ) ప్రొడ్యూసరు.. 100 ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం. (కనీసం ఒక్క రోజు ఆడినా 100 రోజుల ఫంక్షన్ చేసుకోవచ్చు).
గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది.
ఇలా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ రిలీజ్ డేటు అనౌన్స్ చేసారు...
సినిమా రిలీజ్ అయింది...ధియేటర్ దగ్గర..

కెవ్వు కేక..మా హీరో సినిమా సూపెర్ హిట్టు,,ఆయన మీద వొట్టు..రికార్డులన్నీ తిరగరాస్తుంది..హండ్రెడ్ డేస్ ఆడేస్తుంది..

(ముందు రోజు నుంచీ తిండీ తిప్పలు లేకుండా కటౌట్లు కట్టి, దండలేసి,,సినిమా హాలుకి రంగులేసి, చొక్కా చిరిగినా టికెట్టు సంపాదించేసి,,
పాటలకి ఈల వేసి, ఫైట్లకి కాగితాలెగరేసి ..సినిమా చూసి మెంటలెక్కేసి) అభిమాని ఉవాచ.... కట్ చేస్తీ..సినిమా రెండో రోజే గల్లంతు
కానీ మళ్ళీ మనవాళ్ళు సక్సెస్ మీట్ అంటూ తయారు...ఏం చేస్తాం తప్పదు మరి,,,,
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

2 వ్యాఖ్యలు:

madhuri చెప్పారు...

mmeku theluso ledo...battlu entha chinnavaithe antha khareedu ekkuva.

KK చెప్పారు...

బహుబాగా రాసారు. ఇలాటి సినిమాలు తీస్తూ పోతే, హీరోలు, నిర్మాతలు "నా సినిమా ఒక్కరోజు ఆడితే వందరోజులు ఆడినట్లే" అని సరిపెట్టుకునిపోవాల్సి వస్తుంది త్వరలోనే.

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa