ఏ పీ ఎల్ అను ఆంధ్రా పొలిటికల్ లీగ్
16-23 అదేదో '20-20' లాగా 16-23 తేదీల్లో జరిగే 'ఆంధ్రా పొలిటికల్ లీగ్' లో పాల్గొనే జట్లు నాయకులు, కోచులు వివరాలు..
రాయల్ సీమ రాజీవ్స్ --------ఫ్రాంచైజీ ఓనర్ సోనియా గాంధీ...కప్టెన్ కం కోచ్, వై ఎస్ రాజసేఖర్ రెడ్డి...
ఫస్త్ మాచ్ కాగానే కెప్టన్ తెలంగాణా బాల్ ని 'చేత్తో ' పట్టుకుని 'సెల్ఫ్ ఔట్' అయ్యాడు...ఐతే తరువాతి మాచులు ఓన్ పిచ్ లో అవడం వల్ల ... కొంచెం ధైర్యంగా నే ఉన్నాడు.
' సీ ఎం' కప్ మా 'చేతికే ' వస్తుంది అని ఆయన ధైర్యంగా చెబుతున్నాడు.. తన తురుపు ముక్కలైన ఆరోగ్యశ్రీ..ఇందిరా ఇళ్ళు (ఫాస్ట్ బౌలర్లని) ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదని....తను, తన వాళ్ళు వేసే బీమర్లకి ఎదురు లేదని...పావలా వడ్డీ స్పిన్ తిరిగి అవతల వికెట్లని గిరాటేస్తుందని ఆయన విశ్వాసం.. స్వంత చానెల్ ఉండడం కూడా కొంత వరకూ లాభమే...'స్లెడ్జింగ్' చేసినా మంచిగా మార్చి...తిట్లు కూడా 'డింగ్ డాంగ్' అంటూ మార్చి చూపించొచ్చు....ఫ్రాంచైజీ ఓనర్ సోనియా ఇచ్చిన ఫ్రీ డం కూడా ఉపయోగమే....ఈ మధ్యే జట్టులోకొచ్చిన జగన్ లాంటి యువకులు అండగా ఉండడంతో ..ఆశలు అధికమయినాయి...మద్దతిచ్చిన వారికి కాంట్రాక్టులు ఫ్రీ...
తెలుగుదేశం టైగర్స్ : 'బొబ్బిలి పులి' స్ఫూర్తితో ...ఓపెనింగ్ బాట్స్ మెన్ 'బాలయ్య'...జూనియర్ ఎంటీ ఆర్ మీద బాగా ఆధార పడ్డ ఈ టీం ఓనర్..స్వర్గీయ ఎన్ టీ ఆర్ ఐనా...ప్రస్తుతం కోచ్ కం కప్టెన్ చంద్ర బాబే నడిపిస్తున్నాడు...మోనోపలి ఎక్కువ అవడం..ఈ మధ్య వచ్చిన, 'కొత్త టీం' లోకి కొంతమంది దూకడంతో కొంచెం వెనకబడ్డా...ఓపెనింగ్ జంట అదరగొట్టడంతో కొంచెం పుంజుకుంది..కానీ ఎన్ టీ ఆర్ 'రిటైర్ద్ హర్ట్' అవడం తో కొంచెం కుంటు పడింది..
'కమ్యునిస్ట్ కంగరూలు' కూడా కలవడం మంచికో...కాదో అర్ధం చేసుకునే లోపల..కొన్ని బెర్త్లు ఇచ్చేయడం వల్ల కొంచెం నష్టపోయినా...సీనియర్లు ఆదుకుంటారని ఒక ఆశ.....పైకి గంభీరంగా ఉన్నా...కొత్త ఫ్రాంచైజా టీం వల్ల కొంచెం నష్టపోయినట్టే చెప్పుకోవాలి..
' టీ ఆర్ ఎస్ టార్టాయిస్ ": తెలంగాణా టెస్ట్ టీం తెలంగాణా ఇస్తారా ఇవ్వరా అని, ఫలానా తేదీలోగా 'తెలంగాణా కప్' తెస్తామంటూ ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక తెలంగాణా వైపు నడుస్తున్న టీం, కలవడం వల్ల కూడా కొంతమంది గెలిపించే బాట్స్మెన్ ని కూర్చోబెట్టి వీళ్లకి సర్దుబాటు చెయ్యవలసి రావడంతో..ఏం జరుగుతోందో తెలీక ప్రస్తుతం మహాకూటమి మేనేజర్స్ గా బరిలోకి దిగింది...ప్రస్తుతం మల్టీకప్టన్సీతో పోరులో ఉంది..
నారాచంద్రబాబు నాయుడు అంటే
నారాయణా
రాఘవులు
చంద్ర సేఖర్ రావ్
బాబు నాయుడు గా కలిసి పోయి మాచ్ లోకి దిగారు...
చిరంజీవి చాలెంజర్స్ : కొత్తగా వచ్చిన ఈ ఫ్రాంచజీ ఓనర్ 'అల్లు' అరవింద్...వ్యూహాత్మకంగా నడుపుతున్న ఫ్రాంచైజీ ఇది...అనూహ్యంగా అతి తక్కువ వ్యవధిలో దూసుకు వచ్చిన ఈ ఫ్రాంచైజీ కోచ్ 'మిత్రా'....కెప్టెన్ 'చిరంజీవి'....'అన్న తమ్ములు', ఒకరి కోసం ఒకరు ఆడడానికి, త్యాగం చెయ్యడానికి రెడీ గా ఉన్నారు...'స్టార్లు' ఉండడంతో జనాదరణ ఉంది...ఐతే అందరూ 'టికెట్లు కొంటారా', ఎస్ ఎం ఎస్ తో 'ఓటింగ్ చేస్తారా' అన్నది తెలీదు...సడెంగా కొంత మంది కి టీం లో చోటు దక్కక వెళ్ళిపోవడం కొంచెం నష్టం కలిగించినా, కెప్టెన్ మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు... ముఖ్యంగా ఎనలిస్ట్ 'ప్రభాకర్' ..వల్ల ఎక్కువ నష్టం కలిగింది...ఐన...మా లెక్కలు మాకున్నాయని ధైర్యంగా చెబుతున్నారు....
లోక్సత్త లయన్స్ : అండర్ డాగ్స్ గా బరిలోకి దిగుతున్నా 'సత్తా' చాటగలమని ధైర్యంగా 'విజిలేసి' మరీ చెబుతున్న ఈ ఫ్రాంచైజీ ఓనర్..కోచ్ ..కెప్టెన్ 'జె పీ'....అన్నీ తనే చూసుకోవాల్సి రావడం వల్ల ఎక్కువ సమయం దేనికి కేటాయించాలో తెలీక పోయినా.....తమ నిజాయితీనే తమ టెక్నిక్ అని చాటుతున్నారు.....కొంచెం కూడా భయం లేకుండా పెద్ద జట్లతో తలపడుతున్నారు...చదువుకున్న వారంతా తమవెంటే వున్నారని...వాళ్ళు విశ్వాసంతో చెబుతున్నారు....
ఇంకా కొన్ని టీంస్ ఉన్నా ముఖ్యమైనవి ఇవే...కాబట్టి....ప్రస్తుతానికి మాచ్ చూసి విన్నర్స్ ఎవరో కనుక్కోవడమే...ఎవరు గెలిచినా ఓడినా మాన్ ఆఫ్ ది సీరీస్ మాత్రం 'జే పీ'నే....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి