బి(కిని)ల్లా
బిల్లా అంటే ఏంటో ఆ దేవుడికే తెలియాలి...తమిళం లో ఉంటే మనం వాతలు పెట్టుకోవడం ఎందుకో అర్ధం కాలేదు..మొన్నీమధ్యే నాగార్జున డాన్ అని తీసారు కాబట్టి వేరే పేరు కోసం చూసి చివరకు ఆ పేరు ఖరారు చేసుకున్నారు కాబోలు..అయిన మళ్ళీ బిల్లా రంగా అంటూ పాత సినిమా లోని పేర్లే వాడుకున్నారు...డాన్ లోనూ యుగంఢర్ లోనూ పేరు తెచ్చిన కిళ్ళీ పాట లేకున్నా బికినీల పాటలు మాత్రం ఉన్నాయి..ఓపెనింగే అదుర్స్....హెలికాప్టర్ లో వచ్చిన బిల్లా నడక, సూటు,,బూటు...తుపాకీలు తీసుకునే విధానం అన్నీ బాగాతీశారు...హెలికాప్టర్లో వచ్చిన హీరో ని మోసం చెయ్యాలని చూసి ఆ హీరో గారు నోట్లో మందు పోసుకుని మొహం మీద ఊసేదాక మంట తో సహా పాపం ఎవరూ కాలచరు...ఈలోగ హెలికాప్టర్ వచ్చి హీరో గారిని తీసుకెళ్తుంది...తరువాత బుల్డోజర్ లాంటి బుల్ బుల్ బుల్లి బుల్లి డ్రెస్సులతో బిల్లా మీద పడి ....రేపు చేస్తుంటుంది...
ప్రియుణ్ణి కోల్పోయిన హన్సిక మోతవానీ ఒక మేజువాణీ డాన్సు చేసి...బిల్లాను ఇరికించబోయి తనే చనిపోతుంది....ఇక్కడ కూడా బిల్లా వారు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చూపిస్తారు.. ఇక రెబల్ స్టారు కృష్నం రాజు గారు కొడుకులాంటి ప్రభాస్ కోసం చేసిన పాత్ర....ఆయన డ్రెస్సింగు ముఖ్యం గా జెర్కిన్ వగైరా...బ్రహ్మనందం లేని లోటు తీర్చింది..
ఇంక బిల్లా ని చంపడానికి వచ్చిన మరో బికినీ పిల్ల అనుష్క...స్విమ్మింగు పూల్లో తప్ప చంపడానికి ప్లేసు లేనట్టు...బికినీ తప్ప డ్రెస్సు లేనట్టు అన్నను చంపిన వాడిపై ప్రతీకారం అలా తీర్చుకుంది...మొత్తానికి యువకుల హౄదయాలకు బికినీ నాడా వేసి లాగుతున్నారు ధియేటర్లకి.........ఆల్రెడీ మహానటుడు ఎన్ టీ ఆర్ నటించిన సినిమా ఆల్ టైం హిట్టు కొట్టిన అమితాబ్ సినిమా అందరికీ తెలిసిన ఈ సినిమా ఇంకా ఎంత బాగా తీస్తే దాని లెవల్ అవుతుంది ? కధ పరాయి దేశంలో జరగడం తప్ప ఇంకో స్పెషల్ ఏమీ లేదు...ఇంటర్పోల్ ఆఫీసరే విలన్ ఎలా అవుతాడో అర్ధం కాదు..వేల కోట్ల వ్యాపారం చేసే వాడు ఇంటర్ పోల్ ఆఫీసర్ అవుతాడు....మలేషియాలో జరిగే ప్రెస్ మీట్లో తెలుగులో చెప్పిన విషయాలకి ప్రెస్ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, ఎర్ర డైరీ బదులు లేటెస్ట్ పెన్ డ్రైవు వాడారు..అయితే బాంకు లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవడం కూడా ఫ్లాష్ యానిమేషన్ లో చూపిస్తే ...నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు....
పోలీసుల్ని తప్పించుకునే టెన్షన్ లో కూడా బొమ్మాలీ అంటూ పాట పాడుకునేంత గట్స్ ఉన్న బిల్లా చూడాలంటే మనకూ గట్స్ ఉండాలి ముఖ్యంగా ఫామిలీ తో వెళ్ళాలనుకుంటే...బికినీ సైజంతైనా 'బుర్ర ' వాడి, కొత్త కధతో సినిమా తీసే రోజులు ఎప్పుడొస్తాయో....
7 కామెంట్‌లు:
జనాల్ని చావగొట్టాలంటే ఒక కొత్త దుడ్డుకర్ర చెక్కుకునే ఓపిక్కూడా లేకుండ పోయింది మనోళ్ళకి. పాద్దానికీ కాస్త మసిబూసి మారేడు కొమ్మ చేసి మన బుర్రలు చితక్కొడుతున్నారు.
అసలు అమితాభ్ సినిమాని చూసి రామారావు యుగంధర్ తియ్యడమే ఒహ వేష్టు. మరి తమిళ బిల్లా యెలాగుందో .. ఆ మట్టుకి నేణు బతికి పోయాను. మళ్ళి మొన్న హిందీ వోళ్ళు మసిబూసిన తద్దినం అదొహటి వాంతొచ్చింది. ఇప్పుడు మళ్ళి ఇది .. ఈ పాచి బట్టిన పాయసం తప్ప .. అంతేలే, చేసుకున్నోరికి చేసుకున్నంత మెహరయ్యా అని!
మీరు చాలా గొప్పవారండీ సినిమా మొత్తం చూశారు. నేనైతే ఇంటర్వెల్ని సద్వినియోగం చేసుకున్నాను (పారిపోయాను అని నా కవి హృదయం). ఒక్క డైలాగూ సీరియస్‌గా లేక పోవడం ఈ సినిమా ప్రత్యేకత మీరన్నట్లు బ్రహ్మానందం ఇక అఖ్ఖర్లేదు.
bagundi bikinilla
అనుష్క, నమితల బికినీల కోసం వెళ్ళినవాళ్ళ ఆశ తీరుతుందంటారు. హేమిటో ఈ తెలుగు సినిమా మాయ!
అసలు ఇది సినిమానా ? మొత్తం సినిమాలో ఒక అరగంట ప్రభాస్ అలా నడవటంలోనే అయిపోతుంది. అరగంటకు ఒక సారి అలాఆఆఅ నడుస్తూ ఉంటాడు.. వెనకాల పేద్ద మ్యూసిక్... అబ్బా తల నొప్పి వచ్చేసింది. :( నమిత మాత్రం భయంకరంగా ఉంది. :)
chala bagundi. miru kuda releasayina prati cenima chusi eela review raste baguntundemo?
అనూష్క, నమితలని ఒదిలెయ్యండి. నాటి యుగంధర్ లోనే జయసుధ (నిఝం.. జయసుధే!) బికినీ లాంటి స్విమ్ సూట్ వేసుకుంది. ఐనా యుగంధర్ ఆడలా. ఈ స్విమ్ సూట్లు, బికినీలు చెత్త సినిమాలని కాపాడలేవని ఎప్పటికి తెలుసుకుంటారో దర్శక నిర్మాతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి