మా నాన్న గారు RTC లో పని చేసేటప్పుడు ప్రస్థానం పత్రిక కోసం 1992 లో వ్రాసింది.. ఎందుకో షేర్ చెయ్యాలని పినిచింది.. బస్సుకీ మాట వస్తే
.. ఇలా అనేదేమో ..
.. ఇలా అనేదేమో ..
ప్రస్థానం
సమయానికి గమ్యం చేర్చడం నా లక్ష్యం
కావాలని చేయను ఏనాడూ ఆలస్యం
కావాలని చేయను ఏనాడూ ఆలస్యం
నింపుకుంటూ ట్యాంకు నిండా డీజిలు
చేస్తూ పోతా ప్రతి చోటా మజిలీలు
చేస్తూ పోతా ప్రతి చోటా మజిలీలు
నే తిరుగుతాను ప్రతీ ఊరి మలుపు
నే తడుతుంటాను ప్రతీ గ్రామం తలుపు
నే తడుతుంటాను ప్రతీ గ్రామం తలుపు
నే చేరుకుంటా గమ్యం ఎండా వానా చలులు తట్టుకుని
నే కోరుకుంటా నా పాంథులంతా క్షేమంగా ఉండాలని
నే కోరుకుంటా నా పాంథులంతా క్షేమంగా ఉండాలని
ఎక్కడో ఏదో జరిగితే
పగిలేను నా అద్దం
అది ఎనిమిది కుటుంబాల ప్రారబ్ధం
పగిలేను నా అద్దం
అది ఎనిమిది కుటుంబాల ప్రారబ్ధం
ఎవరో ఎవరిపైనో అలిగితే
రాళ్లు విసిరి చేస్తారు నా ఒళ్ళు హూనం
అది నీకు నాకే కాదు యావజ్జాతికీ అవమానం
రాళ్లు విసిరి చేస్తారు నా ఒళ్ళు హూనం
అది నీకు నాకే కాదు యావజ్జాతికీ అవమానం
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి