ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జబ్బర్దస్త్ - ది శారీ స్టార్స్ Show

జబ్బర్దస్త్ - ది శారీ స్టార్స్

సాధారణం గా ఈ టీవీ అంటే కొద్దో గొప్పో ఫామిలీ చానెల్ గా పేరుంది. కానీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం తో ఎందుకు పాడు చేసుకుంటుందో తెలీట్లేదు. పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ లాంటి బూతు ప్రోగ్రాం లు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో మరి.

కామెడీ అంటే ఒకళ్లనొకళ్లు తన్నుకోవడం.. బూతు మాటలకి జడ్జీలు పగలబడి నవ్వడం..నాలుక కొరుక్కోవడం...లాంటి వెకిలి చేష్టలే అని జస్టిఫై చేసేస్తున్న ముదనష్టపు ప్రోగ్రాం.

ఇక స్త్రీ పాత్రలలో ఆ కమెడియన్లు చేసే వికృత చేష్టలు.. చీర పైదాకా లాగి తన్నుకోవడాలు..భాష, కింద పడి దొర్లడాలు.. మీసాలు గడ్డాలతోనే వేషాలు.. తీసుకునే ఇతివృత్తాలు చూస్తుంటే యత్ర నార్యంతు పూజ్యంతే అనే శ్లోకం పుట్టిన దేశంలోనే ఉన్నామా అనిపిస్తుంది. కామెడీ చేయగలిగే మహిళా కళాకారులే కనపడలేదా..లేకపోతే ఇలాంటి పాత్రలు వాళ్ళకివ్వలేమని వీళ్లే చేసేస్తున్నారా అర్ధం కావట్లేదు.

ప్రోగ్రాం చివర్లఒ మీరూ ఇందులో పాల్గొంటారా ఐతే సంపరదించండి అంటూ ఓ ప్రకటన చేస్తున్నారు. మరి ఇన్నాళ్ళైనా ఒక్క కొత్త కళాకారుడు కనపడలేదు. మరి ఇంత పాపులర్ ప్రోగ్రాం కి ఎవరూ ట్రై చేయట్లేదా..లేదా వీళ్ళ స్టాండర్డ్ అందుకోలేక పోతున్నారా ? ప్రొగ్రాం ఎవరిదైనా వచ్చే చానెల్ మీద ఆ ప్రభావం ఉంటుంది. కేవలం టీ ఆర్ పీ ఆధారంగా ప్రోగ్రాం లు వేసేటట్టైతే ఇంకొన్ని బూతు ప్రోగ్రంలో సినిమాలో వేస్తే కూడా టీ ఆర్ పీ పెరుగుతుంది..మరి.

ఇటీవల ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లో ఇదే కమెడియన్ ల టీం ఒక కామెడీ చేసింది.. జనం లో ఒక్కరికైనా నవ్వు వచ్చిందేమో చూడండి.. బసంతి అంటే షోలే లో గుర్రం అని ఆ కమెడియన్ చెప్తున్నంత సేపూ జనం అసహనం గా చూడడం లైవ్ లోనే వచ్చింది. అలాగే చిరంజీవి,మహేష్ బాబు, రజనీకాంత్ లని ఇమిటేట్ చేస్తూ ఏదో చెబుదామని ప్రయత్నించిన అంశం కూడా ప్రాక్టీస్, ప్రిపరేషన్ లేక పోవడం వల్ల చివరకు అర్ధం లేకుండా అర్ధం కాకుండా మిగిలిపోయింది.

ఈ మధ్య బాపు గారి సన్మానం కార్యక్రమం లో కూడా.. బాపు గారు , బాలు గారు, మనో ,సాయి కుమార్ లాంటి వాళ్ల ముందు ఒక శవం దాని ముందు పేకాడుతూ తాగుతూ పాటలు పాడుతూ చేసిన ఒక కామెడీ యాక్ట్ చూసి జనాలు యాక్ థూ అన్నారు.

ఇక జబర్దస్త్ యాంకర్.. తెలుగు రాకపోవడం.. జబ్బలు కనిపించేలా డ్రెస్సు, లాంటివి మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నరేమో అనిపించే మహాతల్లి.

మరి రోజా - నాగ బాబు ఈ ప్రోగ్రాం ని ఇంట్లో వాళ్లతో కలిసి చూడగలుగుతున్నారా ? ఏమో నేనే ఎదగాలేమో ?

ఆ మధ్య గరికిపాటి వారు చేసిన సంభాషణల్లో కూడా జనం హాయిగా నవ్వుకున్నారు.

ఈ సారీ స్టార్లని ఇంకెన్నాళ్ళు భరించాలో మరి ..

నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

వ్యాఖ్యలు

maheshudu చెప్పారు…
Yes that program is worst than mayadweepam program

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!