ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బీరకాయ్....

స్టోరీ ఉన్నా లేకపోయినా పెద్ద హీరో ఉంటే, ఆడినా ఆడకపోయినా సూపర్ హిట్టు - బ్లాకు బస్టరు - బాక్సాఫీసు బద్దలు - కలెక్షన్ల వర్షం గట్రా ....
రెండు పెద్ద పేద్ద ఇళ్ళు - ఇంటినిండా జనాలు - నౌకర్లు - చుట్టాలు - గట్రా ఉంటే అది గొప్ప ఫ్యామిలీ సిత్రం - నందులు గట్రా అవార్డులు
ఒక్క మగాడు కొడితే ఎముకలు ఇరిగిపోయి - మెదళ్ళు చిట్లి కపాలాలు పగిలిపోతుంటే - కోమాలోకెళ్ళిపోతుంటే అరుపులు పెడబొబ్బలు తొడ కొడితే రైళ్ళు - మీసం మెలేస్తే సూమోలు గట్రా పేలిపోతుంటే యాక్షన్ సినిమా ఫాక్షన్ సినిమా
కోటలు - కట్టడాలు - గ్రాఫిక్కుల్లో సెట్టింగ్లులు గట్రా వేసేసి - హిస్టరీ లో ఒక పేరు వాడేసుకుని - హీరో గారి కొసం మొత్తం మార్చేసి - అసలు కధని మొలతాడులో తాయెత్తు లా కనపడకుండా చేసేస్తే అవి హిస్టారికల్ - అదే చారిత్రాత్మక సిత్రాలు..
ఆట బొమ్మల్లా గన్నులు పట్టుకు తిరుగుతూ, పాటల మధ్యలో కూడా అడ్డదిడ్డంగా కాలుస్తూ - కావాలంటే సీ ఎం లని మినిస్టర్లని గట్రా ఇరగేస్తూ - అర్ధం లేని మారు వేషాలు - అర్ధం కాని అండర్ కవర్ ఆపరేషాన్ లు గట్రా ఉండేవి పోలీసు సినిమాలు
ఇలా సెప్పుకుంటూ పోతే సానా రకాలు. అందులోనూ మన హీరోలు - పులులు సింహాలు ఏనుగులు ఇంకా ఇంకా కదా..

నీకు సినిమా చూడ్డం రాదురా.. పోనీ నువ్వు తియ్యరా... నీకెందుకురా .... ఐతే మానేయ్ టైపులో ...ఇంక బీరకాయ్ ఫాన్స్ దాడి షురూ...
Like
Comment
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!