క్రియే టివ్ టివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమా - మొగుడు.. భరించే వాడు భర్త కాబట్టి మనం భరిస్తాం కాబట్టి అది మనకూ సరిపోతుందనిపిస్తుంది..
ఆ మధ్య దూకుడు అని ఫక్తు యాక్షన్ పైపెచ్చు పోలీసు సినిమా వచ్చింది కానీ అందులో ఎంతమందిని చంపినా రక్తం చూపించలేదు..ఇది ఫక్తు ఫ్యామిలీ సినిమా ఐన రక్తం హీరోగాఇ నెత్తిమీంచి వరదలై పారుతుంది..
హీరోయిన్ ఇంట్రడక్షనే తాగేసి రోడ్డు మీద తూలుతూ కనిపిస్తుంది..హీరోగారు రక్షిస్తారు..మళ్ళీ మనం మిస్ అవుతామేమోనని...ఎలా తాగింది...ఎంత తాగింది...అని బ్యాక్ డ్రాపులో చూపిస్తారు.. ఇక హీరోగారు రాత్రి ఇంటికి తీసుకొచ్చినందుకు మంచితనం చూసి హీరోయిన్ను, హీరోయిన్ హోటల్ లో మిగిలిన ఫుడ్డు స్లం లో పంచడం చూసి హీరోగారు (వీరు తండ్రిని పేరు పెట్టి ప్రసాదు అని పిలుస్తుంటారు)... ప్రేమించేసుకుని... పెళ్ళికి హడావిడిగా ఏర్పాటు చేసుకుని అంతే హడావిడిగా విడిపోతారు...
అసలు సినిమా ప్రారంభంలోనే సామూహిక వివాహాలు జరిపించే 'పెద్ద మనిషి ' రాజేంద్ర ప్రసాద్ గారు తాళి కడుతుంటే పెళ్ళీకొడుకులని ఆపి...పెళ్లి యొక్క గొప్పదనాన్ని వివరిస్తారు.. తన కొడుకు పెళ్ళీలో గొడవ చేసి విడాకులిప్పిస్తారు..(సంతకం వరకే) ...మధ్యలో హీరోయిన్ అన్నకి అసలు హీరో అంటే కోపమెందుకో అర్ధం కాదు...కనిపిస్తే బుర్ర బద్దలుకొట్టేస్తుంటాడు..
లక్కీగా డైలాగులు చాలా తక్కువ.. ఎందుకంటే సగానికి పైగా సెన్సారు కత్తెరకి తెగిపోయాయి.. అదేంటో తాగిన విషయం గుర్తొచ్చిన హీరోయిన్ 'ఓహ్ ఫ** ' అనే మాట బూతుగా అనిపించలేదో వినిపించలేదో.. అది మాత్రం ఉండిపోయింది.. తల్లీ కూతుళ్ళు మాట్లాడుకునే సన్నివేసాల్లోఅ ఆవేశంలో అనుకునే మాటల్లోవి కట్ ఐనాయి.. ఏమో రేపు ఉత్తమ కుటుంబ కధా చిత్రం గా నంది వచ్చినా ఆస్చర్యం లేదు...రెండు కుటుంబాల మధ్య కధ కదా.. ఐనా తెలుగు సినిమా చూసి లాజిక్ వెతికే నా అమాయకత్వానికి నేనే జాలిపడుతున్నా..
లండన్ టికెట్టుతో మారిషస్ లో దిగి... విదేశం లో విషం తాగి .... చెప్పుకుంటూ పోతే... ఆహా ఏమి నా భాగ్యమూ ... ఇది వరకూ సినిమా చూస్తే అమృతాంజనం వాడాల్సి వచ్చేది ..ఇప్పుడైతే న్యూజెన్ మాత్రమే గతి..
ఎటూ టీ వీల్లో సూపర్ హిట్టు.. బంపర్ హిట్టు.. మంచి కధా .. అదీ అంటూ
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి