Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, జూన్ 22, 2009

నా తెలంగాణ కోటి రతనాల వీణ

నా తెలంగాణ కోటి రతనాల వీణ

తె రా స అంటే ఇన్నాళ్ళూ తెలంగాణా రాష్ట్ర సమితి అనుకున్నా …కానీ తె రా స అంటే

తె “ల్లారి “రా”జీనామ “ “మర్పణ -----సాయంత్రం ఉపసం హరణ అని నేడే తెలుసుకున్నా..

కాసేపు ఆయనే నాయకుడు అంటారు..ఆయనకి పూజలు చేస్తారు, స్త్రోత్రాలు చదువుతారు..ఆయనా యాగాలు చేస్తారు..తీరా కాసేపటికే..పచ్చి మోసగాడు..బంధుపక్షపాతి..ఇంకా నానా మాటలు అంటారు..వెంటనే ‘రాజీ నామా చేసేస్తారు…వెంటనే బతిమిలాడతారు..ఆయనా ఒప్పుకుంటాడు..ఇదీ మామూలే అయిపోయింది…

ప్రజలు మాతో ఉన్నారు అంటే మాతో ఉన్నారు అని అంటారు అందరు..ప్రజలు వాళ్ళతో ఉండి పక్క వాళ్ళకి ఎందుకు వేస్తారో మరి ఓట్లు…
విజయం మాదే అన్నారు..తెలంగాణా తధ్యం అన్నారు..తీరా చూస్తే కధ అడ్డం తిరిగింది,

మనం పోరాడాల్సింది..మన హక్కుల కోసమా..బడ్జెట్ కోసమా..ప్రాజెక్టుల కోసమా ప్రతేక రాష్ట్రం కోసమా అన్నది నాకు తెలియట్లేదు.

తెల్ల దొరల పాలన నుంచీ విముక్తి కోసం..స్వరాజ్యం కోసం పోరాడాం ..సాధించాం
నిజాం నిరంకుశ పాలన నుంచీ విముక్తి సాధించాం.
భాషా ప్రాతిపదిక పై తమిళనాడు నించీ విడిపడ్డాం …ఆంధ్రులమయినాం.


ప్రాజెక్టులో..బడ్జెట్టులో..మరో అవసరమైన ఏ విధమైన హక్కైనా పొరాడి సాధించే ప్రజలు తగ్గుతారు….ఆంధ్రులమై ఒక్క తాటిపై నిలిచి పన్నెండు కోట్ల మందీ ఆ ప్రాంత అభివృద్ధి కోరితే..నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే..నిధులు సరిగా పంచి..విధులు సక్రమంగా చేస్తే…నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి పలుకులు అక్షర సత్యమౌతాయి..తెలంగాణ నేల..సశ్య శ్యామలమౌతుంది..

(రాజకీయంగా సరైన అవగాహన లేకపోయినా…ప్రతి రోజూ జరుగుతున్న రాజకీయ్ పరిణామాలు చూసి ఇలా స్పందించా..ఎవరినీ నొప్పించడానికి కాదు..మనమంతా ఒకటే అని ఒప్పించడానికి. మాత్రమే...పూర్వం మనం సాధించిన విజయాలు ఒక పార్టీ వారో..ఒక్క నాయకుడో..ఒక్క సంస్థో సాధించినవి కావు…అవి ప్రజా యుద్ధం తో సాధ్యమైనవి..పార్టీల కి అతీతంగా …లక్ష్య సాధన కోసం పోరాడితే తప్పక విజయం సాధిస్తారు..జయహో…..తెలుగోడా,,,,,,,,,,,,,,,)

తెలంగాణా అభివృద్ధికి నేను సైతం అంటూ మీతోనే మేమూ అంటూ ప్రతి ఒక్కరు ప్రాంతీయ, రాజకీయ, బేధం లేకుండా పోరాడాలని కోరుకునే…ఒక అనామకుడు.
నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

5 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నచ్చింది. రాజశేఖరునికి,చంద్రశేఖరునికి,విజయశాంతికి చెప్పా ఇంకొకరికి ఎవరికి చెప్పాలబ్బా ! :)

ప్రభాకర్‌ మందార చెప్పారు...

>>>>ఆంధ్రులమై ఒక్క తాటిపై నిలిచి పన్నెండు కోట్ల మందీ ఆ ప్రాంత అభివృద్ధి కోరితే..నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే..నిధులు సరిగా పంచి..విధులు సక్రమంగా చేస్తే…నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి పలుకులు అక్షర సత్యమౌతాయి..తెలంగాణ నేల..సశ్య శ్యామలమౌతుంది..<<<<<


అట్లా అవడం లేదు కాబట్టే , అట్లా అవడానికి ఆస్కారం లేదు కాబట్టే తెలంగాణా ప్రజలు తెలంగాణా కావాలని కోరుకుంటున్నారు.

