అప్పుచేసి 'పప్పు ' కూడు
మన అంతస్తెక్కడ వాళ్ల అంతస్తెక్కడ...నెలకోసారి పప్పు చారు కాచుకునే వాళ్ళకి, వారానికోసారి పప్పు చేసుకునే మనకీ సంబంధమా...నా కంఠం లో ప్రాణం ఉండగా జరగనివ్వను..ఓ తండ్రి గొప్పడియర్ ఈ మేరేజ్ డేకి నాకు కంది గింజతో ముక్కు పుడక చేయిస్తావా? అని అడిగినందుకు కిడ్నీ అమ్మి మరీ చేయించాడు తెలుసా నా లవరు....ఒక ప్రియురాలి ఆశ్చర్యం
కట్నం కింద పది కిలోల కందిపప్పు అడిగిన పెళ్ళికొడుక్కి దేహశుద్ధి..ఒక ఊరిలో నిరసన
దుబాఇ నుంచి అరకిలో కందిపప్పు అక్రమ రవాణా చేస్తూ పట్టు బడ్డ భారతీయునికి కఠినశిక్ష...పేపరులో మొదటిపేజీ న్యూసు...
పురావస్తు తవ్వకాలలో..బయటపడ్డ కందిపప్పు ఆనవాళ్ళు...2008 సంవత్సరం వరకూ ప్రజలు అష్ట ధాన్యాలు కాక నవధాన్యాలు వాడేవారనీ అప్పట్లో కందిపప్పునీ పప్పుగా పచ్చడిగా వాడేవారని అప్పటి పత్రికల్లో వంటల పేజీల ద్వారా గుర్తించినట్టు పురావస్తు శాస్త్రఙులు తెలిపారు......... టీవీలో ఫ్లాష్
నా పేరుకి ఇప్పటికి విలువ పెరిగింది అని స్పీడు పెంచింది 'కంది ' రీగ
గిలిజిబెత్ రాణి కిరీటం నుంచి కందిపప్పు ఆనవాలు చోరీ...ఇది ఖచ్చితంగా చార్లెస్ సోభరాజ్ ముఠా పనే అని ఇంటర్పోల్ అనుమానం
కొన్నాళ్ళు పోతే ఇలాంటి పరిస్థితులు ఎదురౌతాయేమోనని అనుమానం వేస్తోంది...ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బ్లాకు మార్కెట్ విషయం చూడకపొతే రేపు పేపర్లో బంగారం వెండి ధరలతో పాటు కందిపప్పు కూడా తులం వంద ...అని,,,మేకింగు చార్జెస్ ఎక్ష్ట్రా అనీ చూడాల్సొస్తుందేమో..
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
5 కామెంట్‌లు:
LOL
నచ్చింది. :D
chalabagundi, image enka bagundi, vungaramlo kandipappu.
nice posting
very fine all the best
కామెంట్‌ను పోస్ట్ చేయండి