ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జీరోయిన్లు ...

జీరోయిన్లు ...
ఏంటో..అందంగా...కంటికి ఇంపుగా..చక్కని మేకప్పులో బ్లాక్ అండ్ వైట్ అయినా..ఎంతో హాయిగా...చూడముచ్చటైన దుస్తులతో ఉండే హీరోయిన్లని చూసి ఎన్నాళ్లయిందో..
అదేంటో సినిమా హాళ్ళలో ఆడకో యేమిటో గానీ ఈమధ్య కొత్త సినిమాలు తెగ వచ్చేస్తున్నాయి టీ వీల్లో..అందులో ఒక్క సినిమాలోనూ మన తెలుగు హీరోయిన్లు కనిపించరు..
చూడముచ్చటగా ఉండే ఆ రోజుల్లో హీరోయిన్లలో సావిత్రి, దేవిక, రాజసులోచన లాంటి వాళ్ళు అందంగా ఉండడమే కాక అభినయం కూడా ఎంతోబాగుండేది అందుకే కధలో కూడా వాళ్ళకి మంచి ఇంపార్టెన్సు ఉండేది..ఇప్పుడు కధానాయకలకి భాష రాదు..వాంపు లాంటి డ్రస్సులు వేసుకుని రాంపుల మీద పిల్లి నడకలు నడవడం తప్ప ఇంపుగా నాలుగు ముక్కలు మాట్లాడడం రాదు కాబట్టి..ఏదో గుడ్డ పీలికలు తగిలించి..పళ్ళు బిగబట్టి చిన్న చిన్న సీన్లు తీసేసి...ఆపైన వళ్ళంతా వూగిపోయే పాటలు ఆటలు తో సరిపెట్టేస్తున్నారు..ఇక మిగిలిన టైము అంటే హీరోయిన్ గారు చెయ్యాల్సిన టైముని అటు హీరో గారి లాగుడు డైలాగులకో...లేకపోతే..హీరోయిన్ చుట్టూ వుండే ఆమె వదినల బ్రుందానికో..హీరో చుట్టు వుండే కమెడియన్ మూక కో పెట్టి మన ప్రాణాలు తీస్తారు..ఇదీ కాక పోతే ఏ సూమోల చేసింగ్ సీన్లతో నో మన బుర్ర రామకీర్తన పాడిస్తారు...
అంతే తప్ప హీరోయిన్ కి తెలుగు నేర్పించరు..తెలుగు హీరోయిన్లని తీసుకోరు..ఎందుకంటే స్టార్టింగ్లోనే మనవాళ్ళు బరి తెగించరు కాబట్టి..
ఇంక ఈ మధ్య ఫాషన్ విషయానికి వస్తే హీరోలు..సిక్ష్ పేక్ అని కండలు పెంచేస్తున్నట్ట్లు..హీరోయిన్లు అదేదో జీరో సైజుట అలా తయారు అవుతున్నారు..అసలే సినిమాలో పాత్ర అంతంత మాత్రం కనపడుతుంది..హీరొ..ఆయన కామెడీ మిత్రులు..హీరోయిన్ చుట్టు వుండే బంధు మిత్రులు మధ్యలో హీరోయిన్ ని వెతుక్కోవడం కష్టం ఇంక ఈ జీరో సైజుకూడా ఐతే ఇంక తెలుగు సినిమాలో ఆమె పాత్ర జీరోయినే....
నాన్నా అతిగా కండలు పెంచిన హీరో అతిగా సన్నబడిన హీరోయిన్ సినిమాలు ఆడినట్ట్లు చరిత్రలో లేదు..హ హా హా అదుర్స్ కదూ...

వ్యాఖ్యలు

నాగప్రసాద్ చెప్పారు…
"నాన్నా అతిగా కండలు పెంచిన హీరో అతిగా సన్నబడిన హీరోయిన్ సినిమాలు ఆడినట్లు చరిత్రలో లేదు." అదుర్స్. :)

మీ బ్లాగు open కావడానికి చాలా సమయం తీసుకుంటోంది. మీ బ్లాగులో వున్న అనవసరమైన జావా అప్లికేషన్స్ ని తొలగించండి. అలాగే అక్షరాల ఫాంటు సైజు ని largest బదులు large చెయ్యండి. ఇంకా వీలైతే టెంప్లెట్ ని కూడా మార్చండి.

--మీ బ్లాగుని క్రమం తప్పకుండా చదివే ఓ బ్లాగరి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!