మనకు పాఠశాలల్లో మన రాష్ట్ర ఏర్పాటు గురించిన వాస్తవాలను బోధించరు. హైదరాబాదు రాష్ట్రం గురించి , తెలంగాణా చరిత్ర గురించి, హైదరాబాదు రాష్ట్రం ఎప్పుడు , ఎలా ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం హైదరాబాదు రాష్ట్రం ఎప్పుడు ఎందుకు ఏ ప్రాతిపదికన విలీనమయ్యాయి. అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి దానిని ఎందుకు తుంగలో తొక్కారు. కృష్ణా గోదావరి నదులు తెలంగాణా లో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నాయి. తెలంగాణాకు ఆ జలాల్లో రావలసిన వాటా ఎంత. ? వాస్తవానికి లభిస్తున్న వాటా ఎంత ? 610 జీవో ని ఎందుకు జారీ చేసారు? ఎందుకు అమలు చేయడం లేదు.? ఈ వివరాలు ఏమీ ఎవరూ ప్రస్తావిన్చరు.

మీరైనా వీటిగురించి స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే , నిష్పక్ష పాతంగా ఆలోచిస్తే ... తెలంగాణా తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పడుతున్న ఆరాటం , చేస్తున్న పోరాటం అర్థమవుతుంది.

ఉమ్మడి కుటుంబాలు ఎందుకు విఫల మవుతున్నాయో తెలిసిందే కదా. బలవంతంగా కలసి వుండటం కంటే విడిపోయి ఆత్మీయతను నిలబెట్టుకుంటే మంచిది కదా?

ఇక కెసిఆర్ అంటారా. వ్యాపారంగా మారిన ఈనాటి రాజకీయాలలో అతనో పుట్టగొడుగు. అతన్ని చూసి మొత్తం తెలంగాణాను అంచనా వేయకండి. తెలంగాణాకు అన్ని పార్టీలూ అనుకూలంగా తీర్మానాలు చేశాయని, అది తెలంగాణా ప్రజలందరి ఆకాంక్ష ఫలితమే అని గుర్తించండి. కాకపోతే దగుల్భాజీ రాజకీయాలు చెప్పేదొకటి చేసేదొకటి గా దుర్మార్గంగా వ్యవహరిస్తుండడం వల్లనే ప్రజలు ఇన్ని విధాలుగా దగా పడవలసి వస్తోంది.

ఫన్ కౌంటర్ - funcounter చెప్పారు...

నమస్తే,
ప్ర(తి)భాకర్ గారు, కుళ్ళు రాజకీయ నాయకులని నమ్ముకుని మన సమయం, శక్తీ, లక్ష్యం, శ్రమ, అన్నీ వృధా చేస్తున్నామే అని నాబాధ. తెలంగాణా వివక్షకి గురి అవుతున్నదని తెలుసు, కానీ ఇప్పటికీ ప్రజలు,,,,ఎవరో వస్తారు ..చేస్తారు అని ఎదురుచూస్తూ....వచ్చిన ప్రతివాడిని నమ్ముతూ..ఇంకా అదే పరిస్థితుల్లో ఉండిపోతున్నారు...కలిసి పోరాడి సాధించుకోవలసిన వాళ్ళు తలో పార్టీకి సపోర్టు చేసి, అసలు లక్ష్యాన్ని మరుస్తున్నారు..అధికారం కోసం ఇతర లాభాల కోసం రాజకీయనాయకులు ఇంకా ఏమారుస్తునారు...
ఎవరినైనా బాధ పెడితే క్షమించగలరు....రోజుకో మాట మార్చి...పూటకో పార్టీ మార్చే నాయకులని నమ్ముకోకుండా...ప్రతి ఒక్కరు తామే నాయకులు గా మారాలి..

అజ్ఞాత చెప్పారు...

seperate state kanna better solutions levaa??...ee roju telangana seperate cheyyalani okadu vachaadu....repu adilabad ki warangal vaallu anyaayam chestunnaru...uttara telangaana kaavaalani inko edava raadani guarantee enti??

Ramesh చెప్పారు...

there are so many students in osmania university. All are losing hope in seperate state due to the oppurtunist leaders at state level and university level. Naa thelangaanaa...

మొహబతే...ఈళ్ళకెప్పుడు మొహం మొత్తే

సమయం రాత్రి 7 గంటలు : టీవీలో ఏదో హిందీ చానెల్లో సీరియల్ : రమణ్ భల్లా అనే పారిశ్రామికవేత్త మూడోపెళ్ళి జరుగుతుంటే, ఒకటో భార్య వచ్చి పెళ్ళి ...

LinkWithin

Related Posts with Thumbnails

Alexa