Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

మంగళవారం, అక్టోబర్ 28, 2008

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...

ఇన్ ఫ్రంట్ క్రోకడాయల్ ఫెస్టివల్...
హౌస్ పెయింటింగ్ ఫెస్టివల్ నాట్...ఇల్లు అలకగానే పండగ కాదు..ఇంగ్లీష్ లో చెప్పమంటారు
...చెబితే అర్ధం కాదు..అని శంకర్ దాదా అన్నట్టు గుర్తు....సినిమా ఓపెనింగ్ కి తిరుపతి చేరిన
అభిమాన 'ప్రజా' వాహిని చూసి ఆనందిస్తున్నారు...
ఇక శ్రీకాకుళ యాత్ర తో రాజకీయ 'రహ దారులు ' ఎలా వుంటాయో కొంచెం అవగతమై
వుంటుంది..ళైట్లలో షూటింగులు,,ఫైట్లలో తగిలే దెబ్బలు..అలవాటైన వాడు కాబట్టి కొంచెం
తట్టుకోగలిగినా..జనం చూపించిన ప్రేమ వల్ల బాగానే నెట్టుకొచ్చారు...యాత్రని..
అయితే రానున్న ఎన్నికలు..పోటీలు..సీట్లు..కేటాయింపులు..లాంటి తలనొప్పులు ఇంకా చాలా
ఉన్నాయి..పండక్కి రిలీజయ్యే పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీలా, ప్రస్తుతం అన్ని రాజకీయ
పార్టీలూ..తమ తమ హీరోలని సినిమా వాళ్ళని దింపే ప్రయత్నాలలో ఉన్నారు..మెగా 'స్టారు ' కన్నా
మా 'సారు ' 'వై ఎస్సారు ' కే పాపులారిటీ ఎక్కువ అని బింకం గా చెబుతున్నా సూపర్ స్టారు క్రిష్ణ,
యువరాజు..మహేషుని,,సహజ నటి 'జయ ' సుధ, యాంగ్రీ యంగ్ మాన్ మరో 'రాజ సేఖర్ ' ఆయన
'జీవిత ' భాగ స్వామి, ధర్మవరపు, లాంటి వారిని తమ బెటాలియన్ లో చేర్చుతున్నారు
(సోనియా)గాంధీ భవన్ నాయకులు..
మరో పక్క తెలుగు దేశం వాళ్ళు నందమూరి సిం హాలు "గర్జించడానికి" గుంటూరు లో సన్నాహాలు
చేబట్టినాయి..కాక పోతే..'కాక ' మీద ఉన్న నందమూరి అభిమానులు 'బాలయ్య 'ను కాబోయే సీ ఎం
గా చూడాలనుకుంటున్నారు..యువ సిమ్హాలు కూదా బాబు గురించి కాక బాబాయి గురించే ఎక్కువ
చెబుతున్నారు.... 'గర్జన ' సంగెతెలా ఉన్నా ఈ విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం
ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం లో
మరో పక్క ఎవరు తమ పార్టీకి ఎక్కువ కోటా సీట్లిస్తారో ఈసారి ఎవరికి మద్దతిస్తారో తెలీక బీపీ పెరిగిన
బీజేపీ తమ వంతుగా కోటా, కృష్ణం రాజు..ని నమ్ముకుంటున్నారు..
టీ ఆర్ ఎస్ లో హీరో ఒకే ఒక్కడు కే సీ ఆర్..ఎన్ టీ ఆర్, వై ఎస్ ఆర్, మెగా స్టార్ ఎవరొచ్చినా సరే,
ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సింగిల్ హాంద్ కే సీ ఆర్..అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నా..తెలంగాణా
కి సై అంటే ఎవరైనా ఓకే అంటున్నారు...
ఇక బరిలో ఉన్న ఏకైక హీరోయిన్ 'విజయ ' శాంతి..తల్లి తెలంగాణా కోసం పోరాడుతోంది..
ఇవన్నీ ఇలా ఉంటే నాకర్ధం కాని విషయం ఒకటుంది..చిన్న గల్లీలోనైనా..చిన్న టీ వీ షూటింగు జరిగినా విరగబడి చూసే జనం,, బట్టల షాపు ఓపెనింగులకి
హీరోయిన్లు వస్తే రోడ్డు నిండా ఆగి చూసే జనం..స్టూడియోల ముందు నిలబడి కారులో ఉన్న తమ
హీరోలని నల్ల అద్దాల్లోంచి చూసి ఆనందించే జనం..హీరో ఇంట్లో పెళ్ళి వేడుకలైతే ఎదురుగా కరెంటు
పోలెక్కి చూసే జనం...(నిజంగా కనపడుతుందా అని కూడా ఒక డౌటు) ...ప్రజా అంకిత సభలకి,,
గర్జనలకి, హాజరయ్యే జనం ..వాళ్ళ అభిమానం వోటుగా మారుతుందా అని? అసలు వాళ్ళు వెళ్ళే
సరికి వాళ్ళ ఓటు ఇంకా ఉంటుందా అని...కాంగ్రెస్స్ లో ఎన్ టీ ఆర్ అభిమానులు, తెలుగు దేశంలో
చిరంజీవి అభిమానులు ఇలా ఉండరా అని...
నిన్నటి దాకా షూటింగు కి కొబ్బరికాయ కొట్టిన దగ్గరనుంచీ గుమ్మడికాయ కొట్టే వరకు హడావిడి
చేసి..ఆడియో రిలేజు నుంచి సినిమా రిలీజు వరకు ఎంజాయ్ చేసి..ధియేటర్ లకి రంగులేసి..కటౌట్లకి
దండలేసి..పోస్టర్ లకి తిలకాలు దిద్ది..టికెట్లకు లైనులో నిలబడి సినిమాలో విజిల్సు వేసి..వంద
రోజుల ఫంక్షను కోసం ఎదురు చూసే అభిమాని రక్తం పంచుకు పుట్టక పోయినా రక్తం పంచే
కార్యక్రమంలో పాల్గొన్న తమ్ముళ్ళ లాంటి అభిమాని ఇప్పుడు సడెన్ గా కార్యకర్తగా మారి..పార్టీ జెండా
పట్టుకుని వొట్లేసే చోట లైనులో నుంచొని..(కటౌట్లు పోస్టర్లు మామూలే) వోట్లేసి గెలిపించే పని ఎంత
త్వరగా నేర్చుకుంటారో మరి...
నిజంగా అభిమానులకి తమ హీరో చేసేవి 'అన్నీ ' నచ్చితే హీరో ఎంతో 'ఇష్టపడి ' కష్టపడి చేసిన ప్రతీ
సినిమా హిట్ అవ్వాలి కదా..ఈ సినిమా ఫ్లాప్ అయితే మరో ఏడాదికి కొత్త సినిమా వస్తుంది..కానీ
రాజకీయాలలో ఎన్నికల సినిమా ఫ్లాప్ అయితే ఐదేళ్ళ వరకూ మరో సినిమా ..కష్టమే..
పార్టీలో కూడా తన అభిమానులు..అభిమాన సంఘం అధ్యక్షుడు, ఇతర పార్టీలనుంచీ జాయిన్ అయ్యే
రాజకీయ నాయకులు,,మేధావులు..బడుగు వర్గాల నాయకులు...లాంటి వారందరిలో ఎవరికి టికెట్టు
ఇవ్వాలో కొంచెం కష్టమైన పనే...

కామెంట్‌లు లేవు:

LinkWithin

Related Posts with Thumbnails