రంగు పడుద్ది!
అబ్బ ఆ పిల్ల చూడండి రంగు మెరిసిపోతోంది, వాణ్ణి నమ్మొద్దురా రంగులు మార్చే ఊసరవెల్లిరా వాడు, అబ్బ ఆకాశం చూడు ఇంద్రధనస్సు ఎన్ని రంగులో, ప్రకృతి రంగు రంగుల పూలతో శోభిల్లుతోంది, బిల్లు చూడంగానే మొహం లో రంగులు మారాయి, తలకు రంగులేసినంత మాత్రాన వయసు దాగుతుందా,రంగుల రాట్నం, రంగుల ప్రపంచం, రంగస్థలం, అబ్బ చెప్పుకుంటూ పోతే మన జీవితమే రంగుల మయం.. కానీ స్వచ్చమైన ప్రకృతి సిద్ధమైన రంగులొదిలేసి..కెమికల్స్ తో నిండిన రంగులతో పండగ చేసుకుని..ఇంకా కాలుష్యం నింపుతూ.. ఆరోగ్యం పాడుచేసుకుంటూ హోలీ పండుగ విశిష్టతని పాడు చేస్తున్నాం. రుతువు మారే సమయం..యెండా కాలం మొదలయ్యే కాలం, వసంతోత్సవం గా మొదలై.. ఎటుపోతోందో అర్ధం కావట్లేదు.. అందరికీ హోళీ పండుగ ఆనందంగా జరగాలని ఆశిస్తూ.. హోళీ శుభాకాంక్షలు.. !!
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి